Saturday, January 27, 2018

“OPERATION DECOY”


   “OPERATION DECOY”     

        The GST Officers  ride the business premises and check the sign boards, bill formats and  displays a board indicated as he is normal or composite system or not. Failing such indications the raise a demand notice instantly for rs.20000/-(Both SGST+CGST) as penalty.
           Main thing in the operation is as ‘first they send an unknown person to purchase any product on the unit worth rs.1000/-or nearly .after then he observe that the dealer raise invoice or not. If invoice raised with correct format and clearly shows tax and other details or not .after completing the procedure the person give a signal to the officers who was in hiding at nearest place and observe him. They come and enquire the dealer and take a statement and give a penalty demand with the time limit of 7 days to pay or go to appeals
They government called this as “OPERATION DECOY”

Thursday, January 25, 2018

మారాలి ..

  
ఆరోగ్యానికి దూరంగా
             కేవలం రుచుల కోసం పాకులాడే మన భోజన అభిరుచులు మారాలి.
చురుకు దనానికి కారణమైన వ్యాయామానికి
             బదులు మూర్తీభవించిన బద్దకానికి ప్రతిరూపమైన మన జీవనశైలి మారాలి.
నిర్మాణాత్మక విలువలను విసర్జించి
            ఆలసత్వానికి  ఆలవాలమవుతున్న  మన ఆలోచనదోరణలు మారాలి.
పదవులు మాత్రమే మన వ్యక్తిగత విజయాలకి గుర్తులు అంటూ
            వాటి కోసం ప్రాకులాడే  మన అవకాశ వాద విధానాలు మారాలి.
పారిశ్రామిక విప్లవం వలన కలిగే ప్రమాదాల బారి నుండి
            మన ప్రకృతిని కాపాడుకొనే విధంగా  మన ప్రయత్నాలు మారాలి.
"మారాలి".."మారాలి" అంటూ కాగితం, కలం పట్టుకుని కవితలు వ్రాయడానికి బదులు
            వ్రాసిన వాటిని కార్యాచరణ లో పెట్టడానికి మొదట నేను "మారాలి..
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Monday, January 22, 2018

GST లో కంపోజిషన్ స్కీమ్ కంటే సాధారణ స్కీమ్ నిజంగా సౌకర్యంగా మరియు లాభదాయకంగా ఉందా?






చిన్న పన్ను చెల్లింపుదారులకు నిజంగా చాలా అనుమానం కలిగించే విషయం ఇది

                               GST సాధారణ పథకం లో అనేక రిటర్న్స్  మరియు నియమాలు ఉన్నాయి. వాటినుండి చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేందుకు, ప్రభుత్వం వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల కంటే తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు కంపోసిషన్ పథకాన్ని ప్రకటించింది .
                                   ఇది చాలా మంచి విషయం . Composite Taxpayers  మూడ్నేల్లకి ఒక్కసారి మాత్రమే ఒకే ఒక్క రిటన్ దాఖలు చేయవలసి ఉంది (GSTR-4). వారు నెలలో అనేక రిటన్ దాఖలు చేసే తలనొప్పి తీసుకోకూడదు అని.
 కానీ వారు ITC (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్) ను తీసుకోలేరు మరియు వినియోగదారుల నుండి పన్నులు వసూలు చేయలేరు.

ప్రస్తుత GST రేట్లు ఒకసారి పరిశీలించండి

COMPOSITION SCHEME GST RATES
వ్యాపారం

CGT
SGST
TOTAL
Manufacturers & Traders (Goods)

0.50%
0.50%
1%
Restaurants (not serving alcohol)

2.50%
2.50%
5%
సేవా ప్రదాతలు(సర్వీసు చేసేవారు)       composition scheme పథకానికి అర్హులు కారు



ప్రస్తుతం ccomposition scheme లో పన్ను చెల్లింపుదారుడు వినియోగదారుల నుండి GSTవసూలు చేయకూడదు, కానీ అతను తన మొత్తం అమ్మకాలు పై GST చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే అతని జేబులో నుండి పన్ను కట్టాలని అర్థం.

సో, ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న పుడుతుంది, కంపోజిషన్ పథకం సాధారణ పథకం కంటే లాభదాయకంగా ఉందా? లేదా?

ఇది చాలా చర్చనీయమైన ప్రశ్న సమాధానం తెలుసుకోవడానికి,ప్రయత్నం చేద్దాం
ఒక ఉదాహరణ పట్టిక చూద్దాం ,



















NORMAL SCHEME

Vs
             COMPOSITION SCHEME


అమ్మకపు విలువ  = (1+25%) X కొనుకోలు విలువ అనుకుంటే



a
. కొనుగోలు విలువ
1000.00

. కొనుగోలు విలువ
1000.00
b
GST @ 5%

50

GST @ 5%

50
c
మొత్తం విలువ
1050

మొత్తం విలువ
1050






d
అమ్మకాలు విలువ
1250

అమ్మకాలు విలువ
1250
e
GST @ 5%
62.50

GST @ 1%
12.50
f
మొత్తం invoice విలువ
1312.50

మొత్తం invoice విలువ
1250






g
నికర GST కట్టవలసినది
12.50

నికర GST కట్టవలసినది
12.50
i
నికర లాభం {F-(C+G) )
250

నికరలాభం{F- (C + G))
200
GST LIABILITY (NORMAL) = GST LIABILITY (COMPOSITION)
కంపోసిషన్ పథకంలో GST  కట్టవలసినది సాధారణ పథకంలో GST కట్టవలసినది ఒకటి గానీ వుంది








మొదటి పట్టిక ప్రకారం కంపోసిషన్ పథకంలో GST  కట్టవలసినది సాధారణ పథకంలో GST కట్టవలసినది ఒకటి గానీ వుంది. కానీ సాధారణ పథకంలో కంటే అమ్మకపు విలువ కంపోసిషన్ పథకంలో అమ్మకపు విలువ మరియు లాభం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ సందర్భంలో,వినియోగదారునుకి తక్కువకే సరుకులు అమ్మిఆకర్షించవచ్చు
మరొక ఉదాహరణ చూద్దాం:

NORMAL SCHEME

Vs
COMPOSITION SCHEME


అమ్మకపు విలువ  = (1+28%) X కొనుకోలు విలువ అనుకుంటే

a
. కొనుగోలు విలువ
1000


. కొనుగోలు విలువ
1000.00

b
GST @ 5%

50


GST @ 5%

50

c
మొత్తం విలువ
1050


మొత్తం విలువ
1050

d
అమ్మకాలు విలువ
1280


అమ్మకాలు విలువ
1280

e
GST @ 5%
64



GST @ 1%
12.80

f
మొత్తం invoice విలువ
1344


మొత్తం invoice విలువ
1280









g
నికర GST కట్టవలసినది
14.00


నికర GST కట్టవలసినది
12.80

i
నికర లాభం {F-(C+G) )
280


నికరలాభం{F- (C + G))
2017.20

లాభం తేడా ఒక వెయ్యి కి 62.80 రూపాయలు, కోటికి  6.28 లక్షలు

GST LIABILITY (NORMAL) > GST LIABILITY (COMPOSITION)
సాధారణ పథకం లో GST కట్టవలసినది కంపోజిషన్ పథకం లో కంటే ఎక్కువగా వుంది












మూడవ పట్టిక పట్టిక ప్రకారం సాధారణ పథకం లో GST కట్టవలసినది కంపోజిషన్ పథకం లో కంటే ఎక్కువగా వుంది రెండు పథకాలలోనూ అమ్మకపు ధర ఒకటే అయనప్పటికీ లాభం తేడా వుంది. కంపోజిషన్ పథకం లో  మరింత సులభంగా రిటర్ను బాదరబందీ వద్దు అనుకుంటే . ఖచ్చితంగా composition scheme పథకం మరింత ఉపయోగకరంగా ఉంటుంది

మరొక ఉదాహరణ చూద్దాం:

NORMAL SCHEME

Vs
COMPOSITION SCHEME

అమ్మకపు విలువ  = (1+25%) X కొనుకోలు విలువ అనుకుంటే


. కొనుగోలు విలువ
1000

. కొనుగోలు విలువ
1000

GST @ 5%

50

GST @ 5%

50

మొత్తం విలువ
1050

మొత్తం విలువ
1050

అమ్మకాలు విలువ
1280

అమ్మకాలు విలువ
1400

GST @ 5%
64


GST @ 1%
14


మొత్తం invoice విలువ
1344

మొత్తం invoice విలువ
1400







నికర GST కట్టవలసినది
14.00

నికర GST కట్టవలసినది
14.00

నికర లాభం {F-(C+G) )
280

నికరలాభం{F- (C + G))
336

GST LIABILITY (NORMAL) = GST LIABILITY (COMPOSITION)

మీకు కావాలంటే     composition scheme పథకంలో తక్కువ పన్నుతో ఎక్కువ లాభం సంపాదించడానికి అవకాశం వుందని నేను భావిస్తున్నాను కూడా










  
            composition scheme పథకం చాలా సులభం మరియు త్రైమాసికంలో ఒక రిటన్ దాఖలు చేస్తే చాలు. ఈ స్కీమ్ గురించి మీరు ప్రతికూలంగా చేసే ఒక విషయం ఏమిటంటే, కంపోజిషన్ పథకం లో ఐటీసీ అందుబాటులో లేదు,కాస్తఎక్కువ విలువకి అమ్మకో గలిగితే లాబాలు ఎక్కువే
అయితే మిగిలిన లాభం ఎంత రికార్డు పని ఎంత,దాని ఖర్చు ఎంత అనేది మీ సంవత్సరపు అమ్మకాల ను బట్టి వుంటుంది,
ఇది కంపోజిషన్ పథకం గురించి నా అభిప్రాయం,
మీరు వేరే అభిప్రాయం కలిగి ఉంటే, లేదా నేను పొరబాటు  అని మీరనుకుంటే మీకు వీలయితే నాకు తెలియజేయండి.

                                                             ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
                                                                                            Tuesday, 26 December 2017

Address for Communication

Address card