కొన్ని మాటలూ, పాటలూ, కవితలూ దయలేనివి! కదిలించీ, కంపించి పోయేట్లు చేసి.. మనలోకి మనం పుప్పొడిలా రాలిపోయేలా చేస్తాయి.
‘…నహీ ఆయే కేసరియా బల్మా హమారా..’ అంటున్న శుభా ముద్గల్ స్వరంలో మునిగి, ఆ భావావేశంలో ఊపిరాడక ఉగ్గపట్టినట్లుండగానే ‘యే బారిష్ గున్‌గునాతీ థీ…….’ అంటూ గంభీరంగా గుల్జార్
గొంతు పొదవిపట్టుకుంటుంది.. ఆ మరునిమిషంలోనే ఆ పదాలు తడిచిన కనురెప్పల గుండా గుండెని పెకలించివేస్తాయి!
వెలుతురూ, చీకటితో సంబంధం లేకుండా చుట్టూ నిశ్శబ్దం ఒక కంచెలా పాతుకుపోతుంది. ఎక్కడో మనకి
సంబంధంలేని అడవిలోతన మానాన తాను కురుస్తున్న వర్షం
అకస్మాత్తుగా రెక్కలు విదిల్చుకుంటూ
వచ్చి మన తలుపవతలే కురుస్తున్నట్లు… ఎన్నెన్నో సంగతులు.. బుజ్జగించేవీ, పదునైనవీ, వణికించేచీ… ఏవేవోజ్ఞాపకాలు ఆ కంచె లోపల చేరతాయి.
ఎంతసేపనీ, ఎన్నిరోజులనీ ఇంక లెక్కలనవసరం!
రెయిన్‌కోట్ సినిమాలో ‘పియా తోరా కైసే అభిమాన్ ‘ పాట, మధ్య మధ్యలో గుల్జార్ స్వయంగా వినిపించే ఈ కవితా ఆ కోవలోకే వస్తాయి.
మూలం:
Kisi mausam ka jhonka tha…
Kisi mausam ka jhonka tha…
Kisi mausam ka jhonka
tha
Jo iss deewar par latki tasveer tirchhi kar gaya hai
Gaye sawan mein ye deeware yun seeli nahi thi
Na jane kyun iss dafa inn mein seelan aa gayi hai
Daraarein pad gayi hain
Aur seelan iss tarah behti hai jaise
Khushk rukhsaaro par geele aansun chalte hain
Ye baarish gungunati thi isii chhat ki mundero par
Ye ghar ki khidkiyon ke kaanch par ungliyon se likh jaati thi sandese
Bilakhti rahti hai baithi hui ab band roshandano ke peechhe
Dopehre aisi lagti hain
Bina moheron ke khali khane rakkhe hain
na koi khelne wala hai baazi, aur na koi chal chalta hai
Na din hota hai ab na raat hoti hai
Sabhi kuchh ruk gaya hai
Wo kya mausam ka jhonka tha
Jo iss deewar pe latki tasveer tirchhi kar gaya hai

(ఏదో ఈదురుగాలి వల్ల అనుకుంటా…
ఏదో ఈదురుగాలి వల్ల
అనుకుంటా
ఈ గోడకి తగిలించి ఉన్న
చిత్రం పక్కకి ఒరిగింది
పోయిన వర్షాకాలంలో గోడలు
ఇంత తేమగా లేవు
ఈసారి ఎందుకో వీటిలో తడి
చేరింది..
బీటలు వారాయి.
ఈ చెమ్మ ఎలా పారుతుందంటే
ఎండిన చెంపల మీదుగా
కన్నీటి తడి జారుతున్నట్టుంది!
ఈ వాన ఇంటి పైకప్పు మీద
తనలోతాను పాడుకుంటుండేది
కిటికీల అద్దాల మీద తన
వేలికొసలతో ఏవేవో సందేశాలు రాస్తుండేది
ఇప్పుడు మాత్రం మూసిన
వెంటిలేటర్ అవతల నిర్లిప్తంగా కురుస్తోంది!
ఇప్పటి మధ్యాహ్నాలని
చూస్తుంటే
ఏ పావులూ లేని చదరంగపు
బల్ల ఖాళీగా పరిచినట్లుంది
ఎత్తుగడ వేయడానికి ఎవరూ
లేరు.. తప్పించుకునే ఉపాయాలు అసలే లేవు!
పగలు మాయమయింది.. ఇక
రాత్రి కూడా తప్పించుకుపోతోంది
ఆసాంతం ఆగిపోయింది!
అనుకోని ఋతుపవనాల వల్లనే
అనుకుంటా
ఈ గోడ మీద తగిలించిన
చిత్రం పక్కకి ఒరిగిపోయింది!)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment