Friday, December 15, 2017

ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను


ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను
             యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. వాట్సాప్‌ మెసేజ్‌ టోన్‌.. వెంటనే ట్విటర్‌లో కూత.. మరుక్షణంలో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌.. ఇవి చాలవన్నట్టు స్కైపీలో కాల్‌.. సోషల్‌ మీడియా స్మార్ట్‌ అయ్యాక చాలామందికి ఇలా అష్టావధానం చేయక తప్పట్లేదు. కానీ మల్టిపుల్‌ సోషల్‌ మీడియా యాక్టివిటీ్‌సతో మల్టిపుల్‌ కష్టాలు తప్పేట్టు లేదు. లిప్తపాటులో సామాజిక మాధ్యమాలన్నీ చుట్టేయడం అలవాటైతే.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఖాయం
       GST,IT ఇతరా పని వత్తిడివల్ల ఈ మధ్య సోషల్ మీడియా కి కొద్దిగా దూరంగా ఉన్నా లంచ్ బ్రేక్ లో  అక్కడే ఉన్న నాక్లయింటు ,బాల్య స్నేహితుని ఫోన్లో వాట్సాప్ చూస్తూ “ఏరా వాట్సప్ చూడటానికి టైము వుండటం లేదా అని అడిగా” .అంతే ఇలా విసుక్కున్నాడు ‘‘ఎలా చావనురా? ఇదుగో చూడు; అక్షరాలా ఏడు వేల మెసేజీలున్నాయి;. మొత్తం మెమరీ అంతా మట్టిగొట్టుకుపోతున్నది; ఫోన్ స్లో; డిలిట్ చేస్తూ కూర్చోవటానికే టైమ్ లేదు, ఇక వాటిని చదివేంత ఓపిక, సమయం ఎక్కడుందిరా;? ఎవడో గ్రూపులో జాయిన్ చేస్తాడు, లెఫ్ట్ అని కొడదామని అనుకుంటే, అదీ అందులో కనిపించి దొబ్బేస్తుంది; వాడు ఫీలవుతాడు; వెంటనే ఫీలై ఫోన్ చేసి చెడామడా ఆడేసుకుంటాడు; ఎవడేమనుకుంటాడో ఏమో; ఈ ఫీలింగ్ తో అన్ని గ్రూపులూ భరిస్తున్నాను; పోనీ, ఈ అడ్డమైన స్మార్ట్ భీకర ఫోన్ వదిలించుకుందామంటే, మా ఆఫీసరు గ్రూపు, మా కొలీగ్స్ గ్రూపు, మా కులపోళ్ల గ్రూపు, మా అపార్ట్ మెంట్ గ్రూపు, మా మందు దోస్తుల గ్రూపు అన్నీ ఇందులోనే;. ఏంబే;? వాట్సప్ లో లేవా? తీసేస్తావా? అంటూ కస్సుమంటున్నారు; చివరకు ముఖ్యమైన సమాచారం ఏదో పెడతాడు, మా ఆఫీసర్; ఏదో తొక్కలో మెసేజీ, వేలల్లో అదొక్కటి అనుకుని ఊరుకుంటానా? ఫోన్ చేసి తిట్టేస్తున్నాడు; యూ నాన్సెన్స్ ఫెలో, సోషల్ గా ఉండటం తెలియదా? అంటున్నాడు; ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను         
         నాదో దరిద్రపు ఫోన్, డిలిట్ చేయాలంటే ఒక్కొక్కటీ సెలక్ట్ చేసి మరీ డిలిట్ కొట్టాల్సి వస్తున్నది;. మొన్న రాత్రి కూర్చున్నాను, పొద్దున్న నాలుగు గంటలకు గానీ తెమల్లేదు; తెల్లారి ఆఫీసు డుమ్మా;. కాస్త కాఫీ తాగి సేద తీరానో లేదో, మరో రెండొందల మెసేజీలు; జాతికి పట్టిన వైరసురా ఇది;? వీడియోలు, ఫోటోలు, నా ఖర్మరా నా ఖర్మ;. హాయిగా ఏ నోకియా పాత మోడల్ ఫోన్ కొనేస్తానూ అనుకుంటే, ఫోన్ నంబర్లన్నీ మెయిల్ తో లింకై ఉండిపోయాయి;
        ఇక ఇలా కాదని, మొన్న ఓ డాక్టరు దగ్గరికి పోయాను, కాస్త ఏదైనా నాలుగు టాబ్లెట్లు ఇస్తాడేమో, ఈ తలతిక్క వాట్సప్ బాధల నుంచి రిలీప్ కోసం అనుకున్నాను; వెళ్లాక ఏముంది? తనూ మెసేజీలు డిలిట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.సరే అని ఇక్కడ నువ్వూ ఇంతే ,ఇప్పుడు ప్రపంచం అందరికి రిలీఫ్ కావాలనుకొంటా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card