మా
అమ్మాయి స్నేహితురాలు తన కుమార్తెకి “ప్రితిక” అని పేరు పెడుతున్నారని మాఅమ్మాయి
చెప్పింది. దాని అర్ధం ఏమిటి అని అడిగింది . నాకు తెలిసినంతవరకు “ ప్రీతీ” అనో “ప్రీతిక”
అనో అనొచ్చు కానీ దీర్ఘం లేకుండా ఆ పదానికి ఏమి అర్ధమో నాకు తెలీదు బహుశా ఎవరయినా భాషా
పండితులు వివరించాలి .
ఆ మధ్య ఒకరి ఇంటికి వెళ్ళటం జరిగింది. తెలుగు
వాళ్ళే. ఆ అమ్మాయికి
ఇద్దరు ఆడపిల్లలు. ‘నీ
పిల్లల పేర్లేమిటీ?’ అని
ఆ అమ్మాయిని
కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో అడగటం జరిగింది. అందుకు ఆ అమ్మాయి ‘మా పెద్ద అమ్మాయి పేరు ‘తుషి’,రెండవ అమ్మాయి పేరు ‘మాయ’ అని చెప్పగానే నేను బిత్తరపోయాను.‘తుషి అంటే అర్ధం ఏమిటి ?’ అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి ‘నాకు తెలియదండి,’త’ కారం వచ్చేటట్లు పేరు ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి ’ పిల్లల పేర్లు’ అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో
కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి’ అని గర్వంగా చెప్పింది.’తుషి ఆంటే అర్ధం ఏమిటో మీరైనా చెప్పరా?’ అని అడిగింది.దానికి నేను, ‘తుషి" అనేది
మహారాష్ట్ర కు చెందిన ఒక కంఠాభరణ డిజైను ,బహుశా ‘బంగారం’
అని అర్ధం ఉండొచ్చు, దాని
అర్ధం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు,
’అది
సరే ,మరి ‘మాయ’
ఆంటే అర్ధం ఏమిటో చెప్పరా!’
అని అడిగింది.
‘మాయ’ ఆంటే ‘అజ్ఞానం’,’మోహం’ ఇలాంటి మరికొన్ని అర్ధాలే
ఉన్నాయి ,నాకు
తెలిసినంతవరకూ’.
అంతే అక్కడ ఒక ఇబ్బందికర నిశ్శబ్దం.
“ అసలు
Shakespeare ఏమన్నాడో తెలుసా! ‘You
may call Rose by any name, but it never loses its fragrance!‘ అని అన్నాడు. దాన్నే సి.నారాయణరెడ్డి
గారు ‘గులాబీని
ఏ పేరున పిలుచుకున్న గానీ, అది
సహజ పరీమళం వదలదెన్నడేనీ!’ అని
తెలుగులో చక్కగా చెప్పారు అని వివరిస్తుంటే, కొంత మార్పు కనపడింది వాతావరణంలో. గబగబా
చెప్పి వెంటనే బయలు దేరా
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పిల్లలకు
పెట్టుకునే పేర్లను బట్టి తల్లితండ్రుల సంస్కారం తెలుస్తుంది. శ్రీమతి సత్యభామారెడ్డి గారనే ప్రముఖ ‘స్త్రీలవైద్య’ నిపుణురాలు హాస్పిటల్ లో
పనిచేశేవారు.ఆ హాస్పిటల్ లో నాకు తెలిసిన వారు చికిత్స
పొందుతున్నారు.నాకు ‘బంధురోగి
లేక రోగబంధును’ చూడటం
కన్నా ఆ డాక్టర్ గారిని చూడాలనే కుతూహలం ఎక్కువగా ఉండేది .ఆమెను చూశాను,
పేరుకు తగ్గట్లుగానే
ఆమె అందగత్తె.అసలు,’సత్యభామ’
ఆంటే ఏమిటో తెలుసా?
సత్య అంటే నిజంగా
, ఇక భామ ఆంటే స్త్రీ
అని అర్ధం. అంతా కలిపితే ’నిజమైన
స్త్రీ ఆంటే
ఇలా ఉండాలి’ అని
అర్ధం. ఎంత చక్కటి పేరు! డా.సి.నారాయణ రెడ్డి గారి కూతుళ్ళ పేర్లు గంగ, యమున, సరస్వతి,కృష్ణవేణి . అలాగే జంధ్యాలగారి కూతుళ్ళ
పేర్లు సాహితి, సంపద.
దివంగత ఎన్టీఆర్ గారి పిల్లల పేర్లు మీకుతెలుసు.అలాగే కవి ‘జొన్నవిత్తుల’ గారి కూతుళ్ళ పేర్లు ఎంత
చక్కటి పేర్లో చూశారా! వారి అభిరుచి, సంస్కారం వారు తమ పిల్లకు పెట్టుకున్న పేర్లలో కూడా ప్రతిబింబిస్తుంది.కొన్ని
మినహాయింపులు కూడా లేకపోలేదు.గాంధీ ,నెహ్రూ, బోసు పేర్లు
పెట్టుకున్న కొందరు రౌడీలుగా కూడా చెలామణి అయ్యారు!
ఇకపోతే మరోరకం వారు ఉన్నారు! వారు మంచి (పిచ్చి)
ఛాందసులు. వారికి అదో రకం సాంప్రదాయపు పిచ్చి. ఆ ఇంటి ఆయన గొప్ప
శివభక్తుడు.కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఇంటికి ‘కైలాసం’ అని పేరు పెట్టుకున్నాడు.పరవాలేదు
ఆయన ఇల్లు ఆయన ఇష్టం. అయితే ఎవరైనా ఎప్పుడైనా ఆ ఇంటి ఆయన
ఎక్కడ ఉన్నారని
అడిగితే ,దానికి
కొందరు హాస్యప్రియులు ఇప్పుడే ఆయన కైలాసానికి వెళ్లారని చెప్పేవారు!మరొకరికి కుక్కలంటే
ఎంతో ప్రేమ! ఒక కుక్కను పెంచుకుంటున్నారు. వారు ఆ కుక్కకు ‘నంది’ అని పేరు పెట్టుకొని, ఆ కుక్కను నందీ అని పిలుస్తుంటే,వీరికి నందీశ్వరుని మీద కోపమా లేక
ప్రేమో నాకు ఇప్పటికి
అర్ధం కాలేదు!నందిని కుక్క అనకుంటే చాలులే, అని అనుకున్నాను.ఏమి చేద్దాం!
ఎవరి పిచ్చి వారికి ఆనందం! పేరులో ఏముంది? అని కొట్టి పారెయ్యకండి.
మీరైనా మీ పిల్లలు మనవళ్ళకు,మనవరాళ్ళకు చక్కటి అర్ధవంతమైన తెలుగు
పేర్లను పెట్టండి!
ఇంతకీ మా ఇద్దరు అమ్మాయల పేర్లు “లీలా
ప్రఫుల్లిక”(ప్రవల్లిక కాదు), రెండొ అమ్మాయి “హర్ష వీణ” .నా మేన కోడలు పేరు “శివ
నాగ సంహిత “ నేను పెట్టిందే. మంచి అర్ధవంతమైన పేర్లే అని నేనకుంటున్నాను
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment