Wednesday, December 24, 2014

సంక్రాంతి అంటే?



సంక్రాంతి అంటే?

సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే... మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపురోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.
సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్ర వచనం

అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వ ముఖ రేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడు.

రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ఆధ్యాత్మికంగా అందరూ పై పై మెట్లు ఎక్కాలని ఆశిస్తూ.
సర్వే జనాః సుఖినోభవంతు

Thursday, December 11, 2014

అసలేమీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయా

ఇక ఈ కథకి అనువర్తన ఏమిటంటే -
లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే షేర్ ధరలు పెరుగుతాయి. బయట పడితే సత్యం కంప్యూటర్స్, గుట్టుగా కొనసాగితే... టాటాలు, బిర్లాలు, బజాజ్‌లు, అంబానీలు! అంతో ఇంతో... అన్ని కంపెనీలూ లాభాలను ఎక్కువ చేసి చూపిస్తాయని, సత్యం కంప్యూటర్స్ మోసం బయటకు వచ్చినప్పుడు అందరూ అంగీకరించిందే!

చిల్లపెంకులూ, గులకరాళ్ళతో నిండి ఉన్న బిందెని, బంగారం మణిమాణిక్యాలతో నిండి ఉందని చెప్పినట్లుగా, లేని లాభాలు ఉన్నాయని చెబుతాయి కంపెనీలు. గడువు ముగిసినప్పుడు లేదా దివాళా తీయటం లేదా రహస్య విషయాలు బయటకు రావటం వంటి సంఘటనలు జరిగినప్పుడు వాటాదారులు నష్టపోతారు. మొన్నటి సత్యం కంప్యూటర్స్ మాదిరిగా!

నిజానికి సత్యం కంప్యూటర్స్ చిన్న ఉదాహరణ! పచ్చిగా బయటపడిన ఉదాహరణ! ఇలాంటివి గుట్టుచప్పుడు గాకుండా చాలా జరిగిపోతుంటాయి. లిస్టింగ్‌లో ఉన్న కంపెనీల షేర్లు బుల్‌ల/ఏజంట్ల మాటలు నమ్మి కొన్నాక, ఆనక ట్రేడింగ్‌లో, సదరు కంపెనీలు కనబడవు. కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే, అవెప్పుడో కన్ను మూసిన కంపెనీలని తేలుతుంది. అప్పటికే అవి దివాళా తీసేసి ఉంటాయి. అంబుడ్స్‌మన్‌కి అర్జీ పెట్టుకున్నా, ఏడ్చి మొత్తుకున్నా, నష్టం పూడదు.అమాయక షేర్ హోల్డర్ ఆ విధంగా మోసపోతూ ఉంటాడు.

ఆ విధంగా కాకపోతే... ఒక కంపెనీ దివాళా తీసినప్పుడో, ఆర్దిక మాంద్యాలు సంభవించినపుడో, హర్షద్ మోహతాలు, కేతన్ ఫరేఖ్‌లు బయటపడ్డప్పుడో చాలా కంపెనీలు దివాళా తీసినప్పుడో... బిందెనిండా చిల్ల పెంకులున్నాయని వాటాదారులకి అర్ధమౌతుంది. కాబట్టి కూడా... ‘పొదుపు చేయాలనుకునే వాళ్ళు షేర్లల్లో మదుపు చేయటం కంటే ఇతర మార్గాల్లో అంటే మ్యూచువల్ ఫండ్స్, భీమా సంస్థలలో పెట్టుబడి పెట్టుకోవటం మంచిదనీ...’ ‘షేర్లు కొనటం, స్వల్ప వ్యవధిలోనే అమ్మటం వంటి వ్యాపార ధోరణి ఉన్న వాళ్ళు, షేర్ల క్రయవిక్రయాలకు దిగటం మంచిదనీ’ ఇటీవల ప్రచారంలోకి వచ్చింది.

అదీ ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ఊపందుకున్న ప్రచారాల్లో ఒకటి. రెండు దశాబ్దాల క్రితమైతే, తెలివైన పెట్టుబడి షేర్లలో పెట్టటం అనే ప్రచారం ఉండింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు గురించి తర్వాతి టపాలో వివరిస్తాను.

"లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే వాళ్లకి ఏం లాభం? వాటాదారులకి (share holders) లాభాలు పంచడం అంటే నష్టపోవటమే కదా? కంపెనీలు ఎందుకలా చేస్తాయి?" - అనిపిస్తుంది సామాన్యులకి! కాబట్టి అది నిజమని నమ్మబుద్దికాదు. ఎందుకంటే - దీని వెనుక ఉండే కారణం అత్యంత బలమైనది; అది బయటకు రానిది కూడా కాబట్టి!

అంతే కాదు, చిల్ల పెంకులు నింపిన బిందెని, బంగారం మణిమాణిక్యాలని చెప్పి అమ్మినట్లుగా, కంపెనీలన్నీ, "అసలేమీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయా?" అనుకుంటాం కూడా! చేస్తాయి? "ఎందుకు, ఎలా చేస్తాయి?" అంటే... వివరంగా చెబుతాను.

జాతీయ బ్యాంకుల బ్రాంచీలు అన్ని ఊళ్ళల్లో ఉంటాయి. ఆ బ్రాంచీల మేనేజర్లు, తమ వినియోగదారుల నుండి డిపాజిట్లు సమీకరించటం, ఖాతాదారులని ప్రోత్సహించటం, అర్హులకి అప్పులివ్వడం చేస్తుంటారు. ఖాతా ప్రారంభించాలని గానీ, ఋణం కావాలని గానీ, బ్యాంకుకు వచ్చేవారి గురించి అవగాహనతో ఉంటారు.

అందుకోసం కూడా... ఖాతాదారులతో, స్థానిక ప్రముఖులతో, ఇతరులతో, సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఖాతా ప్రారంభించేందుకు కూడా, బ్యాంకు సిబ్బందికి తెలిసిన మరో ఖాతాదారు సిఫార్సు చేయాలన్న నియమం ఉంటుంది. ఎందుకంటే - వ్యక్తుల గుణగణాలు తెలిస్తేనే, ఆర్ధిక వ్యవహారాలు నడపటం భద్రంగా ఉంటుంది. మొత్తంగా ఖాతాదారులతో, బ్యాంకు మేనేజరుకు ఉండే వ్యక్తిగత సదభిప్రాయం, ఇక్కడ ముఖ్యమైనది.

అలాగే, అప్పు అడిగిన వారి గురించి కూడా బ్యాంకు మేనేజరు, క్షేత్రాధికారి (field officer)... ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయం పరిగణనలోకి తీసుకోబడుతుంది. అదే సమయంలో, ఋణార్ది అడిగిన అప్పు మొత్తాన్ని బట్టి, బ్యాంకు మేనేజరు చర్య ఉంటుంది.

ఉదాహరణకి, ఒకే బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచి మేనేజరు, ఏభైవేల వరకూ అప్పు మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటే, మరో బ్రాంచి మేనేజరు, రెండు లక్షల వరకూ అప్పుని మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటారు. దీనిని ‘బ్రాంచి లిమిట్’ అంటారు. అది దాటితే ఋణార్ది ఫైలు పైఆఫీసుకి (అంటే మెయిన్ బ్రాంచి, జోనల్ ఆఫీసు ఇలాగన్న మాట) పంపబడుతుంది.

ఈ విధంగా ఒకో బ్రాంచికి, మేనేజరుకి, ఒక లిమిట్ ఉంటుంది. అయితే, ఈ లిమిట్, సదరు బ్రాంచి మేనేజరు సమీకరించగల డిపాజిట్ల మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డిపాజిట్లు సేకరించగలిగిన మేనేజరుకి, బ్రాంచికి, ఎక్కువ ‘లిమిట్’ ఉంటుంది. అంటే బ్యాంకు చేసిన వ్యాపార పరిధి (క్రెడిట్ డెబిట్ రేషియో మాదిరిగా)ని బట్టి, లిమిట్ నిర్ధారింపబడుతుంది.

అది ఆయా మేనేజర్లకు వ్యక్తిగత పరపతి (అంటే కెరీర్ రికార్డు) పెంచుతుంది. పదోన్నతి సమయాల్లో ఇదీ పరిగణించ బడుతుంది. బదిలీ, పదోన్నతి, డిపార్టుమెంటులో అంతర్గత పరీక్షలు... ఇలాంటి అన్ని విషయాల్లో ఈ ‘డిపాజిట్ల సేకరణ, దాని మీద ఆధారపడిన బ్రాంచి లిమిట్’ యొక్క ప్రమేయం ఉంటుంది.

అందుకోసం... బ్రాంచి మేనేజర్లు, తమ బ్రాంచి పరిసర ప్రాంతాల్లో నివసించే వారితో, వ్యాపారం చేసే వారితో, చక్కని సంబంధాలు పెంచుకుంటారు. ‘దీనికీ, షేర్ మార్కెటుకీ సంబంధం ఏమిటీ?’ అనుకోకండి. ఆ సంబంధం అర్ధం చేసుకునేందుకే ఇదంతా చెబుతున్నాను. మరికొంత వివరించే ముందు, ఇక్కడ మరో విషయం కూడా పరిశీలించాలి.

సాధారణంగా... స్థలం లేదా ఇళ్ళు వంటి స్థిరాస్తుల క్రమవిక్రయాలు జరిగినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అందుకోసం స్టాంపు డ్యూటి పేరిట పన్ను చెల్లిస్తాం. అప్పుడు, రిజిస్ట్రార్ ఎంత పన్ను కట్టాలో లెక్కలు వేసి చెపుతాడు. ఒక ఇల్లు లేదా ఖాళీ స్థలం యొక్క విక్రయాన్ని రిజిస్టర్ చేయమన్నప్పుడు, సదరు ప్రాంతంలో మార్కెట్ రేటుని గానీ లేదా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉన్న రేటుని గానీ... రెండింటిలో ఏది ఎక్కువో దాన్ని బట్టి, పన్ను శాతాన్ని లెక్కిస్తారు.

అంటే - ఓ వందగజాల చోటుని, గజం వందరూపాయలు పెట్టి, మొత్తం పదివేలకు రిజిస్టరు చేయమని అడిగామనుకొండి. ‘ఆ ప్రాంతంలో గజం వెయ్యి వరకు పలుకుతుందన్న’ మాట ఉందనుకొండి. దీన్ని మార్కెట్ వాల్యూ అంటారు. అప్పుడు మనం, 100x1000=లక్ష రూపాయలకు స్టాంపు డ్యూటీ కట్టాల్సి ఉంటుంది.

అయితే, అదే సమయంలో... మన కంటే ముందుగా జరిగిన క్రయ విక్రయాలలో, గజం అయిదు వందలకి రిజిస్టర్ చేయబడిందనుకొండి. దీన్ని బుక్ వ్యాల్యూ అంటారు. అప్పుడూ, రెండింటిలో గజానికి వెయ్యి రూపాయిలే ఎక్కువ గనుక, మార్కెట్ రేటు ప్రకారమే పన్నుకట్టాల్సి వస్తుంది.

మన ఖర్మకాలి, ఏ ధనిక వ్యక్తయినా, తెల్ల డబ్బుని నల్లడబ్బుగా మార్చుకునేందుకో లేక, నల్ల డబ్బుని తెల్లగా మార్చుకునేందుకో, మరొకందుకో, గజం రెండు వేల రూపాయల చొప్పున రిజిస్టర్ చేయించుకున్నాడనుకొండి. నిజానికి, గజం ఏ రెండు వందలో పెట్టి కొన్నా సరే, అతడి కారణాల రీత్యా, సదరు ధనిక వ్యక్తి, ఎక్కువకి పన్ను కట్టాడనుకోండి.

[ఋణాలకు హామీగా ఇవ్వదలుచుకున్న స్థలాలను, ఇలా ఎక్కువ ధర చూపి రిజిస్టర్ చేసి, లక్ష ఖరీదు చెందని భూమిని తనఖా పెట్టి, పది లక్షల లోన్ పొందవచ్చు. కాకపోతే... బ్యాంకు మేనేజరునీ, ఫీల్డ్ ఆఫీసరునీ, న్యాయసలహా ఇచ్చే నోటరినీ, న్యాయ సలహాదారునీ, ఇంకా కొందరు ఇతర అధికారులనీ ఒప్పించుకోవలసి వస్తుంది. డబ్బు ఎటూ ఒప్పిస్తుంది కదా! ఇలాంటి కాగితపు మోసాలు చాలానే నడుస్తుంటాయి.]

అప్పుడు మనమూ... గజానికి రెండు వేల చొప్పున స్టాంపు డ్యూటి కట్టాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలోనే... రిజిస్ట్రార్ కీ, ఆ కార్యాలయ సిబ్బందికీ లంచాల పంట పండుతుంది. ఏ ధరకు స్టాంపు డ్యూటి కట్టాలో నిర్ణయించే క్రమంలో లంచాలకు భారీ అవకాశాలు పుడతాయి మరి!

ఈ రెండు పరిస్థితులూ (అంటే బ్యాంకు మేనేజరు బ్రాంచి లిమిట్, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూలలో ఏది ఎక్కువైతే దాని ప్రకారం రిజిస్ట్రేషన్) షేర్ మార్కెట్ లో ప్రభావం కలిగి ఉంటాయి.

ఎలాగంటే...

ఉదాహరణకి ‘జగన్మాయ ప్రైవేటు లిమిటెడ్’ అనే కంపెనీ ఉందనుకొండి. అందులో పరిమిత సంఖ్యలో భాగస్వాములుంటారు. కంపెనీ వారందరి ఉమ్మడి అస్తి అవుతుంది. అయితే అది వారి వ్యక్తిగత ఆస్తి కూడా!

ఇప్పుడు సదరు జగన్మాయ కంపెనీ... తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని వ్యాపార పరిధిని విస్తరించ దలిచిందనుకొండి. అందుకు భారీ స్థాయిలో పెట్టుబడి అవసరమైంది. భాగస్వాములు స్వంత నిధులు సమకూర్చినా చాలవు. బ్యాంకులలో ఋణాలు పొందినా సరిపోదు. అప్పుడు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ చేయబూనుతారు.

అప్పటికే కంపెనీ, సమాజంలో కొంత మంచి పేరుని సంపాదించిదనుకొండి. కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకం ఉంటుంది. దాంతో మార్కెట్‌లో దానికి కొంత పరపతి ఉంటుంది. ‘ఫలానా వ్యక్తి మంచివాడు, నిజాయితీ పరుడు, మాట ఇస్తే తప్పని వాడు...’ ఇలా పదిమందిలో నమ్మకం కలిగించుకున్న వ్యక్తి ఉన్నాడనుకొండి. అలాంటి వ్యక్తికి అవసరమై ఎవరినైనా అప్పు అడిగితే ఇస్తారు. అది ఆ వ్యక్తికి ఉన్న పరపతిగా చెప్పవచ్చు. (ఇక్కడ ఆర్దిక శాస్త్రం చెప్పే పరపతి నిర్వచనం నాకు తెలియదు. సామాన్యుల పరిభాషలోని పరపతి గురించి మాత్రమే నేను ఉటంకించాను.)

అదే విధమైన మంచి పేరు, నమ్మకం, పరపతి... సదరు జగన్మాయ కంపెనికి సమాజంలో ఉందనుకొండి. అప్పుడు, కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి, ప్రజల నుండి పెట్టుబడి సొమ్ము సేకరిస్తుంది. అందుకోసం ప్రభుత్వ నిబంధలనీ, లాంఛనాలనీ పూర్తి చేస్తుంది. (నిజానికి ఈ ప్రక్రియ కూడా, మనకి, పాశ్చాత్య దేశాల నుండి సంక్రమించిందే లెండి.)

తమకి అవసరమైన మొత్తాన్ని, పది రూపాయల ముఖ విలువ గల షేర్లుగా విభజించి, తదనుగుణమైన సంఖ్యలో, షేర్లను అమ్మకానికి పెడుతుంది. మాట వరసకి.... ఓ కోటి షేర్లు అమ్మకానికి పెట్టిందంటే అర్ధం, పది కోట్ల రూపాయల పెట్టుబడిని ఉద్దేశించిందని.

నిబంధనల ప్రకారం, ఆ కోటి షేర్లలో కొన్నిటిని, అప్పటి వరకూ భాగస్వామ్యులైన పరిమిత వ్యక్తులకీ, కొన్నిటిని సదరు కంపెనీలో పని చేసే ఉద్యోగ కార్మిక సిబ్బందికి కేటాయించి, మిగిలిన వాటిని విక్రయించవలసి ఉంటుంది.

కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకంతో సదరు షేర్లను కొనుగోలు చేసిన వారంతా ఆ కంపెనీలో వాటాదారులౌతారు. ఆ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ గా ఉన్నప్పటి పరిమిత భాగస్వాములు, ఉద్యోగ కార్మిక సిబ్బంది ప్రతినిధులు, కంపెనీ మండలిలో సభ్యులౌతారు. అదే విధంగా, షేర్ హోల్డర్ల తరుపున కూడా, ప్రతినిధులు, మండలిలో ఉంటారు.

అప్పటికే కంపెనీ, తన వ్యాపార సామర్ధ్యాన్ని, కంపెనీకి రానున్న బంగారు భవిష్యత్తునీ, తమ సానుకూలాంశాలని ప్రచారించుకుని కూడా, ప్రజలని తమ షేర్లు కొనేటట్లుగా ఆకర్షిస్తుంది. బ్యాంకు, ఇతర అధికారిక సంస్థల ద్వారా, మొదట షేర్లు విక్రయం చేస్తారు. తర్వాత ట్రేడింగ్, షేర్ మార్కెట్ అధికారిక భవనాలలో జరుగుతుంది.

ఆ ఫ్లోర్ మీదికి, గుర్తింపు పొందిన షేర్ మార్కెట్ ఏజంట్లు వెళ్ళి క్రయ విక్రయాలు జరపగల అధికారం కలిగి ఉంటారు. అందుకు దరఖాస్తు చేసుకుని, గుర్తింపు పొందుతారు. ఇంకా బోలెడు ఫార్మాలిటీస్ [లాంభనాలన్నీ] అన్నీ, ఫార్మల్ గా కాగితాల మీద సజావుగా నడిచి పోతాయి.

ఇక ఇప్పుడు ‘అసలు లోపలి కథ’ ఉంటుంది. షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన సొమ్ముతో, కంపెనీ తనకు ఇది వరకే ఖాతాలున్న బ్యాంకులతో లావాదేవీలు జరుపుతుంది.

ఆర్దిక లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి కాబట్టి కూడా, ఇది తప్పని సరి!

కంపెనీ వ్యాపార వ్యవహారాలు కొనసాగుతుండగా, మరో వైపు దాని షేర్ ల క్రయవిక్రయాలు మార్కెట్ లో కొనసాగుతుంటాయి. షేర్ ముఖ విలువ ‘పది రూపాయలు’ కాస్తా కంపెనీ వ్యాపార విస్తరణ, లాభనష్టాల అంచనా, ప్రజలలో షేర్ పలుకుబడిలని బట్టి, మార్పు చేర్పులకు గురౌతుంది. సాధారణంగా, పదిరూపాయల ముఖ విలువ, పెరుగుతుంది.

కంపెనీ మూడు నెలలకి, ఆరునెలలకి... ఇలా నిర్ణీత కాల వ్యవధిలకి, తన లెక్కాపత్రాలని, లాభనష్టాలని, షేర్ హోల్డర్స్ అందరికీ బాహాటంగా ప్రకటిస్తుంది. దానిని బట్టి, షేర్ ధర పెరగటం లేదా తరగటం, జరుగుతుంటుంది.

ఇక ఈ షేర్ ధరలని బట్టి, కంపెనీకి బ్యాంకులో లావాదేవీల లిమిట్ పెరుగుతుంది. అంటే - షేర్ ధర ఎక్కువ పలికి నప్పుడు కంపెనీకి బ్యాంకులో వాడుకోదగిన సొమ్ము లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓ రకంగా... అది బ్యాంకుకీ, కంపెనీకి మధ్య భరోసా మీద ఆధారపడి ఉంటుందనాలి. అయితే, ఇది బ్యాంకు దృష్ట్యా చూస్తే, భద్రతా కారణాల రీత్యా, స్వల్పకాల పరిమితికి లోబడి ఉంటుంది.

అంటే - కంపెనీ షేరు ధర వంద రూపాయలు ఉందనుకొండి. ఉదాహరణకి కంపెనీకీ, బ్యాంకుకీ మధ్య లక్ష షేర్ల భరోసా ఉందనుకొండి. కంపెనీ వంద లక్షలు (అంటే కోటి రూపాయల) భరోసా నుండి, 80% లేదా 75% (అది ఆయా కంపెనీకి బ్యాంకుకీ మధ్య అంగీకారమై ఉంటుంది.) వరకూ, కంపెనీ వాడుకునే స్వేచ్ఛ కలిగి ఉంటుంది. బ్యాంకు మేనేజర్ కి ఉండే బ్రాంచి లిమిట్ లాగా, అదే దాని లిమిట్ అన్నమాట.

అంతలో... దబ్బున షేర్ ధర పడిపోయి, 50 రూపాయలైందనుకొండి. అప్పుడు కంపెనీ లిమిట్, అర్ధ కోటిలో, 80% లేదా 75% అయిపోతుంది. అయితే... అదైనా ఇదైనా... పక్షం రోజులు లేదా వారం రోజులు... ఇలా, నిర్ణీత స్వల్ప కాల పరిమితికి లోబడి ఉంటుంది. ఎందుకంటే - షేర్ ధర పడిపోయినా, పెరిగినా, అది మళ్ళీ మార్పు చేర్పులకి గురౌతుంది గనక!

అయితే, ఏకబిగిన ధర పడిపోతూనే ఉందనుకొండి. అప్పుడొస్తుంది కంత! ఇక్కడే, స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తావన కొచ్చే, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ వంటి ప్రక్రియ, తెర మీదకి వస్తుంది. 

పబ్లిక్ లిమిటెడ్‌గా అవతరించిన జగన్మాయ కంపెనీ, తనకి అవసరమైన పది కోట్ల రూపాయల పెట్టుబడిని సమీకరించుకునేందుకు కోటి షేర్లని మార్కెట్టులో విడుదల చేసిందను కొండి. వ్యాపార క్రమంలో సదరు కంపెనీ షేరు విలువ, ఒక్కొక్కటీ వంద రూపాయలకు పెరిగిందను కొండి.

ఆ ప్రకారం, బ్యాంకులో జగన్మాయ కంపెనీ తన కోటి షేర్లను భరోసాగా ఉంచి (అంటే కోటిx100రూ. =100కోట్ల రూ.) అందులో 80% అంటే 80 కోట్ల రూపాయల పరిమితి గల ఖతాను నిర్వహిస్తుంది. ఏకబిగిన కంపెనీ షేర్ ధర పడిపోతుంటే... అలా పడిపోయి పడిపోయి జగన్మాయ కంపెనీ షేరు ధర యాభై రూపాయలకి పడిపోతే... అప్పుడు దాని ఖాతా పరిమితి కాస్తా 40కోట్లై కూర్చుంటుంది. అప్పుడు జగన్మాయ కంపెనీకి, కాసులకు కరువొస్తుంది కదా!

అప్పుడు, అది, షేర్ బజార్ లో (దలాల్ స్ట్రీట్ వంటివి) గుర్తింపు పొందిన ఏజంట్ల ద్వారా, తన షేర్లను తానే బినామీగా కొంటుంది. బుల్స్ గా పిలవబడే ఈ లైసెన్స్‌డ్ ఏజంట్లు, కంపెనీలతో, అలాంటి ప్రయోజనాలు (favors) నెరవేర్చేంత సత్ససంబంధాలు కలిగి ఉంటారు. దీన్ని ‘బైబ్యాక్’ అంటారు.(గతంలో గుట్టుచప్పుడు గాకుండా నడిచే ఈ వ్యవహారాలు, ఇప్పటి ఆర్దికమాంద్యం నేపధ్యంలో ఇటీవలే వెలుగు చూస్తున్నాయి.

మొన్నామధ్య, ‘దాదాపు అన్ని కంపెనీలూ... అవసరమైనప్పుడు అంతో ఇంతో బైబ్యాక్ చేస్తాయంటూ’ చల్లగా చావుకబురు వినిపించారు.)

పత్రికల వార్తల్లో పెయిడ్ వార్తలు వ్రాయించుకున్నట్లు, ఒకప్పుడు కవులు తామే వెనక నుండి డబ్బు ఖర్చు పెట్టుకుని తమకి తామే సన్మానాలు ఏర్పాటు చేసుకున్నట్లు, గత టపా ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్‌’లో చెప్పినట్లు, ఎలాంటి సంఘటనలైనా కిరాయి వ్యక్తుల్ని పెట్టి జరిపించే సంస్థలు పుట్టాక, బైబ్యాక్ పెద్ద విషయమేమీ కాదు! నల్లడబ్బు, దొంగ ఖాతాలు, స్విస్ ఖాతాలు... నిర్వహించే కంపెనీలకు ఇదంత కష్ట సాధ్యమూ కాదు.

ఆ విధంగా పడిపోతున్న తమ కంపెనీ షేరు ధరని తామే నిలబెట్టుకుంటే... తాజాగా లావాదేవీలకు గురైన షేరు ధర ‘బుక్ వాల్యూ Vs మార్కెట్ వాల్యూలలో ఏది గరిష్టమైతే అది పరిగణింపబడుతుంది’ వంటి నియమం ప్రకారం, తాజా ధర పరిగణింపబడి, కంపెనీ బ్యాంకు ఖాతా పరిమితి కృంగిపోకుండా నిలబడి ఉంటుంది. అది కంపెనీలకు ఆయువుపట్టు వంటిది గనక గండం గడిచిపోతుంది.

ఎటూ... ఈ విధమైన బైబ్యాక్ ప్రతిరోజూ నిర్వహించనక్కరలేదు కదా! ఏకబిగిన షేరు ధర తగ్గిపోతున్నప్పుడు, అదీ వారానికోసారి నిలబెట్టుకున్నా ‘బచ్‌గయా’ అనుకోవచ్చు.

నిజానికి లాభాల ప్రకటనలతో, మీడియా ప్రచార ప్రకటనల హోరుతో ఏకబిగిన షేర్ ధర పడిపోవటం సాధారణంగా జరగదు. అన్నీ సజావుగా నడిచి గతంలో అది సుసాధ్యంగానే ఉండేది.

కాకపోతే ప్రపంచమే ఆర్దిక మాంద్యంలో చిక్కుకుని, ఇప్పుడే అంత గడ్డుస్థితి ఏర్పడింది. దీనికి కార్యకారణ సంబంధాలని తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి జగన్మాయ కంపెనీ ఉదాహరణతో విశ్లేషణ కొనసాగిస్తాను.

ఈ విధంగా షేర్ ధర పడిపోకుండా సర్వప్రయత్నాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తే... సదరు జగన్మాయ కంపెనీ, సంవత్సరమంతా 80 కోట్ల బ్యాంకు ఖాతా పరిమితిలో నిధులని ఉపయోగించుకొందనుకొండి.

80కోట్లకు కనిష్ఠంగా నెలకు వందకు 2 రూపాయల ధర్మవడ్డీ ప్రకారం లెక్కవేసినా... సంవత్సరానికి 19.2 కోట్ల రూపాయల, నికర ఆదాయం ఉంటుంది. ఇందులో బ్యాంకుకి కట్టే వడ్డీ మినహాయించినా ఇంకా సొమ్ము మిగులే!

అలాంటిది 80 కోట్ల సొమ్ము, అంత తక్కువ వడ్డీతో వ్యాపార విస్తరణకి, లావాదేవీలకి అందుబాటులో ఉన్నప్పుడు... 80 కోట్లకి రమారమి వడ్డీ రూపేణానే 20కోట్లు సంవత్సరానికి జోడవుతాయి. అందులో షేరుకు సంవత్సరానికి 2రూపాయల లాభాన్ని (డివిడెండుని) పంచినా కంపెనీకి అయ్యే ఖర్చెంతని?

కోటి షేర్లుx2 రూ. =2 కోట్ల రూపాయలు. దీనిని కూడా త్రైమాసికంగా డివిడెండు కాబట్టి వాటిని సంవత్సరానికి దఫాలుగా, నాలుగు భాగాలుగా చెల్లింపు జరుగుతుంది. అంటే త్రైమాసికానికి 50లక్షలు షేర్ హోల్డర్లకు చెల్లిస్తే సరిపోతుంది.

ఎటూ షేర్ హోల్డర్లు కూడా... కంపెనీ తమకి పంచే లాభాల వాటా (డివిడెండు)ని దృష్టిలో పెట్టుకుని గాక, మార్కెట్టులో పెరిగే షేరు విలువని దృష్టిలో పెట్టుకునే షేర్లని కొంటారు కదా! దాంతో కంపెనీకి తాము ఉపయోగించుకుంటున్న 80కోట్లకుగాను గిట్టుబాటయ్యే 20కోట్ల వడ్డీ సొమ్ములో 2కోట్లని అదీ నాలుగు విడతలుగా చెల్లిస్తే... డివిడెండ్లు పంచిన కంపెనీగా తమ షేరధర మరింత పెరిగి, మరింత సొమ్ము తమకు వినియోగించుకునేందుకు అందుబాటులోకి వస్తుండగా... డివిడెండ్లు పంచడం మరింత లాభాదాయకమా, కాదా?

అందుకోసం లేని లాభాలు ఉన్నట్లుగా చూపటం సంభవమా, కాదా? అదే ఇప్పుడు చాలా కంపెనీల్లో నడుస్తోంది. ఉదాహరణకి మొన్నామధ్య డివిడెండ్ ప్రకటించిన లార్సెన్&టూబ్రో కంపెనీ విషయాన్నే తీసుకుందాం. ఒకో షేరుకు 12.50రూ.ల లాభవాటా (డివిడెండ్) ని కంపెనీ ప్రకటించింది. దాదాపుగా 73 కోట్ల 65లక్షల పైచిలుకు వాటాలు మార్కెట్టులో ఉన్నాయి. నిన్నటి రోజు (అంటే అక్టోబరు 18వ తేదిన) 71,245 షేర్లు ట్రేడింగ్ కు (అంటే క్రయవిక్రయాలకు) గురయ్యాయి.

సదరు ఎల్&టీ కంపెనీ షేరు ధర ఒక్కొక్కటీ 2,034 రూపాయలు. నిన్నటి ట్రేడింగ్ లో కొంత తగ్గుదలకి గురయ్యి 2,015 రూ.లకు పడిపోయింది. అంటే రెండు వేల పైచిలుకు ధర గల ఒకో వాటా కలిగి ఉన్న షేర్ హోల్డర్‌కు, కంపెనీ ఇచ్చిన లాభం 12రూపాయల ఏభైపైసలు. నిశ్ఛయంగా 12రూపాయల యాభై పైసల లాభం కోసం ఏ మదుపుదారుడూ 2,034 రూపాయల పెట్టుబడి పెట్టడు. అదీ కంపెనీ ఆరునెలలకి ఒకోసారి పంచే లాభం!

మొన్న షేర్ ఒక్కింటికి 12.50 రూ.ల డివిడెండుని ప్రకటించిన ఎల్&టి, తరువాత రోజు... 200 కోట్ల పెట్టుబడిని సేకరించేందుకు నూతన బాండ్లు విడుదల చేసింది. కనీస పెట్టుబడి 5000 రూ.లు కాగా... స్థిర ఆదాయ హామీ, 20,000రూ.ల వరకూ పన్ను రాయితీ, అదనపు ఆకర్షణలు! ఇన్ని ఆకర్షణలతో బాండ్లు విడుదల చేయనుండగా, ఇప్పటికే లావాదేవీల్లో చలామణి అవుతున్న షేర్ల మీద డివిడెండు ఇవ్వటం, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది కదా! రేపటి పెట్టుబడి సమీకరణకు, నేటి డివిడెండు పంపకం బలాన్నిస్తుందన్నది సతర్కమే కదా!

అలాంటిదే బ్యాంక్ ఆఫ్ బికనీరు&జైపూర్ ది. ఒక్కో షేర్ మీద 7.50 రూ.ల డివిడెండు ప్రకటించిన తర్వాతి రోజున 800కోట్ల రూ.ల పెట్టుబడి సేకరణకు కొత్త ఇష్యూ ప్రకటించింది.

ఇంత నేపధ్యం ఉన్నప్పుడు... డివిడెండుకు వందల రెట్లలో షేర్ ధరలు పెరగటం మామూలే! వస్తూత్పత్తి చేసే సంస్థలతో బాటుగా, సేవల రంగంలోని సంస్థలూ షేర్లు విడుదల చేయటం ఒక ఆసక్తిదాయకమైన అంశం.

అలాంటప్పుడు నిశ్చయంగా, మదుపుదారులు కంపెనీ ఇవ్వనున్న, ఇవ్వజూపుతున్న లాభాలని ఆశించి షేర్లు కొనడం లేదు. ప్రైమరీ ఇష్యూనాడు షేర్లు కొని... సుదీర్ఘ కాలం వేచి ఉండే షేర్ హోల్డర్స్ ని మదుపుదారులు అనవచ్చు.

బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది గనుక,
ఇంట దాచుకుంటే దండుగ + దొంగల భయం గనుక,
ఇతరులకి వడ్డీకిస్తే ఎగవేత భయం గనుక షేర్లలో,
బాండ్లల్లో భద్రత చూసుకొని వీరు పెట్టుబడిపెడతారు.

అయితే... ఇలాంటి వారు, చాలాసార్లు మోసగించబడుతూనే ఉంటారు. లిస్టింగ్ లో మాయమై పోయే కంపెనీల షేర్లు వీళ్ళ దగ్గర మురిగి పోతుంటాయి. పెట్టుబడి పెట్టి, రోజు వారి తమ జీవన పోరాటంలో తాము మునిగి పోయి, ఆనక కళ్ళు తెరిచి "ఫలానా కంపెనీ షేర్లు ఎక్కడా (quote)కోట్ అవ్వటం లేదు. నా దగ్గర ఇన్ని షేర్లున్నాయి. ఎవరిని అడగాలి? ఎలా నా సొమ్ము నేను తిరిగి పొందాలి?" అంటూ పత్రికల్లో కాలమ్స్ నిర్వహించే నిపుణులకి వ్రాస్తుంటారు.

అంబుడ్స్‌మెన్ ల వంటి సంబంధిత అధికారులకి, అధికార వ్యవస్థలకి ఫిర్యాదులు పెట్టుకుని దీనంగా దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే... షేర్ల స్వల్పకాల క్రయవిక్రయాలకు సిద్దపడే వారంతా, కంపెనీ పంచి ఇచ్చే డివిడెండ్లని ఆశించి గాక... `షేర్ల ధరలు పెరుగుతాయి, పెరిగాక అమ్ముకుని లాభాలు పొందుదాం' అనుకుని షేర్లలో పెట్టుబడి పెడతారు.
 

Monday, November 24, 2014

ఓ రాక్షసకన్ను మనల్ని గమనిస్తూ ఉంటుంది

ఆమధ్య ఢిల్లీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కారణం... ఆమె ఓ షాపింగ్ మాల్‌లో దుస్తులు మార్చుకుంటుండగా తీసిన ఓ వీడియో, ఎమ్మెమ్మెస్ రూపంలో దర్శనమివ్వడం!
తర్వాత కొన్ని రోజులకే.. తన భర్తతో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇంటర్నెట్లో చూసి షాకయిన ఓ ఇల్లాలు విషం తాగింది.
 చాలాసార్లు మనం మాత్రమే ఉన్నామనుకుంటాం. కానీ ఓ రాక్షసకన్ను  మనల్ని గమనిస్తూ ఉంటుంది. అదెక్కడో దాగివుంటుంది. మనకు తెలియకుండానే మన పరువుని, అభిమానాన్ని బజార్లో పెట్టేస్తుంది. ఆ కన్ను... సీక్రెట్ కెమెరాది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆఫీసుల్లోని బాత్రూముల్లో.. ఎక్కడైనా ఉండొచ్చు ఇవి. వాటికి చిక్కకుండా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మహిళలంతా తెలుసుకుని తీరాలి.
* ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్, హోటల్ గదుల్లోకి వెళ్లిన వెంటనే... ఫ్లవర్ వాజులు, ఫొటో ఫ్రేములు, అద్దాలు, టేబుల్ ల్యాంప్స్... ఏవి ఉన్నా వాటిని పరీక్షించండి. ఎక్కు వగా వీటిల్లోనే కెమెరాలను పెడతారు.
* హోటల్ గదుల్లోని సోఫా కుషన్లు, దిండ్లను అటూ ఇటూ తిప్పి చూడండి. ప్రతి అల్మరానీ తెరిచి చూడండి. టేబుల్, టీపాయ్‌ల అడుగున పరిశీలించండి. ఈ ప్రదేశాలు మీనియేచర్ కెమెరాను అమర్చడానికి అనువైనవి.
* వైర్లు కనిపిస్తే... అవి దేనికి సంబంధించినవో పరిశీలించండి.
* గదిలో లైటు తీసేసి చుట్టూ పరిశీలించండి. పచ్చ లేక ఎర్రటి ఎల్‌ఈడీ లైట్‌లాంటిది కనిపిస్తే కెమెరా ఉన్నట్టు.
* సెల్‌ఫోన్‌లో ఏదైనా నంబర్ డయల్ చేయండి. సిగ్నల్ ఉన్నా కాల్ వెళ్లకపోతే కెమెరా ఉన్నట్టే. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉన్నచోట కాల్స్ వెళ్లవు.
* ఈమధ్య అద్దాల వెనుక కెమెరాలు పెట్టడం ఎక్కువయ్యింది. కాబట్టి అద్దం దగ్గరకు వెళ్లి, చూపుడు వేలును అద్దం మీద అదిమి పెట్టండి. మీ వేలికి, అద్దానికి మధ్య గ్యాప్ కనిపిస్తే అది మంచి అద్దమే. అలా కాకుండా మీ వేలిని ప్రతిబింబం తాకుతుంటే మాత్రం అది టూవే మిర్రర్ అన్నమాట. మామూలు అద్దానికున్నట్టు వీటి వెనుక సిల్వర్ కోటింగ్ ఉండదు. కాబట్టి ఆ అద్దంగుండా మిమ్మల్ని అవతలివాళ్లు చూడగలరు. కానీ, అవతలున్నవాళ్లు మాత్రం మీకు కనిపించరు. వీటిని గుర్తించడానికి మరో మార్గం... లైటు తీసేసి, అద్దంలోకి సెల్‌ఫోన్ ద్వారా గానీ, టార్చ్ ద్వారా గానీ లైటు వేయండి. వెనుక కెమెరా ఉంటే కనిపిస్తుంది.
* పిన్‌హోల్ కెమెరాలని ఉంటాయి. వీటిని సాధారణంగా గోడల్లో అమరుస్తారు. వీటిని కనిపెట్టడానికి ఓ చిన్న గొట్టం (టిష్యూ రోల్స్ ఉంటాయి కదా. దాని మధ్య ఉండే గొట్టం చాలు), ఓ టార్చ్ కావాలి. లైటు తీసేసి, గొట్టాన్ని ఓ కంటి దగ్గర పెట్టుకుని, రెండో కన్నుమూసి, గదంతా టార్చ్‌లైట్ వేసి చూడండి. ఎక్కడైనా కెమెరా ఉంటే, రిఫ్లెక్షన్ వస్తుంది.

Sunday, November 16, 2014

మనిషికి కావాల్సిన షడ్గుణ ఐశ్వర్యాలు

మనిషి గెలుపు నిరంతరం. అంతే తప్ప, ఒక మజిలీలో ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడమనేది నేను నమ్మను. చాలామంది 30 - 40 ఏళ్ళకే తృప్తిపడిపోతారు. జీవించడం మానేసి, బతకడం మొదలుపెడతారు. అది తప్పు. పని చేస్తున్నకొద్దీ రాటుదేలేది ఒక్క మెదడే. ‘ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎంత తొందరగా ప్రారంభించామన్నది ముఖ్యం’


తొందరగా ప్రారంభించడమంటే...?
జీవితంలో డబ్బు, కీర్తి, జ్ఞానం - వీటి సముపార్జన తొందరగా ప్రారంభించాలి. నా దృష్టిలో మనిషికి కావాల్సినవి షడ్గుణ ఐశ్వర్యాలు. ఆ 6 ఏమిటంటే - ఆరోగ్యం, కీర్తి, డబ్బు, జ్ఞానం, ప్రేమ, ఉత్సాహం. ఈ ఆరూ ఉంటే, జీవితం సఫలమైనట్లే. వీటి కోసం ఎంత చిన్న వయసులో ప్రయత్నం ప్రారంభిస్తే, అంత తొందరగా జీవితంలో విజయం వైపు పయనిస్తాం.

Tuesday, November 04, 2014

Difference Between Tax and Levy

Tax vs Levy
 
Any individual, firm, corporation, or legal entity will have to make a payment to their country’s government known as a tax payment. The funds that are collected through tax is the largest income that the government receives and is used for the running of government, investment, development, infrastructure, healthcare, public safety, law enforcement, etc. Failure to pay taxes is a punishable offence, and a government entity called the Internal Revenue Service (IRS) or the Tax Office will issue tax levies with the aim of obtaining taxes owed to the government. The terms taxes and levies are clearly explained in the following article, and their similarities and differences and highlighted.
Tax
Taxes are fees that are imposed on corporations and individuals by a country’s government. Tax income is the largest income that the government receives, and it is used for a variety of purposes such as for infrastructure projects, development, to offer social and employment benefits, general administration costs, etc. There are different types of taxes such as income tax, capital gains tax, corporate tax, property tax, inheritance tax, expatriation tax, wealth tax, value added tax, sales tax, etc. Taxes are seen to be beneficial to the development of a country and for the society’s wellbeing. Progressive taxation that charges higher tax rates with income increases also results in a sense of economic equality.
Tax Levy
A tax levy will be imposed in the event that the tax payer fails to make tax payments or fails to work out a tax payment arrangement. In such an event, the tax agency will take measures to seize the assets/funds. The tax agency has the right to seize bank balances, assets, and even order employers to withhold part of the employee’s salary on a periodic basis until the debt is repaid. The tax agency will issue a notice of intent 30 days before the assets are seized, and once such a notice has been issued, the tax payer will have to pay his taxes, except in special circumstances, in which the taxpayer can prove financial difficulty. The taxpayer does not have to pay the amount in one go, and can work out a system under which he can periodically make tax payments.
What is the difference between Tax and Levy?
Taxes and tax levies are concepts that are very closely related to one another. Taxes are charged by the government on individuals and corporations and are used for a number of purposes. Taxes are usually not paid voluntarily and are, therefore, imposed on a company or an individual. In the instance that a taxpayer defaults on his obligation to pay tax, the government enforces something called a tax levy. A tax levy will allow the bank or financial institution to seize the assets of the tax payer. If the taxpayer defaults, the government will sell off the assets that were seized to recover the tax payments that are due.
Summary:
Tax vs Levy
• Taxes are fees that are imposed on corporations and individuals by a country’s government. Taxes are used for the purpose of running of the government, investment, development, infrastructure, healthcare, public safety, law enforcement, etc.
• A tax levy will be imposed in the event that the tax payer fails to make tax payments or fails to work out a tax payment arrangement.
• If the taxpayer defaults on their tax payments the government can issue a levy to seize the assets and recover the amount due in taxes.

Friday, October 31, 2014

Difference Between Public Sector Bank in India and Private Sector Bank in India

Public Sector Bank in India vs Private Sector Bank in India
It is a surprise that we are today talking about differences between public sector banks and private sector banks in India. Banks in India remained private till 1969 when the then Prime Minister of India, nationalized all of them through an act of the parliament. From 1969 till 1994 there were only public sector banks in India when government allowed HDFC to start the first private bank. The roaring success of HDFC made other private banks to come into the picture and today private banks are giving stiff competition to public sector banks. This article will try to peep into the working styles of public and private sector banks to differentiate between the two.
Though State Bank of India is in reality the oldest bank in India having come into existence much before the Allahabad Bank, State Bank of India was called the Imperial Bank of India before independence. Imperial bank was formed in 1921 with the merger of presidency banks known as Bank of Madras, bank of Bengal, and bank of Bombay. Not much headway was made till the nationalization of banks but soon after their nationalization, the banks became a policy instrument of the government of India and the banks started to offer loans to poor and farmers. Thousands of branches of public sector banks were opened in rural areas which allowed people in villages to take advantage of banking facilities. These commercial banks looked after the requirements of industrialists, agriculturists and traders thus becoming a backbone of the Indian economy. They accelerated the growth of Indian economy and worked as wheels of growth taking India to the goal of self reliance in all fields.
Public sector banks are the banks owned by the government of India or are an undertaking of the government of India. On the other hand private sector banks are those set up by private bodies. It was the process of liberalization, initiated in 1991 under the then Prime Minister of India that the government recognized the need to allow participation of private sector banks in the field of banking. The entry of private banks provided the much needed boost in the quality of services and woke public sector banks from a deep slumber of self praise and inefficiency. The pace at which private sector banks grew in India under the leadership of banks like HDHC and ICICI was phenomenal and made public sector banks work for the betterment of performance and efficiency.
Private sector banks, though they were costly, provided consumer friendly services and customers were attracted to them as they were never so comfortable while dealing with public sector banks. In the process, these banks jolted public sector banks out of their complacency and literally forced them to become better and competitive.
Public Sector Bank in India vs Private Sector Bank in India
• There were only public sector banks in India from 1969 to 1994 as all banks were nationalized.
• These public sector banks fulfilled their social responsibilities and provided the much needed thrust to Indian economy
• It was the liberalization process started in 1991 that private sector banks were allowed to be set up by RBI
• Today the great performance of private sector banks have made private sector banks more competitive and forced them to provide better customer services.

Thursday, October 30, 2014

మనిషి... మారిపోతున్నాడు!

ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా
 20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..?
 మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో!
 టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే
అమరత్వమూ పొందొచ్చు!!


కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా  మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు.  ‘ట్రాన్స్‌హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.

ఏమిటీ ట్రాన్స్‌హ్యూమనిజం..?

పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్‌లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్‌హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్‌హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్‌హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్‌హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు.   

బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..!

వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ  ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్‌యూఎల్‌సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు.  మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

కళ్లజోడు కంప్యూటర్‌తో చిటికెలో పనులు!

ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్‌గా పేరుపొందిన గూగుల్ గ్లాస్‌నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది.

జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు!

మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్‌కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

సైబోర్గ్..  మనిషి సహజం అవయవాలు కృత్రిమం

చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్‌లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

కంప్యూటర్‌లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం!

మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్‌లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్‌లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్‌లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే!

కాంతిని ముడివేయడం వీలవుతుందా?

వండర్స్ ఆఫ్ సైన్స్
 కాంతిని ముడివేయడం వీలవుతుందా?  కాంతి వేగాన్ని మించి ప్రయాణించడం  కుదురుతుందా?  మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారం జరిగే పనేనా?    నిన్నటి వరకూ ఇవన్నీ అసాధ్యాలు. కానీ నేడు సాధ్యం అయ్యాయి!  భవిష్యత్తులో ఇవి సుసాధ్యం అయితే గనక..  సైన్స్‌లో మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి!
 
విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడు ఏ చిక్కుముడి వీడుతుందో ఎవరికీ తెలియదు. అసాధ్యం అనుకున్న పనులు అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఊహకైనా అందని అద్భుతాలు కళ్ల ముందు చటుక్కున సాక్షాత్కరిస్తాయి. సైన్స్ చేసే మ్యాజిక్‌తో సాంకేతిక ప్రపంచం ఒక్కసారిగా కొత్త మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే అసలు ఎప్పటికీ సాధ్యం కావని అనుకున్న అద్భుతాలు ఇటీవల జరిగిపోయాయి! వాటిలో కొన్ని అద్భుతాలు.. వాటివల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...
 

కాంతి పుంజాలను ముడివేశారు!

మనకు తెలిసినంత వరకూ కాంతి కిరణాలు ఎల్లప్పుడూ నేరుగా సరళరేఖల్లోనే ప్రయాణిస్తాయి. వాటిని ముడివేయడం కాదు కదా కనీసం వంకరటింకరగా ప్రయాణించేలా కూడా చేయలేం. కానీ, బ్రిటన్‌లోని గ్లాస్గో, బ్రిస్టల్, సౌతాంప్టన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కాంతిని ముడి వేయగలిగారు! ఇంతవరకూ అసాధ్యం అయిన ఒక గణితశాస్త్ర ప్రతిపాదనగానే ఉన్న ఈ భావనను వారు నిజం చేశారు. ప్రత్యేకమైన 3డీ హోలోగ్రామ్ చిత్రాలను ఉపయోగించి వారు ఈ అద్భుతాన్ని సాధించారు. (ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో వాడిన టెక్నాలజీ ఇదే) ఇదే 3డీ హోలోగ్రామ్ టెక్నాలజీని కొద్దిగా మార్చిన బ్రిటన్ పరిశోధకులు కాంతి ప్రవాహాన్ని సైతం ప్రభావితం చేయగలిగారు. కాంతి అనేది నదిలాంటిదని, అది సుడులు కూడా తిరగగలదని వీరు అంటున్నారు. కాంతి పుంజపు హోలోగ్రామ్ రూపం తెలిస్తే.. మీరూ దానిని వంచేయగలరని  చెబుతున్నారు. దీనివల్ల ఉపయోగాలేంటంటే.. భవిష్యత్తులో కాంతితో ముడిపడిన అన్ని సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయట.
కాంతికన్నా 300 రెట్ల వేగం!

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిద్ధాంతీకరించిన ప్రకారం విశ్వంలో కాంతిని మించిన వేగంతో ఏదీ ప్రయాణించలేదు. కానీ, అమెరికా, ప్రిన్స్‌టన్‌లోని ఎన్‌ఈసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ నియమాన్ని ఉల్లంఘించి చూపారు. కాంతికిరణాలు సెకనుకు 1.86 లక్షల మైళ్లు ప్రయాణిస్తాయి. కానీ, ప్రత్యేక గ్యాస్ చాంబర్‌లో వీరు లేజర్ కిరణాలను ఏకంగా కాంతి కంటే 300 రెట్ల వేగంతో ప్రయాణించేలా చేయగలిగారు! అయితే, సైన్స్‌పరంగా కాంతివేగమే అత్యధికమని, కానీ కొన్ని పరిస్థితులు కల్పిస్తే ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చని వీరు వెల్లడించారు. ఉపయోగాలేంటంటే.. ఫైబర్ ఆప్టిక్ పద్ధతిలో కాంతిద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు ఇదివరకే వాడకంలోకి వచ్చేశాయి. అదే కాంతి కన్నా వేగం పెరగడం అంటే.. కాంతి ద్వారా సమాచార ప్రసారాన్ని కూడా వేగవంతం చేయొచ్చన్నమాట. దీనితో పాటు కాంతితో సంబంధం ఉన్న అనేక పనులను ఇంకా వేగంగా చేసేందుకు భవిష్యత్తులో వీలవుతుంది.
 
 మెదడు నుంచి మెదడుకు సందేశం!


ఎదుటివారి మెదడులోని ఆలోచనలను చదవడం, ఒకరు ఆలోచిస్తే.. ఎక్కడో ఉన్న ఇంకొకరు ఆ ఆలోచనలను గ్రహించడం సాధ్యం అవుతుందా? కాదు. కానీ ప్రస్తుతానికి ఎలుకల్లో ఇది జరిగింది. బ్రెజిల్ శాస్త్రవేత్తల సాయంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్న రెండు ఎలుకల మధ్య టెలీపతీ(దూరసంవాదం) రూపంలో వీరు సమాచార ప్రసారం చేయగలిగారు. రెండు ఎలుకల మెదడుకు ఇంప్లాంట్లను అమర్చిన వీరు రెండింటి మధ్య ఇంటర్నెట్ ద్వారా మెదడు సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో ఒక బోనులో మీటను నొక్కేలా శిక్షణ పొందిన ఎలుక ఆ మీటను నొక్కగానే, అవతల బోనులో ఉన్న ఎలుక ఎలాంటి శిక్షణ లేకుండానే నేరుగా ఆ మీటను నొక్కేసింది. మనిషి మెదడు సంకేతాలను కూడా సమర్థంగా అనువదిస్తే మనుషుల్లో కూడా టెలిపతీ అసాధ్యమేమీ కాదని వీరు అంటున్నారు.
 
ఒకే సమయంలో రెండు పనులు

 పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే కాకుండా 12 ఉప పరమాణు కణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఉప పరమాణు కణాలను అత్యంత సూక్ష్మంగా క్వాంటమ్ స్థాయిలో ప్రభావితం చెందిస్తే పదార్థాలు చిత్రవిచిత్రాలు చేస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బారా పరిశోధకులు ఇదే నిరూపించారు. ఓ చిన్న లోహపు ముక్కను ఒక డిగ్రీలో కోట్ల వంతు చల్లబర్చి, దానికి క్వాంటమ్ సర్క్యూట్‌ను తాకించి తిరిగి తీసివేయడం ద్వారా ఒకేసారి ఆ లోహపుముక్క సగం కదిలి, సగం కదలకుండా ఉండిపోయేలా చేశారు. వీరి ఆవిష్కరణ క్వాంటమ్ మెకానిక్స్‌లో విప్లవాత్మక మార్పులకు, మానవాళి వింత కోరికలను నెరవేర్చేందుకు ఉపయోగపడుతుందని ‘సైన్స్’ మేగజైన్ కితాబునిచ్చింది.
 
వ్యతిరేక పదార్థం   తయారీ!

విశ్వంలో కంటికి కనిపించే పదార్థంతో పాటు కనిపించని వ్యతిరేక పదార్థం(యాంటీ మ్యాటర్) కూడా ఉందని అంచనా. అయితే విశ్వంలోని యాంటీ మ్యాటర్ సంగతి పెద్దగా తేలకపోయినా, ప్రయోగశాలలో మాత్రం శాస్త్రవే త్తలు వ్యతిరేక పదార్థాన్ని సృష్టించి, అది నిలకడగా ఉండేలా చేయగలిగారు. వ్యతిరేక పదార్థాన్ని దశాబ్దం క్రితమే తయారు చేసినా, దానిని బలమైన అయస్కాంత క్షేత్రం లోపల నిల్వ చేయడంలో సెర్న్ శాస్త్రవేత్తల బృందం విజయం సాధించింది. ప్రస్తుతం అయస్కాంత క్షేత్రం వల్ల ఇందులోని యాంటీ మ్యాటర్‌పై పరిశోధనలకు అడ్డంకి ఏర్పడుతోంది. ఈ అడ్డంకి తొలగితే గనక.. భవిష్యత్తులో మ్యాటర్/యాంటీ మ్యాటర్ రియాక్టర్లను తయారు చేయవచ్చని, సహజ ఇంధన వనరులు తరిగిపోయినా ఈ రియాక్టర్లతో ప్రపంచానికంతటికీ ఇంధన అవసరాలు తీర్చవచ్చని అంటున్నారు.

Tuesday, October 28, 2014

డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు

డబ్బు విషయంలో కొద్దిమంది సంతృప్తిగా ఉన్నప్పటికీ అనేకమంది అసంతృప్తి ప్రకటిస్తుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో డబ్బుని కనిపెట్టినవాడిని పట్టుకుని తన్నాలనిపించే ఆలోచన కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డబ్బు గురించి ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించబడింది.
డబ్బు అంటే మనకు తెలిసింది నోట్ల కట్టలు, నాణేలు మాత్రమే. డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు లేదా బాండ్లు (వీటిని సావరిన్ బాండ్లు లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అంటారు), బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే వివిధ బాండ్లు, ఫిక్సుడ్ డిపాజిట్ బాండ్లు, సెక్యూరిటీలు… మొదలైనవన్నీ కూడా డబ్బుకు వివిధ రూపాలే. వీటన్నిటినీ కలిపి విస్తృత అర్ధంలో ద్రవ్యం అని అంటారు. ద్రవ్యం అన్న పదాన్ని విస్తృతార్ధంలో వాడితే డబ్బు అన్న పదాన్ని కరెన్సీని సూచించే narrow అర్ధంలో వాడుతారు.
కరెన్సీ నోట్లను ఆర్.బి.ఐ ముద్రిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరెన్సీ అంటే వాస్తవానికి రూపాయి నోటు మాత్రమే. మిగిలిన నోట్లన్నీ ప్రామిసరీ నోట్లు. రూపాయి నోటు వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. రూపాయి కరెన్సీ నోటు తప్ప మిగిలిన నోట్లకు ఆర్.బి.ఐ గవర్నర్ బాధ్యత వహిస్తారు. అందువలన ఈ నోట్లపై ‘ఐ ప్రామిస్ టు పే’ అన్న ప్రామిస్ తో గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపైన మాత్రం గవర్నర్ సంతకం ఉండదు.
ఈ తేడా ఎందుకంటే కాయినేజి చట్టం – 1906 కింద రూపాయి నోటుని ముద్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది. రూపాయి అనేది భారత దేశం యొక్క ప్రాధమిక కరెన్సీ. అందువలన అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మిగిలిన డినామినేషన్ తో కూడిన నోట్లన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ అధికారం తరపున ఆర్.బి.ఐ బాధ్యత వహిస్తూ ప్రామిసరీ నోట్లుగా జారీ చేస్తుంది. రూపాయి కరెన్సీ అయితే మిగిలిన నోట్లు దానికి ప్రతిబింబాలు అన్నమాట. ప్రామిసరీ నోటు ద్వారా దానిపై ఎంత అంకె ఉంటే అన్ని (రూపాయి) కరెన్సీ నోట్ల విలువ చెల్లిస్తున్నట్లుగా బేరర్ కు ఆర్.బి.ఐ హామీ ఇస్తుంది.
నాణేలు కూడా కరెన్సీయే. అవి ఆ విలువకు సమానమైన లోహంతో తయారు చేస్తారు. కనుక వాటి విలువ నిజమైనది. రూపాయికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించే కరెన్సీ కనుక అది లోహం కాకపోయినా తన విలువను వ్యక్తం చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మోసే లయబిలిటీ. అలాగే నాణేలన్నింటిని ముద్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ముద్రించడం కేంద్ర ప్రభుత్వమే ముద్రించినా చెలామణిలోకి రావడం మాత్రం ఆర్.బి.ఐ ద్వారానే వస్తుంది. కాయినేజి చట్టం ప్రకారం 1000 రూపాయల వరకు నాణేలను ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
కేంద్ర ప్రభుత్వ నాణేల ముద్రణా కేంద్రాలు నాలుగు చోట్ల ఉన్నాయి. అవి: ముంబై, అలిపూర్ (కోల్ కతా), సైఫాబాద్ (హైద్రాబాద్, చెర్లపల్లి (హైద్రాబాద్). అనగా మన రాష్ట్రంలో, సారీ, తెలంగాణ రాష్ట్రంలోనే రెండు నాణేల ముద్రణా కేంద్రాలు ఉన్నాయి. 50 పై.లు అంతకు లోపు నాణేలను స్మాల్ కాయిన్స్ అంటారు. రూపాయి అంతకు ఎక్కువ విలువ నాణేలను రుపీ కాయిన్ లు అంటారు. 
డబ్బుకు సంబంధించి ఇతర అంశాలను ఈనాడు ఆర్టికల్ లో చూడగలరు. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయండి. ఈ లింకు వచ్చే ఆదివారం వరకు మాత్రమే పని చేస్తుందని మరవొద్దు.
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ రూపంలో చూడడం కోసం కింది బొమ్మపైన క్లిక్ చేయండి. డౌన్ లోడింగ్ కోసం రైట్ క్లిక్ చేయండి.
Eenadu - 27.10.2014

హిట్లర్ ఎలా చనిపోయాడు?

హిట్లర్ ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకితో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం.
బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నది సోవియట్ సేనలే. హిట్లర్ సామ్రాజ్య పతనం గ్యారంటీ అని అర్ధం అయ్యాక పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ మధ్య హిట్లర్ సామ్రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని వశం చేసుకోవాలన్న పోటీ అంతర్గతంగా నడిచింది. సోవియట్ ఆధీనంలోకి ఎంత ఎక్కువ ప్రాంతం/దేశాలు వెళ్తే ఎర్ర ప్రమాదాన్ని అంత ఎక్కువ ఎదుర్కోవలసి వస్తుందని పశ్చిమ రాజ్యాలు భయపడ్డాయి. వారి భయం నిజం కూడా.
ఈ నేపధ్యంలో ఒకవైపు పశ్చిమ దిశ నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు జర్మనీని ఆక్రమించుకోగా, తూర్పు దిశ నుండి సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. ఆ విధంగా తూర్పు జర్మనీ సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వెళ్ళగా మిగిలిన భాగాన్ని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు తలా ముక్కా పంచుకున్నాయి. అనంతరం ఓ పదిహేనేళ్ళ తర్వాత అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఒక ఒప్పందానికి వచ్చి తమ మూడు భాగాలను ఐక్యం చేసి పశ్చిమ జర్మనీని ఏర్పాటు చేశాయి.
జర్మనీ పతనానికి ముందు ఇటలీ నియంత ముసోలిని ని స్ధానిక (మిలన్) ప్రజలు దాడి చేసి పట్టుకున్నారు. జర్మనీ సైన్యంతో కలిసి జర్మనీ సైనికుల యూనిఫారం ముసుగులో పారిపోతుండగా ముసోలినిని పట్టుకున్నారు. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ముసోలిని, అతని భార్యలను కాల్చి చంపగా జనం వారి శవాలను మిలన్ నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో తాళ్ళకు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. వేలాడదీసిన శవాలను కూడా వదలకుండా జనం ఇష్టం వచ్చినట్లు కొట్టి, తన్ని, లాగి, పీకి దాదాపు ఆనవాళ్ళు లేకుండా చేశారు. చివరికి అధికారులు, సైనికులే వారిని నియంత్రించవలసి వచ్చింది.
ఏప్రిల్ 28, 1945 తేదీన ముసోలిని దంపతులను కాల్చి చంపగా ఏప్రిల్ 29 తేదీన వారి శవాలను వేలాడదీసి ఇష్టం వచ్చినట్లు కొట్టిన సంఘటన జరిగింది. ఈ సమాచారం హిట్లర్ కు చేరింది. తన పరిస్ధితి కూడా అదే అవుతుందని హిట్లర్ భావించాడు. శత్రువుకు పట్టుబడడం జరగనే కూడదని శపధం చేశాడు.
అనుకున్నట్లే హిట్లర్ తన నిర్ణయాన్ని తన సహచరులకు తెలిపాడు. చనిపోవడానికి 40 గంటల ముందు తన ఫియాన్సే ఇవా బ్రౌన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటే చావు గ్యారంటీగా సంభవిస్తుందో తన వ్యక్తిగత వైద్యుడిని అడిగి తెలుసుకున్నాడు. సైనైడ్ మింగడం మంచిదన్న ఇతరుల సలహాపై అనుమానం వ్యక్తం చేశాడు. (సైనైడ్ మింగి అనుకున్నట్లు చనిపోకపోతే తనను శత్రువుకు అప్పగించాలని చూస్తున్నట్లుగా హిట్లర్ అనుమానించాడు). సైనైడ్ మింగి ఆ తర్వాత తుపాకితో కాల్చుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చాడు.
ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 3 గంటలకు బెర్లిన్ లో ఛాన్సలర్ భవనం కింద బంకర్ లోని తన స్టడీ రూం లోకి భార్యతో సహా వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కొద్ది సేపటికి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. సహచర సైనికాధికారులు తలుపు తెరిచి చూడగా ఇవా బ్రౌన్ పక్కకు వాలిపోయి చనిపోయి ఉండగా, హిట్లర్ తల ముందుకు వాలి ఉందని అతని తలకు ఒక పక్క నుండి రక్తం కారుతోందని చూసినవారు చెప్పినట్లుగా సమాచారం. గదిలోకి వెళ్ళినవెంటనే సైనైడ్ వాసన ఘాటుగా తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం వ్యాప్తిలో ఉంది.
హిట్లర్ చనిపోయాక ఆయన ముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బంకర్ నుండి పైకి తెచ్చి భవనంలో ఒక చోట బాంబు దాడి వల్ల కలిగిన గోతిలో వేసి కాల్చారు. హిట్లర్, ఇవా బ్రౌన్ ల ఇద్దరి శవాలను పెట్రోలుతో తడిపి కాగితాలను కాల్చి ముట్టించారు. ఆ విధంగా హిట్లర్, ఇవాలు మరణించారు. అయితే వారిద్దరికి పోస్ట్ మార్టం చేయడానికి శవాలు మిగల్లేదు.
మొదటిసారి అక్కడికి చేరుకున్న సోవియట్ సేనలకు వారి దంతాలు మాత్రమే దొరికాయి. దానితో హిట్లర్ అసలు చనిపోలేదని, పశ్చిమ రాజ్యాల వైపుకి పారిపోయి వారి దగ్గర రక్షణ పొంది ఉండవచ్చని సోవియట్ నేతలు అనుమానించారు. వారి అనుమానమే హిట్లర్ మరణం చుట్టూ గోప్యత అల్లుకోవడానికి కారణం అయింది.
ఇంతకీ హిట్లర్, ఇవాలు నిజంగా చనిపోయారా లేక పారిపోయారా అన్నది ఇప్పటికీ నిర్ధారణగా తెలియదు. పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ లు హిట్లర్ చనిపోయాడన్న ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ భౌతిక రుజువులు మాత్రం ఇప్పటివరకు లేవు.
కింది ఫోటోలు ముసోలిని మరణంకు సంబంధించినవి. కుక్క చావు అంటే ఏమిటో తెలియని వారు ఈ ఫోటోలు చూస్తే తెలుసుకోవచ్చు. హిట్లర్ ఈ తరహా చావును తప్పించుకోగలిగాడు.
Photos: custermen.com
Mussolini death 03Mussolini death 04Hitler and Eva Braun
Mussolini death 02Mussolini death 07
Mussolini death 06Mussolini death 01Mussolini death 05
Mussolini death 08Mussolini death 10Mussolini death 09Mussolini death 11

హామీ / తనఖా లేని ఋణాలు...

సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.


సాధారణంగా ఋణం మంజూరుకి బ్యాంక్ వారు ప్రాజెక్ట్ ఎవరు  ప్రారంభిస్తున్నారు, ? వారి శక్తిసామర్ధ్యాలని, ఆ ప్రాజెక్ట్ కి ఉన్న మార్కెట్ అవకాశాలని అంచనా వేసుకుంటారు. తరువాత, ఇవ్వబోయే ఋణానికి తగిన హామీ, తనఖా ఉందా ? అన్నది చూస్తారు.


ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి వ్యాపారం చెయ్యగల శక్తిసామర్ధ్యాలు ఉండి , చేయబోయే ప్రాజెక్ట్ కి తగిన మార్కెట్ ఉండి కూడా తగిన హామీ ఇవ్వలేకపోవడం వలన ఋణం పొందలేని పరిస్తితులు చాలాసార్లు వస్తాయి.


ఈ హామీ ఇవ్వలేని/ తనఖాకి సరైన ఆస్తులు లేనివారికి ఈ ఇబ్బందులు లేకుండా పరిశ్రమలకి అప్పులు ఇవ్వడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అర్హులైన వారికి  కోటి రూపాయల ఋణం వరకు హామీ లేని ఋణాలని  ( అర్హత ని అనుసరించి ) మాత్రమే మంజూరు చెయ్యాలని నిర్దేశించింది.


అర్హులైన పారిశ్రామికవేత్తలు అంటే  Micro & Small enterprises Development Act 2006 ( MSMED)  నిర్వచనం ప్రకారం అర్హులైనవారు.


ఈ చట్టం క్రింద వ్యాపార సంస్థలని  రెండురకాలుగా విభజించారు.


పరిశ్రమలు ( Industrial enterprises)  :  తయారీ , ప్రొసెస్సింగ్ , లేదా వస్తువులని నిలవ చెయ్యడంలో ఉన్న సంస్థలు.


సేవా సంస్థలు ( Service Enterprises )  :  సేవలని కలిపించే సంస్థలు ఉదా.  Small road and water transport operators, professionals and self employed persons.


అయితే ఈ  సంస్థ లని ఆయా సంస్థలు "ఒరిజినల్" పెట్టుబడి ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ( Micro , Small , Medium Enterprises ) గా విభజించారు. ఒరిజినల్ పెట్టుబడి అంటే భూమి మరియు భవనసముదాయం పైన పెట్టుబడిని మినహాయించి , Ministry of SSI  నిబంధనలని అనుసరించి పెట్టిన పెట్టుబడి. 



అదేవిధంగా సేవాసంస్థల విషయంలో పెట్టుబడి అంటే భూమి, భవనం , ఫర్నిచర్, మరియు ఇతరవస్తువులు , ఆస్తులపైన పెట్టిన పెట్టుబడి కాకుండా, అంటే, ఆయా సేవలు అందిచడానికి ప్రత్యక్షంగా అవసరమయ్యే ఆస్తుల పైన పెట్టే పెట్టుబడిని పరిగణనలోనికి తీసుకుంటారు. 



అయితే సంస్థలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలుగా  ఎలా విభజిస్తారు ?




విభజన
ఒరిజినల్ పెట్టుబడి
 పరిశ్రమలు
 సేవా సంస్థలు
సూక్ష్మ సంస్థలు
 25 లక్షల రూపాయిల  వరకు
 10 లక్షల రూపాయిల  వరకు
 చిన్న సంస్థలు
 25 లక్షల రూపాయిల  నుండి  5 కోట్ల రూపాయిల వరకు
 10 లక్షల రూపాయిల  నుండి  2 కోట్ల రూపాయిల వరకు 
 మధ్యతరహా సంస్థలు
 5 కోట్ల రూపాయిల నుండి 10 కోట్ల రూపాయిల వరకు
 2 కోట్ల రూపాయిల నుండి 5 కోట్ల రూపాయిల వరకు
 
 

ఈ నిభంధనలకి అనుగుణంగా ఏర్పాటు ఐన సంస్థలు ఒక కోటి వరకు పొందే అప్పులకి బ్యాంక్ హామీ లేని ఋణాలని మంజూరు చెయ్యాలి ( ఆయా బ్యాంకుల నియమ నిభందనలను అనుసరించి అర్హులైన వారికి ). కానీ, చిల్లర టొకు వర్తకాలు, విద్యాసంస్థలు, స్వయం సహాయక బృందాలు  ఈ పధకం క్రింద ఋణం పొందుటకి వీలులేదు.

    

ఈ హామీ లేని ఋణాలని బ్యాంకులు  CGTMSE ( Credit Guarantee Fund Trust for Micro, Small and Medium Enterprises ) సంస్థ యొక్క Credit Guarantee Scheme  క్రింద మంజూరు చేస్తారు.

CGTMSE నిబంధనలు కొన్ని,  క్లుప్తంగా :



  • అర్హుడైన ఋణగ్రహీత కి కోటి రూపాయిల వరకు ఋణం.
  • ఏ విధమైన తనఖా ను  (Collateral security) బ్యాంకు లు తీసుకోరాదు.
  • ఏ విధమైన  మిగిలిన / ఇతర అప్పులను తీర్చడానికి ఈ ఋణాన్ని వాడరాదు.
  • CGTMSE గ్యారంటి  అయిదు సంవత్సరముల వరకు వర్తిస్తుంది.
  • Guarantee fee, Annual Service fee ను చెల్లిస్తూ ఉండాలి.

అంబుడ్స్‌మన్‌ గురించి తెలుసా ???

ఖాతాదారులకు జరిగే అన్యాయాలను అడ్డుకునేందుకు, బ్యాంకు సేవగా రిజర్వ్‌ బ్యాంక ఆఫ్‌ ఇండియా అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది ప్రారంభమై నాలుగేళ్ళు  దాటినా, కస్టమర్లకు అవగాహన మాత్రం పెరగలేదు. ఏదైనా సేవా లోపం జరిగి ఖాతాదారుల ఫిర్యాదులను బ్యాంకు అధికారులు పట్టించుకొనట్టయితే ఈ కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ ఆ ఫిర్యాదులను విచారించి బ్యాంకులపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారుడికి జరిగిన అన్యాయంపై తగు ప్రతిఫలం కూడా లభిస్తుంది.
బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కేంద్రాలకు వెళ్ళేముందు  గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎటువంటి ఫిర్యాదులను అంబుడ్స్‌మన్‌ స్వీకరిస్తుంది ఎవరెవరిపై ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేసే విధానమేంటి తదితర విషయాలను తెలుసుకుందాం.

ఏ విషయమైనా సరే బ్యాంకులు సరిగ్గా స్పందించకున్నా, చెల్లింపుల్లో ఆలస్యం జరిగి ఖాతాదారుడికి  నష్టం కలిగినా, చెక్కు కలెక్షన్స్‌, డ్రాఫ్ట్స్ , బిల్స్‌ తదితరాల్లో వచ్చే సమస్యలపై, ఆఖరికి చిన్న డినామినేషన్‌ నోట్లు (ఒకటి, ఐదు, 10 రూపాయల నోట్లు, నాణేలు) స్వీకరించడానికి నిరాకరించినా ఫిర్యాదు చేయవచ్చు. పనివేళల్లో బ్యాంకుల్లో సేవలందకపోయినా, ముందుగా చెప్పకుండా చార్జ్‌లను కస్టమర్లపై వేసినా, రావలసిన వడ్డీని కలపకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. అకౌంట్‌ను ప్రారంభించడానికిగానీ, ముగించడానికి గానీ బ్యాంక సరిగా స్పందించకపోయినా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా తెలియ జేయకుండా  లేక సరైన కారణం లేకుండా అకౌంట్‌ను ముగిస్తే ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుల ద్వారా లేక బ్యాంకు ప్రతినిధుల ద్వారా ఏ విధమైన నష్టం కలిగినా ఫిర్యాదు చేయవచ్చు.

అన్ని జాతీయ, ప్రైవేటు, ప్రైమరీ కో ఆపరేటివ్‌, రీజనల్‌ రూరల్‌ బ్యాంకులన్నింటిపై ఫిర్యాదులను పంపించవచ్చు. ఫిర్యాదు చేయదలచుకున్న బ్యాంకు బ్రాంచ్‌ని వివరంగా తెలుపుతూ, అక్కడి అధికారి పేరును ప్రస్తావిస్తూ సమస్యను వివరించవచ్చు. బ్యాంకు శాఖల వివరాలు, అక్కడి అధికార్ల వివరాలు దాదాపు ప్రతి బ్యాంకు ఆధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచబడి వున్నాయి.వివిధ రీజియన్లలో బ్యాంకింగ్‌ అంబుడ్‌మన్స్‌ స్థానిక కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలను ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌ ని చూసి తెలుసుకోవచ్చు.బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కు పంపే ఫిర్యాదుల్లో ఫిర్యాది చిరునామా తప్పనిసరి. అదే విధంగా అంబుడ్స్‌మన్‌కు అందే ఫిర్యాదు ముందుగా బ్యాంకుకు పంపాలి. బ్యాంకు 30 రోజుల్లోపై సరిగా స్పందించకపోయినా, లేదా బ్యాంకు స్పందన సంతృప్తి కరంగా లేదని అనిపించినా అంబుడ్స్‌మన్‌కు తెలియ పరచవచ్చు. ఈ ఫిర్యాదుల కోసం ఆర్‌బిఐ ఒక ఫార్మాట్‌ను సిద్ధం చేసింది. ఈ ఫార్మాట్‌ను కూడా ఆర్‌బిఐ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈ ఫార్మాట్‌లో కాకుండా మరే విధంగా ఫిర్యాదును పంపినా దాన్ని తిరస్కరించే అధికారం బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కు వుంది. కస్టమర్‌కు కలిగిన నష్టంపై సాక్ష్యాలు, బ్యాంకుకు ఫిర్యాదు అందినట్టు ఎకనాలడ్జ్‌మెంట్‌ కాపీ, పర్సనల్‌ వివరాలతో ఫిర్యాదు చేయాలి. అదే క్రెడిట్‌ కార్డులపై ఫిర్యాదులైతే అధికంగా బిల్లులు వచ్చినా, డబ్బును నష్టపోయినా, బ్యాంకు అధికారుల ప్రవర్తన సరిగా లేకున్నా, మానసికంగా వేధించినా, ఆఖరికి సమయం కోల్పోయినా న్యాయం చేయాలని అంబుడ్స్‌మన్‌ను కోరవచ్చు. అయితే, ఈ ఫిర్యాదులను గరిష్టంగా ఒక సంవత్సరంలోపు అందించాలి. మొదట ఇచ్చిన కంప్లైంట్‌కు బ్యాంకు స్పందన సరిగా లేదని అంబుడ్స్‌మన్‌ భావిస్తే తగు చర్యలు తీసుకుంటుంది. వాదోపవాదాల కోసం అంబుడ్స్‌మన్‌ తరపున బ్యాంకుకు, కస్టమర్‌కు మధ్య ఒక మధ్యవర్తి వుంటారు. వాదోపవాదాలను బట్టి ఫిర్యాదును కొట్టి వేయడం కానీ, లేక నష్టపరిహారం కోసం గానీ అంబుడ్స్‌మన్‌ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను బ్యాంకులు 15 నుంచి 30 రోజుల్లోపై పాటించి తీరాలి.ఒకవేళ అంబుడ్స్‌మన్‌ ఒకసారి ఫిర్యాదును కొట్టివేస్తే మళ్ళీ అదే ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. అయితే, ఈ విషయంలో జడ్జిమెంట్‌ కాపీ అందిన 45 రోజుల్లోగా అప్పిలేట్‌ అథారిటీకి వెళ్ళే సదుపాయం ఖాతాదారులకు  వుంటుంది. అక్కడ కేసును మళ్ళీ తిరిగి విచారిస్తారు

http://www.rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=164# అనే లింక్‌పై క్లిక్‌చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా దిగువ పేర్కొన్న చిరునామా, టెలిఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. Reserve Bank of India, 6-1-56, Secretariat Road, Saifabad, Hyderabad. 500 004.

Tel.No. 23210013/ 23243970
Fax No. 04023210014

Address for Communication

Address card