Wednesday, December 24, 2014

సంక్రాంతి అంటే?



సంక్రాంతి అంటే?

సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే... మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపురోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.
సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్ర వచనం

అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వ ముఖ రేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడు.

రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ఆధ్యాత్మికంగా అందరూ పై పై మెట్లు ఎక్కాలని ఆశిస్తూ.
సర్వే జనాః సుఖినోభవంతు

No comments:

Post a Comment

Address for Communication

Address card