రాష్ట్రంలో
ఉద్యోగ పరీక్షల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలతో ముందుకువెళుతున్నామని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని
రాష్ట్ర పబ్లిక్
సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ చెప్పటం
నిరుద్యోగపర్వంలో అది పెద్ద జోక్.నోటిఫికేషన్ ఎప్పుడిస్తారో తెలీదు,రిజల్టు
ఎప్పుడో తెలీదు,సిలబస్ అంతకన్నా తెలీదు,పోనీ ఈ గండాలు ఎలాగోలా దాటినా,నియామకాల
టైము వచ్చేటప్పటికి ఎవరో ఒకరు (బహుసా వీళ్ళు, బినామీ లేనేమో) కోర్టు కెల్లటం ,దీన్ని అటకేక్కియ్యటం.ఇదీ నియామకాల తీరు. భవిష్యత్
ఏమిటో తెలియక
వారు పడుతున్న ఆవేదన మనం చూస్తున్నదే
ఈ
దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో నిరుద్యోగం అనేది యువతను ఆకర్షించే
మంత్రం.ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్య కాదు.చదివిన చదువుకు, అవసరం
ఉండే ఉద్యోగాలకు సంభంధం ఉండదు. అసలు విద్యా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన జరగాల్సి ఉంది.
దోపిడీ విధానం:
1. నోటిఫికేషన్లు:
కేంద్ర
/రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
తరువాత అనేక నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకొని,
కోచింగ్ సెంటర్ల
చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్న యువతీయువకులు లక్షలలో ఉంటే ఉద్యోగాలు వేలల్లో ఒకోసారి
వందల్లో కుడా ఉన్నాయి. కానీ వాటి నిర్వహణ
ఖర్చులని మోసం చేస్తూ ఫీజుల రూపంలో
కోట్లాది రూపాయలు (సిగ్గులేకుండా, నిరుద్యోగులు అనే కనికరం లేకుండా)
ప్రభుత్వం వసూలు చేస్తుంది.సగటున సంవత్సరానికి 20
నోటిఫ్కేషన్లు (బ్యాంకులు,రైల్వే,గ్రూప్,ఇలా చాలా రకాలుగా )
ప్రకటించినా,ఒక్కో దానికి ఫీజు సుమారుగా రూ.600/- నుండి రూ.700/- దాక వుంటుంది.
ఒక్కరే అన్నిటికీ అప్లై చేసేవారు లక్షల్లో వుంటారు.మొత్తం గా వీరికట్టే ఫీజుల
నుంచే వీరికి జీతాలు ఇవ్వ వచ్చని కొంతమంది వాదన. ఏదిఏమైనా దీని రూపంలో
ప్రభుత్వానికొచ్చే ఆదాయం ఎంత ,అయిన ఖర్చు ఎంత. దేవుడికి తెలియాలి
2. మెటీరియల్:
పాపం
నిరుద్యోగులకి ఈ ఖర్చే కాక అదనంగా ,కాంపిటీషన్ మెటీరియల్ పేరుతో పుస్తకాల వారి దోపిడీ.ఓకేప్రశ్నని 40
ముక్కలుగా,తిప్పి,తిప్పి ముంద్రించి, పేజీలు
పెంచి, ఏది ‘వార్తో’ ఏది ‘కరెంట్ ఎఫైరో’
తెలీని ‘కన్ఫూషియన్’ లో నిరుద్యోగుల్ని వుంచి తద్వారా రేటుపెంచి , వారి దోపిడీ.
3. కోచింగ్ సెంటర్:
ట్యూషన్
కి కోచింగ్ తేడా తెలీదు . మామూలు క్లాసు పాఠానికి
,కాంపిటీటివ్ ప్రిపరషణ్ కి తేడా తెలీదు.టీచర్
అని ఎవర్ని అనాలి ఫ్యాకల్టీ అని ఎవర్ని అనాలో తెలీదు కానీ అందరు ఫ్యాకల్టీ లే. పుట్ట
గొడుగుల్లా లెక్క లేనన్ని కోచింగ్ సెంటర్లు,కోచింగ్ సెంటర్ లో శిక్షణ కోసం వేలకి వేలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది వున్నారు.
4. ఎక్జాం సెంటర్:
ఇదోరకం దోపిడీ ,అందరికీ అనువుగా
వీలయినంత దగ్గరగా సెంటర్ ఎలాట్ చేయటానికి వీలున్నా!? జిల్లాల సరిహద్దుల్లో, కొన్నిసార్లు
అవిదాటి రాష్ర సరిహద్దుల్లొ ఎలాట్ చేస్తారు.కనీసం భోజనం టిఫెన్లు కుడా దొరకనంత మారుమూల
కాలేజీలు వెతుకుతారు.(చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అంతేకదా .గవర్నమెంటు ఎలాట్ మెంటు
ఉండబట్టి వీటిల్లో చేరతున్నారుగానీ . కోరి రోజు శ్రమ పడటానికి ఎవరికి తిక్క) అంత
దూరం వెళ్లి ,రాసి రావటానికే వీళ్ళకు దేవుడు కనపడతాడు. సరియన టైముకి రవాణా సదుపాయం లేక .ముందు రోజే వెళ్లి తెలీయని
చోట బిక్షగాళ్ళ మాదిరిగా పార్కుల్లో ,బస్టాండ్ లో ,రైల్వే స్టేషన్లో ,నిద్ర,కాలకృత్యాలు
తీర్చుకోవడానికి పడే ఇబ్బంది (ముఖ్యంగా ఆడవారు ) ప్రభుత్వానికి తెలుసా?. లేదా
డబ్బు పడేసి లాడ్జీ లోనే హోటల్లో నో గది తీసుకోవాలి (ఆడవాళ్ళకి అలా అయినా మరోరకమైన
వేధింపులు). వారితోపాటు చాలాసార్లు తోడుగా మరోవ్యక్తి వెళ్ళాలి .అదనంగా వీరి ఖర్చు
ఆముదం
వేలమంది నిరుద్యోగులను ఒక్కచోట చూస్తే
భయం గొలుపుతుంది. ఉద్యోగాల కోసం వారు పడుతున్న ఆరాటం చూస్తే ఆందోళన కలుగుతుంది.
వేలాది నిరుద్యోగ యువతీ యువకుల లో అసహనం స్పష్టంగా కనిపించింది. వయోపరి
మితి పెంచడంతో ఉద్యోగార్థుల సంఖ్య పెరిగింది. .. చదివిన చదువుకు
.. రాసే
ఉద్యోగానికి సంభంధం ఉండదు .వేల ఉద్యో గాలకు లక్షల మంది పట్టభద్రులు పోటీ పడితే
నూటికి ఒక్కరినే
ఉద్యో గం వరిస్తుంది. నూటికి తొంభైతొమ్మిది మంది నిరాశకు గురి అవుతున్నారు . అన్ని
ఉద్యోగాలకూ అందరూ పోటీ గ్రూప్-1 నుంచి విఏవో ఉద్యోగం వరకూ
నిరుద్యోగులందరూ పోటీ పడుతు న్నారు. ఇంజనీరింగ్ చదివినవారు ఇంజనీర్లుగానే పనిచేయాలనీ, ఫార్మసీ చదువు కున్నవారు ఫార్మసిస్టులుగానే
పని చేయాలనీ కోరుకుంటే ఇంత పోటీ ఉండదు.
ఇంజనీరింగ్, వెటర్నరీ
విద్య చదివినవారు కూడా విఏవో ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. అస్తవ్యస్తమైన మన విద్యావిధానానికి
నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితమైనది. కేవలం ఇచ్చేజీతం కోసం కాదు .ప్రభుత్వ
ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు, పై
సంపాదన , జాబు గ్యారంటీ ....హోదా.... ఇవన్నీ ఆకర్షణీయ అంశాలు.అందుకే ఇంత పోటీ
పాలక పక్షమో,ప్రతి పక్షమో ,కేంద్రమో
రాష్ట్రమో. నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే
కనీసం ‘ఫీజు’ ఒక్కటి తీసేసినా కొంత వరకు భారం తగ్గించవచ్చు
ఎగ్జాం నిర్వహించటానికి ఎంత ఖర్చు అవుతుందో అది
ప్రభుత్వమే భరిస్తే వారికి భ్రుతి కంటే’ మేలు చేసిన వారు అవుతారు. అది ప్రజా
రంజకమైన పాలన . కానీ మూడు పూట్ల ‘బిర్యాని’కి డబ్బులు నిరుద్యోగుల వద్ద వసూలు చేసి
.వారిమీద ఎంతో దయతో జాలితో, ఒక ‘అప్పడం’ విదిలించటమే నిరుద్యోగ బృతి అంటే
ఈ ప్రస్తావన
ఇప్పుడు దేనికంటే:
ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు
నాయిడు గారు ‘నిరుద్యోగభృతి’ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం గ్యారింటీ అని, లేకపోతే
కనీసం ప్రతి నెల నిరుద్యోగ బృతి ఇస్తానని ప్రతి ఎలెక్షన్ మీటింగ్ లలో చెప్పారు… దానికి
జనసేన అదినేత పవన్ కళ్యాణ్,
ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్ష సాక్షం.
పైగా ఎలక్షన్ మ్యానిఫెస్టోలో సైతం పెట్టడం, హామీలన్నీ
నేర్వేర్చతాం … అని కోర్టుకు సైతం లిఖిత
పూర్వకంగా తెలిపారు… …కనీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు . ఏలిన వారికి మనవి ఏంటంటే తాజాగా నిరుద్యోగ యువతకు హర్యాన ప్రభుత్వం
నెలకు రూ. 9వేలు ప్రకటించింది.
మీరూ అంత ఇవ్వగలరా?లేదా మరో కొత్త ‘స్కాములోరిని’(స్కాం)
తయారు చేస్తారా?
… గౌరవాన్ని,
నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారు మంచి పాలకులు అవుతారు… ప్రమాద
సంకేతాలు గుర్తించకపోతే చాలా నష్టం జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులు
సంఘటితమై వీధుల్లోకి వస్తే ఎంత బలమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నా
ప్రయోజనం ఉండదు
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment