Friday, October 13, 2017

ఇది మీరు ఇంతకుముందు విని ఉండవచ్చు అయినా మరోసారి వినవచ్చు

http మరియు https మధ్య తేడా ఏమిటి?
మీరు చాలామంది ఈ తేడా గురించి తెలుసుకోని ఉండవచ్చు, కానీ ఇది ఇంకా తెలుసుకోని వారి కోసం ....
భారతదేశంలో 32 లక్షల డెబిట్ కార్డులు మోసాల బారిన పడ్డాయి. మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం గురించి
 http: // మరియు https: // ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే
http
అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ( Hyper Text Transfer Protocol)
S అంటే (పెద్ద ఆశ్చర్యం) "సెక్యూర్" కొరకు ఉంటుంది. మీరు ఒక వెబ్సైట్ లేదా వెబ్ పేజీ, సందర్శిస్తే వెబ్ బ్రౌజర్ లో చిరునామా చూడండి, అది బహుశా ఇలా ప్రారంభమవుతుంది: http: /// అంటే వెబ్సైట్ మీ బ్రౌజరుతో మాట్లాడటం అని అర్థం .సాధారణ అసురక్షిత భాష. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీ, మీ కంప్యూటర్ సంభాషణలు మరో వెబ్సైట్తో "వినడం" ఎవరకైనా సాధ్యమవుతుంది. మీరు వెబ్సైట్లో ఒక ఫారమ్ను పూరించినట్లయితే, ఆ సైట్కు మీరు పంపే సమాచారాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇలాంటి వాటిల్లో  ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ నంబర్ను మీరు ఎక్కడా నమోదు చేయకూడదు
అలా
వెబ్సైట్ http తో కాకుండా వెబ్ అడ్రసు https  తో కానీ ప్రారంభిస్తే మీ కంప్యూటర్లో ఒక్క వెబ్సైట్తో మాత్రమె  మాట్లాడుతున్నారని అర్థం .సురక్షిత కోడ్. ఇంకెవరో వినలేరు చూడలేరు
ఇది చాలా ముఖ్యమైనది, అవునా?      
ఏదయినా వెబ్సైట్  మీ క్రెడిట్ / డెబిట్ కార్డును నమోదు చేయమని అడుగుతే మీరు వెంటనే అడ్రస్ బార్ వైపు చూడాలి, https: // తో ప్రారంభం అవక పొతే  ఎట్టి పరిస్తిలోను సున్నితమైన( sensitive ) వివరాలు   నమోదు చేయ కూడదు   
       ఏదైనా వెబ్ సైట్ యొక్క పేరును తనిఖీ చేస్తున్నప్పుడు, first look డొమైన్ పొడిగింపు కోసం చూడండి (.com లేదా .org, .co.in, .net మొదలైనవి). దానికి కొద్దిగా ముందు వెబ్సైట్ లేదా డొమైన్ పేరు వుండాలి. ఉదాహరణకి , http://amazon.diwali-festivals.com, డాట్  కాం కి  ముందు పదం " diwali-festivals " (NOT "అమెజాన్"). కాబట్టి, ఈ వెబ్పేజీ amazon.com కు సంబంధించినది కాదు, కానీ " diwali-festivals.com" కు చెందినది.
మీరు బ్యాంకుల పేరుతొ జరిగే మోసం కూడా ఇదే విధంగా తనిఖీ చేయవచ్చు.
మీ ebanking  లో login  అయ్యే ముందుగానే ".com" అనే పేరుకు ముందు మీ బ్యాంకు పేరు ఉందా లేదా అని నిర్ధారించుకోండి. "Something.icicibank.com" -icici చెందినది, కానీ’ “ icicibank. Something.com  “ బ్యాంకు కు చెందినది  కాదు "some1else".కు చెందినది
  ఆన్లయిన్ మోసాల బారిన పడకుండా కొంతమంది అయినా జాగ్రత్త పడాలని.....ఆశిస్తూ

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, October 06, 2017

ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను

             యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. వాట్సాప్‌ మెసేజ్‌ టోన్‌.. వెంటనే ట్విటర్‌లో కూత.. మరుక్షణంలో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌.. ఇవి చాలవన్నట్టు స్కైపీలో కాల్‌.. సోషల్‌ మీడియా స్మార్ట్‌ అయ్యాక చాలామందికి ఇలా అష్టావధానం చేయక తప్పట్లేదు. కానీ మల్టిపుల్‌ సోషల్‌ మీడియా యాక్టివిటీ్‌సతో మల్టిపుల్‌ కష్టాలు తప్పేట్టు లేదు. లిప్తపాటులో సామాజిక మాధ్యమాలన్నీ చుట్టేయడం అలవాటైతే.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఖాయం
       GST,IT ఇతరా పని వత్తిడివల్ల ఈ మధ్య సోషల్ మీడియా కి కొద్దిగా దూరంగా ఉన్నా లంచ్ బ్రేక్ లో  అక్కడే ఉన్న నాక్లయింటు ,బాల్య స్నేహితుని ఫోన్లో వాట్సాప్ చూస్తూ “ఏరా వాట్సప్ చూడటానికి టైము వుండటం లేదా అని అడిగా” .అంతే ఇలా విసుక్కున్నాడు ‘‘ఎలా చావనురా? ఇదుగో చూడు; అక్షరాలా ఏడు వేల మెసేజీలున్నాయి;. మొత్తం మెమరీ అంతా మట్టిగొట్టుకుపోతున్నది; ఫోన్ స్లో; డిలిట్ చేస్తూ కూర్చోవటానికే టైమ్ లేదు, ఇక వాటిని చదివేంత ఓపిక, సమయం ఎక్కడుందిరా;? ఎవడో గ్రూపులో జాయిన్ చేస్తాడు, లెఫ్ట్ అని కొడదామని అనుకుంటే, అదీ అందులో కనిపించి దొబ్బేస్తుంది; వాడు ఫీలవుతాడు; వెంటనే ఫీలై ఫోన్ చేసి చెడామడా ఆడేసుకుంటాడు; ఎవడేమనుకుంటాడో ఏమో; ఈ ఫీలింగ్ తో అన్ని గ్రూపులూ భరిస్తున్నాను; పోనీ, ఈ అడ్డమైన స్మార్ట్ భీకర ఫోన్ వదిలించుకుందామంటే, మా ఆఫీసరు గ్రూపు, మా కొలీగ్స్ గ్రూపు, మా కులపోళ్ల గ్రూపు, మా అపార్ట్ మెంట్ గ్రూపు, మా మందు దోస్తుల గ్రూపు అన్నీ ఇందులోనే;. ఏంబే;? వాట్సప్ లో లేవా? తీసేస్తావా? అంటూ కస్సుమంటున్నారు; చివరకు ముఖ్యమైన సమాచారం ఏదో పెడతాడు, మా ఆఫీసర్; ఏదో తొక్కలో మెసేజీ, వేలల్లో అదొక్కటి అనుకుని ఊరుకుంటానా? ఫోన్ చేసి తిట్టేస్తున్నాడు; యూ నాన్సెన్స్ ఫెలో, సోషల్ గా ఉండటం తెలియదా? అంటున్నాడు; ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను         
         నాదో దరిద్రపు ఫోన్, డిలిట్ చేయాలంటే ఒక్కొక్కటీ సెలక్ట్ చేసి మరీ డిలిట్ కొట్టాల్సి వస్తున్నది;. మొన్న రాత్రి కూర్చున్నాను, పొద్దున్న నాలుగు గంటలకు గానీ తెమల్లేదు; తెల్లారి ఆఫీసు డుమ్మా;. కాస్త కాఫీ తాగి సేద తీరానో లేదో, మరో రెండొందల మెసేజీలు; జాతికి పట్టిన వైరసురా ఇది;? వీడియోలు, ఫోటోలు, నా ఖర్మరా నా ఖర్మ;. హాయిగా ఏ నోకియా పాత మోడల్ ఫోన్ కొనేస్తానూ అనుకుంటే, ఫోన్ నంబర్లన్నీ మెయిల్ తో లింకై ఉండిపోయాయి;
        ఇక ఇలా కాదని, మొన్న ఓ డాక్టరు దగ్గరికి పోయాను, కాస్త ఏదైనా నాలుగు టాబ్లెట్లు ఇస్తాడేమో, ఈ తలతిక్క వాట్సప్ బాధల నుంచి రిలీప్ కోసం అనుకున్నాను; వెళ్లాక ఏముంది? తనూ మెసేజీలు డిలిట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.సరే అని ఇక్కడ నువ్వూ ఇంతే ,ఇప్పుడు ప్రపంచం అందరికి రిలీఫ్ కావాలనుకొంటా

Tuesday, October 03, 2017

ఉద్యోగ పరీక్షల నిర్వహణ ముసుగులో నిరుద్యోగులతో ప్రభుత్వ వ్యాపారం .

               రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలతో ముందుకువెళుతున్నామని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ చెప్పటం  నిరుద్యోగపర్వంలో అది పెద్ద జోక్.నోటిఫికేషన్ ఎప్పుడిస్తారో తెలీదు,రిజల్టు ఎప్పుడో తెలీదు,సిలబస్ అంతకన్నా తెలీదు,పోనీ ఈ గండాలు ఎలాగోలా దాటినా,నియామకాల టైము వచ్చేటప్పటికి ఎవరో ఒకరు (బహుసా వీళ్ళు, బినామీ లేనేమో) కోర్టు కెల్లటం  ,దీన్ని అటకేక్కియ్యటం.ఇదీ నియామకాల తీరు. భవిష్యత్ ఏమిటో తెలియక వారు పడుతున్న ఆవేదన మనం చూస్తున్నదే
              ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో నిరుద్యోగం అనేది యువతను ఆకర్షించే మంత్రం.ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కు  సంబంధించిన సమస్య కాదు.చదివిన చదువుకు, అవసరం ఉండే ఉద్యోగాలకు సంభంధం ఉండదు. అసలు విద్యా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన జరగాల్సి ఉంది.
దోపిడీ విధానం:

 1. నోటిఫికేషన్లు:
              కేంద్ర /రాష్ట్ర  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకొని, కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్న యువతీయువకులు లక్షలలో ఉంటే ఉద్యోగాలు వేలల్లో ఒకోసారి వందల్లో కుడా ఉన్నాయి.  కానీ వాటి నిర్వహణ ఖర్చులని మోసం చేస్తూ ఫీజుల రూపంలో  కోట్లాది రూపాయలు (సిగ్గులేకుండా, నిరుద్యోగులు అనే కనికరం లేకుండా) ప్రభుత్వం వసూలు చేస్తుంది.సగటున సంవత్సరానికి 20  నోటిఫ్కేషన్లు   (బ్యాంకులు,రైల్వే,గ్రూప్,ఇలా చాలా రకాలుగా ) ప్రకటించినా,ఒక్కో దానికి ఫీజు సుమారుగా రూ.600/- నుండి రూ.700/- దాక వుంటుంది. ఒక్కరే అన్నిటికీ అప్లై చేసేవారు లక్షల్లో వుంటారు.మొత్తం గా వీరికట్టే ఫీజుల నుంచే వీరికి జీతాలు ఇవ్వ వచ్చని కొంతమంది వాదన. ఏదిఏమైనా దీని రూపంలో ప్రభుత్వానికొచ్చే ఆదాయం ఎంత ,అయిన ఖర్చు ఎంత. దేవుడికి తెలియాలి
2. మెటీరియల్:
          పాపం నిరుద్యోగులకి ఈ ఖర్చే కాక అదనంగా ,కాంపిటీషన్ మెటీరియల్ పేరుతో  పుస్తకాల వారి దోపిడీ.ఓకేప్రశ్నని 40 ముక్కలుగా,తిప్పి,తిప్పి ముంద్రించి,  పేజీలు పెంచి, ఏది ‘వార్తో’  ఏది ‘కరెంట్ ఎఫైరో’ తెలీని ‘కన్ఫూషియన్’ లో నిరుద్యోగుల్ని వుంచి తద్వారా రేటుపెంచి , వారి దోపిడీ.
3. కోచింగ్ సెంటర్:
          ట్యూషన్  కి  కోచింగ్  తేడా తెలీదు . మామూలు క్లాసు పాఠానికి ,కాంపిటీటివ్  ప్రిపరషణ్ కి తేడా తెలీదు.టీచర్ అని ఎవర్ని అనాలి ఫ్యాకల్టీ అని ఎవర్ని అనాలో తెలీదు కానీ అందరు ఫ్యాకల్టీ లే. పుట్ట గొడుగుల్లా లెక్క లేనన్ని కోచింగ్ సెంటర్లు,కోచింగ్ సెంటర్ లో శిక్షణ కోసం వేలకి వేలు  ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది వున్నారు.
4. ఎక్జాం సెంటర్:
          ఇదోరకం దోపిడీ ,అందరికీ అనువుగా వీలయినంత దగ్గరగా సెంటర్ ఎలాట్ చేయటానికి వీలున్నా!? జిల్లాల సరిహద్దుల్లో, కొన్నిసార్లు అవిదాటి రాష్ర సరిహద్దుల్లొ ఎలాట్ చేస్తారు.కనీసం భోజనం టిఫెన్లు కుడా దొరకనంత మారుమూల కాలేజీలు వెతుకుతారు.(చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అంతేకదా .గవర్నమెంటు ఎలాట్ మెంటు ఉండబట్టి వీటిల్లో చేరతున్నారుగానీ . కోరి రోజు శ్రమ పడటానికి ఎవరికి తిక్క) అంత దూరం వెళ్లి ,రాసి రావటానికే వీళ్ళకు దేవుడు కనపడతాడు. సరియన టైముకి  రవాణా సదుపాయం లేక .ముందు రోజే వెళ్లి తెలీయని చోట బిక్షగాళ్ళ మాదిరిగా పార్కుల్లో ,బస్టాండ్ లో ,రైల్వే స్టేషన్లో ,నిద్ర,కాలకృత్యాలు తీర్చుకోవడానికి పడే ఇబ్బంది (ముఖ్యంగా ఆడవారు ) ప్రభుత్వానికి తెలుసా?. లేదా డబ్బు పడేసి లాడ్జీ లోనే హోటల్లో నో గది తీసుకోవాలి (ఆడవాళ్ళకి అలా అయినా మరోరకమైన వేధింపులు). వారితోపాటు చాలాసార్లు తోడుగా మరోవ్యక్తి వెళ్ళాలి .అదనంగా వీరి ఖర్చు ఆముదం
            వేలమంది నిరుద్యోగులను ఒక్కచోట చూస్తే భయం గొలుపుతుంది. ఉద్యోగాల కోసం వారు పడుతున్న ఆరాటం చూస్తే ఆందోళన కలుగుతుంది. వేలాది నిరుద్యోగ యువతీ యువకుల లో అసహనం స్పష్టంగా కనిపించింది. వయోపరి మితి పెంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య పెరిగింది. .. చదివిన చదువుకు .. రాసే ఉద్యోగానికి సంభంధం ఉండదు .వేల ఉద్యో గాలకు లక్షల మంది పట్టభద్రులు పోటీ పడితే నూటికి ఒక్కరినే ఉద్యో గం వరిస్తుంది. నూటికి తొంభైతొమ్మిది మంది నిరాశకు గురి అవుతున్నారు . అన్ని ఉద్యోగాలకూ అందరూ పోటీ గ్రూప్-1 నుంచి విఏవో ఉద్యోగం వరకూ నిరుద్యోగులందరూ పోటీ పడుతు న్నారు. ఇంజనీరింగ్ చదివినవారు ఇంజనీర్లుగానే  పనిచేయాలనీ, ఫార్మసీ చదువు కున్నవారు ఫార్మసిస్టులుగానే  పని చేయాలనీ కోరుకుంటే ఇంత పోటీ ఉండదు. ఇంజనీరింగ్, వెటర్నరీ విద్య చదివినవారు కూడా విఏవో ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. అస్తవ్యస్తమైన మన విద్యావిధానానికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితమైనది. కేవలం ఇచ్చేజీతం కోసం కాదు .ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చే  సౌకర్యాలు, పై సంపాదన , జాబు గ్యారంటీ ....హోదా.... ఇవన్నీ ఆకర్షణీయ అంశాలు.అందుకే ఇంత పోటీ
                 పాలక పక్షమో,ప్రతి పక్షమో ,కేంద్రమో రాష్ట్రమో. నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే  కనీసం ‘ఫీజు’ ఒక్కటి తీసేసినా కొంత వరకు భారం తగ్గించవచ్చు
               ఎగ్జాం నిర్వహించటానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రభుత్వమే భరిస్తే వారికి భ్రుతి కంటే’ మేలు చేసిన వారు అవుతారు. అది ప్రజా రంజకమైన పాలన . కానీ మూడు పూట్ల ‘బిర్యాని’కి డబ్బులు నిరుద్యోగుల వద్ద వసూలు చేసి .వారిమీద ఎంతో దయతో జాలితో, ఒక ‘అప్పడం’ విదిలించటమే నిరుద్యోగ బృతి అంటే
ప్రస్తావన ఇప్పుడు దేనికంటే:
         ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయిడు గారు  నిరుద్యోగభృతి’ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం గ్యారింటీ అని, లేకపోతే కనీసం ప్రతి నెల నిరుద్యోగ బృతి ఇస్తానని ప్రతి ఎలెక్షన్ మీటింగ్ లలో చెప్పారుదానికి జనసేన అదినేత  పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్ష సాక్షం. పైగా ఎలక్షన్ మ్యానిఫెస్టోలో సైతం పెట్టడం, హామీలన్నీ నేర్వేర్చతాం అని కోర్టుకు సైతం లిఖిత పూర్వకంగా తెలిపారు… …కనీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు . ఏలిన వారికి మనవి ఏంటంటే తాజాగా నిరుద్యోగ యువతకు హర్యాన  ప్రభుత్వం నెలకు రూ. 9వేలు  ప్రకటించింది. మీరూ అంత ఇవ్వగలరా?లేదా మరో కొత్త  ‘స్కాములోరిని’(స్కాం) తయారు చేస్తారా?

    గౌరవాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారు  మంచి పాలకులు అవుతారుప్రమాద సంకేతాలు గుర్తించకపోతే చాలా నష్టం జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులు సంఘటితమై వీధుల్లోకి వస్తే ఎంత బలమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నా ప్రయోజనం ఉండదు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card