నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం
నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురింపజేసింది. నోట్స్ చదివి బట్టీయం పెట్టి పరీక్షలు రాయడం మనం యువతీ యువకులకు నేర్పించాం. జరుగుతున్న
చరిత్రను కూడా గైడ్ రూపంలోనో,
నోట్స్ రూపంలోనో చదివితే కానీ వారికి
అర్థం కాదు. దేశంలో ప్రతి నెలా పది లక్షల మంది నిరుద్యోగుల
జాబితాలో చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో
ప్రైవేటు పరిశ్రమలు విస్తరించలేదు. సాఫ్టవేర్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయి.
ఐటీ సంస్థల విస్తరణ కూడా ఒక దశకు వచ్చి నిలిచి పోయింది. జనాభాలో సగం
మంది వ్యవసాయరంగంపైన ఆధారపడి జీవి స్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక 1998 నుంచి
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి
వీలు లేదం టూ సుప్రీంకోర్టు మొన్న ఆదేశాలు జారీ చేసింది. రైతు
సంక్షేమ కార్యక్రమాలను పునస్సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పురమాయించింది.
కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు? సుప్రీం ఆదేశం నిష్ఫలం వ్యవసాయాన్ని
ఎట్లా గిట్టుబాటు వ్యాసంగంగా మార్చాలో, పట్టణ ప్రాంతా లలో ఉద్యోగాలను
ఎట్లా సృష్టించాలో ప్రభుత్వాలకు స్పష్టంగా తెలియదు.
సబ్సిడీలు తగ్గించి
ఆర్థిక సంస్కరణలను ముమ్మరం చేసి ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయాలన్న
ధ్యాసే కానీ వ్యవసాయరంగం గురించి ఆలోచించినవారు లేరు. నరేంద్రమోదీ అధికారంలోకి
వచ్చిన తర్వాత దేశంపైకి వదిలిన నినాదా లలో 'మేక్ ఇన్ ఇండియా' ఒకటి. విదేశాలు పెట్టుబడులు పెట్టి
ఇండియాలో పరిశ్రమలు నెలకొల్పాలనీ, ఉత్పాదక రంగాన్ని విస్తరించాలనీ ఎన్డీఏ సర్కార్
ఆకాంక్ష. పెట్టుబడులు పెట్టడానికీ, పరిశ్రమలు నెల కొల్పడానికీ అనువైన వాతా
వరణం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఎకనామిక్ జోన్ ఏర్పాటు
చేసి భూమి, నీరు, విద్యుత్తు తక్కువ
రేటుకు అందజేసినట్లయితే విదేశీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం.
పరిశ్రమలకూ, ప్రాథమిక
సదుపాయాల కల్పనకూ భూమి అవసరం. ఆర్థిక ప్రగతి సైతం ఆశించినంత
వేగాన్ని పుంజు కోవడం లేదు. పరిశ్రమలూ, వ్యాపారాలూ విస్తరించడం లేదు.
ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. జాతీయ స్థాయిలో నిరుద్యోగులకు ఆశావహమైన
పరిస్థితులు కనిపిం చడం లేదు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు మరీ గందరగోళం.
ఆంధ్రప్రదేశ్లో అంతా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతోంది.
గోదావరి పుష్కరాలలో సమాచార శాఖ చేయ వలసిన పనులు ప్రైవేటు సంస్థ నిర్వహించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రైవేటు మోజు. సింగపూర్, జపాన్
తప్ప మరే మాటా మాట్లాడే పరిస్థితి లేదు. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిం
చడం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం అనే
రెండే రెండు కార్యక్రమాలపైన ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
సింగపూరు ప్రభుత్వం, కంపెనీలు అమరావతి నిర్మాణంలో కొంత మంది
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. చంద్రబాబునాయుడు విదేశీ యాత్రలు సత్ఫలితాలు
ఇచ్చి కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు విస్తరించే
వరకూ నిరుద్యోగలు వేచి ఉండవలసిందే. ప్రభుత్వం
ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్న దాఖలా
లేదు. పల్లెల్లో వృత్తులు దెబ్బతిన్నాయి. మూతబడిన పరిశ్రమలు అట్లాగే ఉన్నాయి.
కొత్త పరిశ్రమలు రాలేదు. ప్రకటనలే మినహా ప్రగతి క్షేత్రంలో కనిపించడం
లేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు.
నిరుద్యోగ సమస్య తీవ్రతని అర్థం చేసుకు న్నట్టు కనిపించడం లేదు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment