ఒక
ట్రైను టైముకి మనమే హాజరుగా వుండాలి కానీ దాన్ని ఆపమని అనలేము కదా అని మీరు
ఉపయోగించిన లాజిక్ మంచిదే కానీ మరో కోణంలో అదే ట్రైన్ గంటలు గంటలు లేటుగా వచ్చి
మనవిలువైన కాలాన్ని ప్లాట్ఫారాలతో గడపాల్సివచ్చినప్పుడు ఎవరైనా ఎందుకని ప్రశ్నించటం
లేదు? ఏమ్ ? మనది విలువైన సమయంకాదా ?,మనకి
పనులు లేవా?
ఇక
ఎక్సామ్స్ దగ్గరకువద్దాం
ఒక
నిముషమో లేదో గంటో ఆలస్యంగానైనా వస్తే ఏమవుతుంది?. ఇచ్చిన టైము సరిపోదు దాంతో
మొత్తం పరీక్ష వ్రాయలేక పోవచ్చు.పోనీ! అతనే గదా లాస్ అయ్యేది.ఇందులో
ప్రభుత్వానికేంటి నష్టం. అతన్ని అనుమతించలేదు అంటే అతనను కట్టిన ఫీజు రాకపోకలకి
అయిన ఖర్చులతో సహా తిరిగిచ్చేయాలికదా కానీ ఎందుకివ్వటంలేదు. సినిమా టిక్కె ట్ కొనేసినాక మన ఇష్టమైనపుడు వెళ్తాం లేదా మనతాం
,మన ఇష్టం. వారినేమే అడగం ,కానీ ..వారే రానివ్వకపొతే ప్రశ్నిస్తాం కదా?.?.ఒకసారి
ఫీజు కట్టించుకున్నాక ఆఖరి నిముషంవరకూ వారికి హక్కుంది. వీటికోసం ఎన్నో నిద్రలేని
రాత్రులు ప్రిపేరయ్యి,ఆర్ధికంగా మానసికంగా క్రుంగి పోయిన నిరుద్యోగులకి రకరకాల కారణాలతో కాస్త లేటయిందని నిరాకరించటం
ఏంటి ? దీన్ని ప్రభత్వ దాదా గిరి అనకూడదా?
ఈ పరీక్షా విధానాలన్ని మొదటినుంచి
బాగా పరిశీలించండి .దీని వెనుకున్న లక్ష్యం ఒక్కటే. ఉద్యోగాలు కల్పిస్తున్నామని సమాజాన్ని బ్రమింప
చేయాలి. డబ్బులు దండిగా రావాలి- రక రకాల
కారణాలతో వీలైనంత మందిని అనర్హులుగా ప్రకటించాలి. (రేపటి నోటిఫికేషన్ కి మళ్ళీ
ఎక్కువ ఫీజులు రావాలిగా -) ఇదీ అన్ని
ప్రభుత్వాల అంతిమ లక్ష్యం- మన చిన్నప్పుడు విన్న భేతాళుడు తిరిగి
చేట్టిక్కిన కధలు మాదిరిగా దీనికి అంతం లేదు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment