Saturday, June 17, 2017

నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది





    GST విధానంలో  లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెలా GST కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.

      నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.

          VAT విధానంలో ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగియుండాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, June 13, 2017

"లెట్ మి కన్ఫెస్"




"
నరాలు జివ్వున లాగే గొప్ప అనుభవాన్ని స్త్రీ మనకిచ్చినప్పుడు, ఆ అనుభవం తర్వాతి అనుభూతిని హాయిగా నెమరవేసుకుని అమరత్వం పొందే ఆ కాన్షస్నెస్ని అద్భుతంగా చెప్పగలిగితే, అది సాహిత్యం ఎందుక్కాదు...?" అని ప్రశ్నించి మరీ కవితలు రాసేస్తే, ఆ భావప్రవాహాన్ని సాహిత్యం అనకుండా వుండగలమా!

"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"

                    కవిత్వాన్ని ఎందుకు రాస్తారో నాకు తెలీదు.అపుడప్పుడూ కవితల పేరుతో నేనూ పదాలు అల్లినా, ప్రాసల్ని గిల్లినా అదొక ప్రయత్నంగా మిగిలింది.  కొన్నిట్లో అసాధారణమ్,మరికొన్నిట్లో  సాధారణత్వం చూసి మురిసిపోయాను. భావగర్భిత ఉద్వేగాలు కొన్ని కవితల్లో చవిచూస్తే, మరికొన్ని కవితలు వేదనావేదనల్ని పదాల్లో కూర్చగా చదివాను.కానీ ఇప్పటివరకూ ఎక్కడా చాచి లెంపకాయకొట్టినట్లు షాక్ ఇచ్చే కవితల్ని చదవలేదు.ఈ మధ్యనే ఒక స్నేహితుడిపుణ్యమా అని అలాంటి కవితా సంకలనాన్నొకటి దక్కించుకుని, కొన్ని బలమైన లెంపకాయల్ని ప్లెజంట్ గా షాకింగ్ గా తిన్నాను. Its an outrageous poetry that I have ever read in Telugu.


                            అదే "లెట్ మి కన్ఫెస్" అనే పుస్తకం. 'పసుపులేటి పూర్ణచంద్ర రావు' రాసిన కవితల సంకలనం. మంగళవాక్యాలు పాడేసిన తరువాత వరుసగా మనసుతడిని, యవ్వనపు చిత్తడిని, స్త్రీపురుషుల కాంప్లెక్స్ బంధాల కథాకమానిషుని ఆద్యంత్యం అద్భుతంగా, ఆలోచనాత్మకంగా, అబ్బురపడేలా కవిత్వించేశారు.
                      పబ్లిషర్ : ELMO BOOKS ధర: Rs 75/-ప్రతులకు : విశాలాంధ్ర, నవయుగ పుస్తకాలయాలు  అని కాకుండా ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలంటే      మొత్తం సంకలనాన్నిక్కడ మక్కీకి మక్కీ దింపాలి. ఎందుకంటే, ఇందులోని ఏ కవితా స్వయం సంపూర్ణం కాదు. మొత్తం సంకలనం కూడా స్వయంప్రకాశకం కాదు. జీవితాన్ని మధించకపోతే, ముందుగా కొంత యోగం పొందకపోతే ఈ భోగం అర్థం కాదు. కవి జీవితంలోని లోతుల్ని కూసింతైనా మనజీవితంలో అనుభవించకపోతే లేక కనీసం కనీవినకపోతే obscene ideas of perversion లాగా అనిపిస్తాయే తప్ప అక్కునచేర్చుకుని ఆదరించదగ్గ అద్భుత కవితల్లా కనిపించవు. అందుకే, simply outrageous అనాల్సొచ్చింది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681



హిందువుల వేదం బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడు వ్రాసాడు



 హిందువుల వేదం  బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడు వ్రాసాడు . అలాగే రామాయణం దళితుడైన వాల్మీకి  వ్రాసాడు.  రాజ్యాంగం దళితుడైన అంబేద్కర్ వ్రాసాడు   మన అవసరం సమాజానికి  వుంటే ఏదీ అడ్డురాదు ముక్యంగా కులం.ముందు మనం ఎదగటానికి మార్గాలు ఆలోచించండి,చట్టాలు,పూర్వ చరిత్రలు,పేరుమార్పిడి ఇవన్నీ బర్రెమెడలో తాడు లాంటివి.నీటి గాబు వరకు తీసుకు వెళ్ళటానికి పనికి వస్తాయి.బలవంతంగా నీటిని తాగించలేవు.తమకిష్టమైతేనే తాగుతాయి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Monday, June 12, 2017

మా మనో భావాలు గాయపడ్డాయి




టీవీ ప్రకటనల్లో మొన్న ఓ  సినిమా చూస్తూ ఒక విపరీతం చూశాను. హీరో ఏమో విపరీతమైన ఆవేశంలో వున్నాడు. అంతెత్తున ఆకాశంలోకెగిరి మరీ ప్రత్యర్థులను చంపుతున్నాడు. సరిగ్గా హీరో అలా ఆకాశంలో వున్నప్పుడు అతన్ని అక్కడే వుంచేసి “Tide” అతని చొక్కాని తెల్లగా మార్చేసి “Tide” వాడమని చెబుతుంది. థూ ఇంతకంటే దరిద్రంగా సినిమా చూడలేమేమొ! సినిమా ఎలాగూ దరిద్రంగా వుంది గనుక సరిపోయింది.
మరో విపరీతం ఏమిటంటే ఒక సినిమాలో ఒక పాత్ర చేసిన దాన్ని మొత్తం కులానికో వర్గానికో ఆపాదించుకొని దుమారం లేపడం. సినిమా అన్నాక అందులో సమాజంలో వున్నదంతా వుంటుంది. శూద్రుడూ వుంటాడు, బ్రాహ్మణుడూ వుంటాడు. ప్రేమించడమూ వుంటుంది, వ్యభిచారమూ వుంటుంది. అవి ఆయా పాత్రలు చేసినట్టుగా భావించాలే గానీ మొత్తం వర్గానికీ ఆపాదించుకుంటే ఎలా? అయితే సినిమా తీసేవాళ్ళు భావోద్వేగాలని దృష్టిలో పెట్టూకొని విపరీతాలకు పోకుండా వుంటే మరీ మంచిది. ఇప్పుడు ఇది ముదిరిపోయింది. మమ్మల్ని హీనం చేశారు లేదా మమ్మల్ని హేళన చేశారు. ఒక వర్గంలో ఒకరిద్దరు చేసే పనులే వర్గం మొత్తానికి చెందనప్పుడు, ఒక సినిమాలో ఒక పాత్ర చేష్టలు ఒక వర్గం మొత్తానికి ఎలా చెందుతాయి!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Thursday, June 08, 2017

ప్రేమ- భక్తి




 "1. భక్తి అనేది మతపరమైన పదం.
2.
భక్తి అనేది మూఢత్వం.
3 .
నేను దేశాన్ని ప్రేమిస్త, కాని పూజించను. (పూజ కూడా మతపరమైన పదం)
4. నేను దేశ-ప్రేమికున్ని మాత్రమే దేశ-భక్తున్ని కాను-కాబోను "
పైమాటలు విని మోసపోయే అమాయకులకి నేను చెప్పదల్చుకున్నదేమిటంటే ...
నాకు నా చొక్కా అంటే ప్రేమ అనొచ్చు..కాని నాకు నా చొక్కా అంటే భక్తి అనలేము
నాకు కుక్కంటే నాకు ప్రేమ అనొచ్చు ..కాని నాకు కుక్కంటే భక్తి అనలేము
నాకు తమ్ముడంటే ప్రేమ అనొచ్చు.. కాని నాకు తమ్ముడంటే భక్తి అనలేము


పైన తెలిపిన లాంటి వాటిల్లో ప్రేమ పదాన్ని వాడొచ్చు... కాని "భక్తి" పదాన్ని వాడలేము
ఎందుకంటే పైవన్నీ మనకన్నా తక్కువవి లేదా మనతో సమానమైనవి .. అందుకే అలాంటి వాటితో కేవలం ప్రేమ! ..భక్తి కుదరదు!!

కాని...
నాకు అమ్మంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు అమ్మంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు నా న్నంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు నాన్నంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు గురువంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు గురువంటే భక్తి అని కూడా అనొచ్చు
నాకు పుస్తకమంటే ప్రేమ అనొచ్చు... అలాకే నాకు పుస్తకమంటే భక్తి అని కూడా అనొచ్చు
ఎందుకంటే పైవన్నీ మనకన్నా ఎక్కువైనవి పైగా ఆరాధించ దగ్గవి .. అందుకే కేవలం ప్రేమించడమే కాక భక్తి కూడ చేయొచ్చు..
అదే ప్రేమకి భక్తి కి తేడా...
దేశం మీద ఉండల్సింది ఎప్పుడూ భక్తే... (త్యాగం తో కూడిన ప్రేమ)
భక్తి దేశం మీద సహజంగా పుట్టే భావం -అది కేవలం భారతీయ భావము..


భక్తి ఉన్నచోటా ఎలాగూ ప్రేమ ఉంటుంది.
భక్తి ఏదో "మతపరమైన" పదం కాదు. అది ఆరాధనా భావము, త్యాగ భావము... ప్రేమకన్నా గొప్ప భావము.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card