Thursday, January 04, 2018

మీకు తెలుసా?మీరు గుప్త విరాళాలు చాలా ఇచ్చారు.


పెట్రోల్ నింపడం ద్వారా ...వినియోగ వస్తువులు విరివిగా కొనటం ద్వారా,ఇప్పుడు బ్యాంకుల్లో దాయటం ద్వారా కూడా మీరు ఇచ్చేగుప్త విరాళాలు
ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి.
ఎలా?
31 రూపాయల పెట్రోలు 72 రూపాయలకి కొనుగోలు చేయటం వలన మీరు పరోక్షంగా విరాళం చేసినట్లే
ఎందుకంటే ఈ దేశంలో కొందరు వ్యక్తులు 35 రూపాయలు గోధుమలు 2 రూపాయలలో పొందుతారు
40 రూపాయల రైస్ 1 రూపాయలలో పొందవచ్చు.స్తోమత ఉన్నా ఉచిత విద్య ఉచిత కరెంటు,వైద్యం ప్రయాణం భోజనం అన్నీ ఉచితమో లేకపోతె రాయతీ.
మరి కొందరు ఆఫీసుల్లో కూర్చున్నందుకు జీతం తీసుకుంటారు , పని చేసినందుకు లంచం తీసుకుంటారు.
దేశం వారిని పోషించాలి మీరు ఆ దేశం కోసం సంపాదించాలి.అజమాయిషీ కి ఎన్నుకుని మరీ నియమించుకున్న నాయకుల కోసం కష్టపడి సంపాదించాలి
సంపాదించి దాని ద్వారా
30% ఆదాయం పన్ను కట్టాలి
28% GST,కట్టాలి
పెట్రోల్ లో 10% కట్టాలి
స్థానిక పన్ను 10% కట్టాలి
ఆతర్వాతే మిగిలితే మీరు తినాలి.మీరు పోషించేవారు కనుక మీకు యీ రాయతీలు వుండవు.వుండకూడదు
అప్పుడే దేశంలోని పేద ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంట్లో సుఖంగా ఉండేటట్లు ఇల్లు,స్తలాలు ఇవ్వ గలుగుతాం ,వారు తక్కువ ధరలకే భోజనం చేయగలుగుతారు. వారి పిల్లలు విదేశాలలో చదవగలుగుతారు, వారి ఆస్తి 4 సంవత్సరాలలో 4 సార్లు.రెట్టింపు చేయగలుగుతారు
జీవితకాలంలో పెన్షన్ పొందుతారు!

మీరు ఒక సాధారణ వ్యక్తి, మీకు ఇల్లు వున్నా లేకపోయినా ఫర్వాలేదు, మీ కోసం, మీ పిల్లలు, కుటుంబం కోసం కాదు దేశం కోసం సంపాదించాలి .అయినా మీకు దేశ నాయకుల ఓదార్పు కావాల్సినంత వుంది చాలదా?
రండి దేశం లోని ఈ గొప్ప నాయకులకోసం అవినీతి అధికారుల కోసం,సోమరిపోతులైన ప్రజలకోసం మరింత డబ్బుసంపాదిద్దాం .వారి కివ్వ గా మిగిలిన డబ్బు మూటకడదాం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card