Tuesday, December 04, 2018

అసలు మధుపర్కం అంటే ఏమిటి?


 
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం అందరికీ తెలిసినదే. కానీ, చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అంటే బట్టలు పెట్టడం అని పెద్దలలో స్థిర పడిపోయింది కదా?
మొన్నెపుడో టీ.వీ. చానళ్ళు తిరగేస్తుంటే, ఒక దానిలో అప్పుడే మధుపర్కం సమర్పయామిఅని వినబడేసరికి, ఒక్క క్షణం నా పరుగును ఆపాను. అదో సామూహిక పూజ. వెంటనే ఇద్దరు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఓహో! అనుకొని మళ్ళీ ముందుకు కదిలిపోయాను. పూజా పద్ధతులు అందించే బ్లాగులూ వెబ్‌సైట్‌లలో మధుపర్కం సమర్పయామిఅన్ని ఉన్నప్పుడు, ‘ఇప్పుడు రెండు దూది వత్తులు సమర్పించండిఅని చూశాను. కొన్ని చోట్ల, శోడశోపచారాలలో వస్త్రం సమర్పయామిని మధుపర్కం సమర్పయామిఅని కూడా ప్రచురిస్తున్నారు. పెళ్ళిళ్ళలో కూడా మధుపర్కం అనే పదం వినబడుతుంది.మధుపర్కం బట్టలుమీరూ వినే ఉంటారు. దీపావళి అంటే టపాసుల పండుగఅయినట్టేమో కదా? ఇది కరెక్ట్ కాదు అని తెలుస్తోంది. మధు అంటే తియ్యనిలేకతేనెఅని అర్థం. పర్కం అంటే మిశ్రమం. మరి మధుపర్కం అంటే బట్టలు అని ఎలా స్థిరపడిపోయింది? ప్రామాణికంగా మధుపర్కం అంటే ఏమిటి అని శోధించాను. మధుపర్కం గురించి నాకు తటస్థించిన వివరాలు
అసలు మధుపర్కం అంటే ఏమిటి?
మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. ఆ మిశ్రమం వేటితో చేయాలి? దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్వ పంచభిఃఅంటే సమపాళ్ళలో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇంకా జలం. వీటి మిశ్రమమే మధుపర్కం.
పంచామృతం మధుపర్కం తేడా?
పూజల్లో పంచామృతం వాడతారు కదా మరి పంచామృతానికీ, మధుపర్కానికీ తేడా ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనే ఇంకా చెక్కెర ఈ క్రమంలో ఆయా పదార్థాలను విడి విడిగా స్నపనం చేసి, అలా వచ్చిన పదార్థాన్ని అంటే పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించాలి. అన్నిటినీ కలిపేసి అభిషేకం చేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమటుకూ సరైనదో తెలియదు. పంచామృతంతో అభిషేకం చేస్తాము; మధుపర్కం స్వీకరించమని అంటే తాగమని సమర్పించుకుంటాము అది తేడా.
మధుపర్కం ఎందుకు సమర్పిస్తారు?
గౌరవాన్ని సుచిస్తూ సమర్పించుకునేది మధుపర్కం. యజమాని అంటే పూజ చేయిస్తున్న గృహస్తు లేదా పెళ్ళిలో కన్యాదానం చేస్తున్నతను మర్యాద పూర్వకంగా గౌరవాన్ని సూచిస్తూ మధుపర్కం సమర్పించుకోవాలి. పూజలో అయితే భగవంతుడికి, పెళ్ళిలో ఐతే నారాయణ స్వరూపమైన వరుడికి. మధుపర్కం సమర్పించుకోవటం ఎంతటి గౌరవ సూచకమో, దానిని పద్ధతిగా స్వీకరించటమూ అంతే మర్యాదతో కూడుకున్నది. సంస్కృత నిఘంటువులో  ‘A mixture of honey’, a respectful offering made to a guest or to the bridegroom on his arrival at the door of the father of the bride అని ఉంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

"భార్య ఇంటిపేరును భర్త ఎందుకు పెట్టుకోడు?”


పెళ్లైన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. అబ్బాయి ఇంటిపేరు మాత్రం మారదు. ఇలా ఎందుకు? భార్య ఇంటిపేరును భర్త ఎందుకు పెట్టుకోడు?
పెళ్లి తర్వాత బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ తన పేరు పక్కన అహుజా పదాన్ని జోడించడంపై చర్చ జరుగుతోంది. సోనమ్ కపూర్ చేసింది కరెక్టేనా, పెళ్లవగానే తన భర్త ఇంటిపేరును మహిళ స్వీకరించాలా, లేక తండ్రి ఇంటి పేరునే ఉంచుకోవచ్చా, అంటే మహిళకు ప్రత్యామ్నాయం ఆ రెండు పేర్లే.
ఒక మహిళకు, ఆమె తల్లికి ఇంటి పేరు ఉండదు. వారి గుర్తింపు తండ్రి లేదంటే భర్త ఇంటి పేరుతోనే ముడిపడి ఉంటుంది.భారతదేశంలోని హిందూ కుటుంబాల్లో ఈ సంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయి పేరునే మార్చేస్తారు. కొన్నిచోట్ల ఆమె పేరు మార్చకపోయినా, ఆమె పేరుకు భర్త ఇంటి పేరును జోడిస్తారు. భారతదేశంలో కొన్నిచోట్ల మినహా చాలాకాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
మిగతా వారికి భిన్నంగా తమ ఇంటి పేరును మార్చుకునే విషయానికి వస్తే, శిల్పాశెట్టి కుంద్రాను, ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను, కరీనాకపూర్ ఖాన్‌ అనే పేరును తమ పేరు పక్కన జోడించే ముందు చాలా ఆలోచించే ఉంటారు. బచ్చన్ లేదా ఖాన్ అనే ఇంటి పేరును జోడించడాన్ని వారు భారంగా అనుకున్నారా, లేక తమ గుర్తింపు పూర్తిగా కోల్పోకూడదనే ఇలా తమ పేర్ల వెనక వాటిని కలిపారా?
పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవడం అనేది మహిళను తక్కువ చేయడమే అనే ఆలోచన గత దశాబ్దం నుంచీ ఉంది. అలా తమకు గుర్తింపు లేకుండా పోతుందని మహిళలు భావిస్తున్నారు.
భర్త పేరు మారనప్పుడు, మేమెందుకు ఇంటిపేరు మార్చుకోవాలి"
పెళ్లి అనేది ఒక కొత్త బంధం. అందులో ఇద్దరూ తమ వ్యక్తిత్వాలను అలాగే ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.  భర్త పేరు మారనప్పుడు, భార్య తన పేరు ఎందుకు మార్చుకోవాలని కొందరు మహిళలు ప్రశ్నించేవారు.
     బాలీవుడ్‌ ప్రముఖులైన షబానా అజ్మీ, విద్యాబాలన్, కిరణ్‌ రావ్ లాంటి వారు పెళ్లి తర్వాత తమ పేర్లు మార్చుకోలేదు.  టైటానిక్ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన కేట్ విన్‌స్లెట్ కూడా తన పేరు పక్కన భర్త ఇంటి పేరును పెట్టుకోవడం ఇష్టం లేదని 2013లో చెప్పింది. మూడోసారి పెళ్లి చేసుకున్న కేట్ విన్‌స్లెట్, తన పేరంటేనే తనకు ఇష్టమని చెప్పింది. ఆమె దాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఇప్పుడు కూడా మార్చుకోవాలనుకోవడం లేదు.
కేట్ విన్‌స్లెట్ మొదటి పెళ్లి 1998లో జరిగింది. ఆమె అప్పుడు కూడా తన పేరు మార్చుకోలేదు.
మహిళ ఇంటిపేరు మార్చే సంప్రదాయం ఇప్పటిది కాదు
పెళ్లి తర్వాత మహిళ తన ఇంటి పేరు మార్చుకునే సంప్రదాయం చాలా పురాతనమైనది. ఇది భారతదేశానికే పరిమితం కాలేదు.
చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలోచన 14వ శతాబ్దంలో పుట్టిందని భావిస్తున్నారు.
పెళ్లి తర్వాత మహిళ తన పేరును కోల్పోతుంది. తను వేరేవారికి భార్య అవుతుంది. స్త్రీ, పురుషులు ఒకటవుతారు, ఈ ఐక్యతకు భర్త పేరు చిహ్నంగా మారుతుంది.
అధికారం కోసం మహిళలు గళమెత్తడంతో ఈ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత తమ పేరుతో భర్త ఇంటిపేరు పెట్టుకోవడాన్ని తిరస్కరించారు.

ఆ దేశంలో మహిళ పేరు మారిస్తే నేరం

చాలా దేశాల్లో దీని కోసం చట్టాలు కూడా చేశారు.
1970లో గ్రీస్ ఒక సవరణ తెచ్చింది.దీని ప్రకారం పెళ్లి తర్వాత కూడా మహిళలు తల్లిదండ్రులు పెట్టిన పేరును ఉంచుకోవడం తప్పనిసరి. పిల్లలు పుట్టినపుడు వారి పేర్ల పక్కన ఎవరి ఇంటి పేరు ఉండాలనే దానిపై కూడా ఇక్కడ స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. దాన్ని తల్లిదండ్రులు కలిసి నిర్ణయిస్తారు. ఇలాగే ఇటలీలో కూడా 1975లో కుటుంబాలకు సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకొచ్చారు. మహిళలకు పెళ్లైన తర్వాత కూడా తమ మేడిన్ అంటే పెళ్లికి ముందున్న ఇంటి పేరు పెట్టుకునే అధికారం కల్పించారు.బెల్జియంలో కూడా పెళ్లి తర్వాత పేరు మార్చుకోవడం అనేది లేదు. 2014 ముందు ఉన్న చట్ట ప్రకారం పిల్లలు తండ్రి ఇంటి పేరునే తీసుకోవాలని చట్టం ఉండేది. అందులో మార్పులు తీసుకొచ్చారు.ఇప్పుడు పిల్లలు తల్లి లేదా తండ్రి ఇంటి పేర్లలో ఏదో ఒకటి తమ పేరుకు జోడించవచ్చు. నెదర్లాండ్స్‌లో అయితే కావాలంటే భర్త తన పేరు పక్కన భార్య ఇంటిపేరు పెట్టుకోవచ్చు. అక్కడ తల్లిదండ్రుల్లో ఎవరి ఇంటి పేరు ఎంచుకోవాలనేది పిల్లల ఇష్టం.
భారతదేశం విషయానికి వస్తే పేరు మార్చుకోకపోవడం అనేది సమానత్వం దిశగా మహిళల ప్రయత్నం కావచ్చు.
       కానీ ఇప్పటికీ పెళ్లి తర్వాత మహిళ తన భర్త ఇంటికెళ్లి ఉండాల్సి వస్తోంది. ఇది చింతించాల్సిన విషయం.ఒకవేళ భార్య కుటుంబంతో భర్త కలిసి ఉంటే అతను ఎన్నో అవమానాలకు గురికావాల్సి వస్తోంది. అతని మగతనంపైనే జోకులు వేస్తుంటారు.

అయితే సమానత్వం ఎలా?

పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోకపోవడం లేదా దాని పక్కన భర్త ఇంటి పేరు కలపడం అనేది ఒక ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఏం జరగొచ్చు, ఏదైనా మార్చాల్సి ఉంటుందా అనేది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Saturday, December 01, 2018

ది పొన్నూరు టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్


ఈ రోజు అనగా ది 27 11 2018 మంగళవారం ఉదయం 10 గంటలకు “ది పొన్నూరు టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్”  వారి ఆధ్వర్యంలో పొన్నూరు రింగ్ రోడ్డు లోని HDFC బ్యాంక్ వద్ద గల పల్సస్ అసోసియేషన్ హాల్ నందు జీఎస్టీ వర్క్ షాప్ జరిగినది .ఇందులో తెనాలి రేంజ్ central  GST సూపరిండిండెంట్ శ్రీ మధు బాబు గారు, ఇన్స్పెక్టర్ షబ్బీర్ గారు పాల్గొని GST ని గురించి ప్రసంగించినారు  ఈ సభకు ఆడిటర్ శ్రీ పులిపాక  ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు.పొన్నూరు మరియు పరిసరప్రాంత అడిటర్లుఎకౌంటెంట్ లు వ్యాపారస్తులు పాల్గొన్నారు

 మరియు ఇదే సమావేశం లో పొన్నూరు పట్టణంలో నూతనముగా ప్రారంభించిన

‘ది పొన్నూరు టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ‘(TPTPA)  ను,అధ్యక్షుడు శ్రీ P V S S V  ప్రసాద్ గారిని  ,కార్యదర్శి శ్రీ Ch L  N  ప్రభాకర్ గారిని , కోశాధికారి శ్రీ  D సురేష్ కుమార్ గార్లను   సభకు పరిచయం చేసి పలువురు  అభినదించారు
























Address for Communication

Address card