పెళ్లి తర్వాత బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ తన పేరు పక్కన అహుజా
పదాన్ని జోడించడంపై చర్చ జరుగుతోంది. సోనమ్ కపూర్ చేసింది కరెక్టేనా, పెళ్లవగానే తన భర్త ఇంటిపేరును మహిళ స్వీకరించాలా,
లేక తండ్రి ఇంటి
పేరునే ఉంచుకోవచ్చా, అంటే
మహిళకు ప్రత్యామ్నాయం
ఆ రెండు పేర్లే.
ఒక మహిళకు, ఆమె
తల్లికి ఇంటి పేరు ఉండదు. వారి గుర్తింపు తండ్రి లేదంటే భర్త ఇంటి
పేరుతోనే ముడిపడి ఉంటుంది.భారతదేశంలోని హిందూ కుటుంబాల్లో ఈ సంప్రదాయం ఉంది. కొన్ని
ప్రాంతాల్లో అయితే అమ్మాయి పేరునే మార్చేస్తారు. కొన్నిచోట్ల ఆమె పేరు మార్చకపోయినా,
ఆమె పేరుకు భర్త ఇంటి
పేరును జోడిస్తారు. భారతదేశంలో కొన్నిచోట్ల మినహా చాలాకాలంగా ఈ సంప్రదాయం
కొనసాగుతోంది.
మిగతా వారికి భిన్నంగా తమ ఇంటి పేరును
మార్చుకునే విషయానికి వస్తే, శిల్పాశెట్టి కుంద్రాను,
ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను,
కరీనాకపూర్ ఖాన్ అనే
పేరును తమ పేరు పక్కన జోడించే ముందు చాలా ఆలోచించే ఉంటారు. బచ్చన్
లేదా ఖాన్ అనే ఇంటి పేరును జోడించడాన్ని వారు భారంగా అనుకున్నారా, లేక తమ గుర్తింపు పూర్తిగా కోల్పోకూడదనే ఇలా తమ పేర్ల
వెనక వాటిని కలిపారా?
పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవడం అనేది
మహిళను తక్కువ చేయడమే అనే ఆలోచన గత దశాబ్దం నుంచీ ఉంది. అలా తమకు గుర్తింపు
లేకుండా పోతుందని మహిళలు భావిస్తున్నారు.
భర్త పేరు
మారనప్పుడు, మేమెందుకు ఇంటిపేరు
మార్చుకోవాలి"
పెళ్లి అనేది ఒక కొత్త బంధం. అందులో ఇద్దరూ తమ వ్యక్తిత్వాలను అలాగే
ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. భర్త పేరు మారనప్పుడు, భార్య తన
పేరు ఎందుకు మార్చుకోవాలని కొందరు మహిళలు ప్రశ్నించేవారు.
బాలీవుడ్ ప్రముఖులైన షబానా
అజ్మీ, విద్యాబాలన్, కిరణ్ రావ్
లాంటి వారు పెళ్లి తర్వాత తమ పేర్లు మార్చుకోలేదు. టైటానిక్ లాంటి
సూపర్ హిట్ సినిమాలో నటించిన కేట్ విన్‌స్లెట్ కూడా తన పేరు పక్కన భర్త ఇంటి పేరును
పెట్టుకోవడం ఇష్టం లేదని 2013లో చెప్పింది. మూడోసారి పెళ్లి చేసుకున్న కేట్ విన్‌స్లెట్, తన పేరంటేనే తనకు ఇష్టమని చెప్పింది. ఆమె దాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఇప్పుడు కూడా మార్చుకోవాలనుకోవడం
లేదు.
కేట్ విన్‌స్లెట్ మొదటి పెళ్లి 1998లో జరిగింది. ఆమె అప్పుడు కూడా తన పేరు
మార్చుకోలేదు.
మహిళ
ఇంటిపేరు మార్చే సంప్రదాయం ఇప్పటిది కాదు
పెళ్లి తర్వాత మహిళ తన ఇంటి పేరు మార్చుకునే సంప్రదాయం చాలా పురాతనమైనది. ఇది
భారతదేశానికే పరిమితం కాలేదు.
చరిత్ర
చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలోచన 14వ శతాబ్దంలో
పుట్టిందని భావిస్తున్నారు.
పెళ్లి తర్వాత మహిళ తన పేరును కోల్పోతుంది. తను వేరేవారికి
భార్య అవుతుంది. స్త్రీ, పురుషులు
ఒకటవుతారు, ఈ ఐక్యతకు భర్త పేరు చిహ్నంగా
మారుతుంది.
అధికారం కోసం మహిళలు గళమెత్తడంతో ఈ ఆలోచనలో కూడా మార్పు
వచ్చింది. చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత తమ పేరుతో
భర్త ఇంటిపేరు పెట్టుకోవడాన్ని తిరస్కరించారు.
ఆ దేశంలో మహిళ పేరు మారిస్తే నేరం
చాలా దేశాల్లో దీని కోసం చట్టాలు కూడా చేశారు.
1970లో గ్రీస్ ఒక సవరణ తెచ్చింది.దీని ప్రకారం పెళ్లి తర్వాత
కూడా మహిళలు తల్లిదండ్రులు పెట్టిన పేరును ఉంచుకోవడం తప్పనిసరి. పిల్లలు పుట్టినపుడు
వారి పేర్ల పక్కన ఎవరి ఇంటి పేరు ఉండాలనే దానిపై కూడా ఇక్కడ స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. దాన్ని
తల్లిదండ్రులు కలిసి నిర్ణయిస్తారు. ఇలాగే
ఇటలీలో కూడా 1975లో కుటుంబాలకు సంబంధించిన చట్టంలో
కీలక సవరణ
తీసుకొచ్చారు. మహిళలకు పెళ్లైన తర్వాత కూడా తమ మేడిన్ అంటే పెళ్లికి ముందున్న ఇంటి
పేరు పెట్టుకునే అధికారం కల్పించారు.బెల్జియంలో కూడా పెళ్లి తర్వాత పేరు
మార్చుకోవడం అనేది లేదు. 2014 ముందు ఉన్న చట్ట ప్రకారం పిల్లలు తండ్రి ఇంటి పేరునే తీసుకోవాలని
చట్టం ఉండేది.
అందులో మార్పులు తీసుకొచ్చారు.ఇప్పుడు పిల్లలు తల్లి లేదా తండ్రి ఇంటి పేర్లలో ఏదో
ఒకటి తమ పేరుకు జోడించవచ్చు. నెదర్లాండ్స్‌లో అయితే కావాలంటే భర్త తన పేరు పక్కన భార్య ఇంటిపేరు
పెట్టుకోవచ్చు. అక్కడ
తల్లిదండ్రుల్లో ఎవరి ఇంటి పేరు ఎంచుకోవాలనేది పిల్లల ఇష్టం.
భారతదేశం విషయానికి వస్తే పేరు మార్చుకోకపోవడం అనేది సమానత్వం
దిశగా మహిళల ప్రయత్నం కావచ్చు.
కానీ ఇప్పటికీ పెళ్లి తర్వాత మహిళ తన
భర్త ఇంటికెళ్లి ఉండాల్సి వస్తోంది. ఇది చింతించాల్సిన విషయం.ఒకవేళ భార్య
కుటుంబంతో భర్త కలిసి ఉంటే అతను ఎన్నో అవమానాలకు గురికావాల్సి వస్తోంది. అతని
మగతనంపైనే జోకులు వేస్తుంటారు.
అయితే సమానత్వం ఎలా?
పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోకపోవడం లేదా దాని పక్కన భర్త
ఇంటి పేరు కలపడం అనేది ఒక ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఏం జరగొచ్చు, ఏదైనా మార్చాల్సి ఉంటుందా అనేది మాత్రం
మనమే నిర్ణయించుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment