Saturday, December 23, 2017

అసలు మతం దేనికి అవసరం??





చాలా రోజుల తర్వాత తీరికగా net open చేశాను.  మతం గూర్చి ఏదో వ్రాద్దామని ఆలోచిస్తే ఏమీ తట్టలేదు.పైగా ఏమూలనుంచి ఎవడు నోరేసుకు పడతాడేమోనని భయం వలన దానికి mood set అవ్వటం లేదు. మళ్లీ నాకనిపించింది అవన్నీ వ్రాయడానికి కావలిసింది mood కాదు information అని తెగించి మొదలెట్టాను.
"
".
వేరు వేరు చోట్ల ఎదిగిన నాగరికతల్లో వేరు వేరు దేముళ్ళు.
ఒక రకం దేముడిని ఫాలో ఆయిన వాళ్ళందరిది ఒక మతం.
ఒక్కొక్క  తెలివైన వాడు ఒకో మతానికి నాయకుడు.  వాడిని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్ళు , వాడిని ఉపయోగించుకుని బ్రతికేవాళ్ళు  , వాడి చుట్టు పక్కల బ్రతికే వాళ్ళు, వాడి కనుసన్నలలో బ్రతికే వాళ్ళు , మళ్ళీ ఇందులో కులాల కలకలంతో,  రకరకాలతో ఒక సంఘం.
ఈ మతాలనించి , సంఘాల నించి - - ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్ధం ఇంకా ఇతర అవసరాలకి ఏర్పడ్డ ఒక సమాజం.
ఈ సమాజాల్ని, సంఘాల్ని మళ్ళీ మతం పేరుతొ వేరు చేసే ఒక అయోమయం.


అసలు మతం దేనికి అవసరం??
మనిషి ఆలోచనలని, అలవాట్లని ఒక క్రమ పద్ధతిలో ఉంచి, తన చుట్టు పక్కల ఉన్న ప్రపంచంతో ఒక understanding  ఉండేలా చేసి  - ఒక సుఖమైన జీవితాన్ని ఏర్పాటు చేసే ఒక విధానం. ఒక పద్ధతి. ఒక నమ్మకం. ఒక దృష్టి. ఒక ఆచరణ.
అందుకే అందరూ దాని వైపు అంతలా ఆకర్షించ బడతారు. మతం ఒక సంఘంలో ఇచ్చే comfort zone ఆంతా ఇంతా కాదు.
అది సరి ఆయిన వాళ్ల పర్యవేక్షణ లో అడుగులు వేస్తే శుభం.


లేకపోతే అది సృష్టించే భీభత్సం ఆలోచించడానికి ఊహ కూడా సరిపోదు. hydrogen bomb నీకు అర్ధం అయ్యే లోపే చంపేస్తుంది. ఈ మత మౌడ్యం  నిన్ను హింసించి చంపుతుంది.  నిన్ను బాధ పెట్టి చంపుతుంది. దీనికి ఫత్వాలు, గోధ్రాలు, 26 /11 లు , ఇవే proof .

చరిత్రలో అవలోకిస్తే apart from కీర్తి , కాంతా, కనకం, యుద్ధం చెయ్యడానికి ఈ మతం కూడా ఒక కారణం .
తెలివైన వాళ్ళు ప్రపంచాన్ని  గుప్పిట్లో పెట్టుకోవటానికి వాడే tools and tackles లో ఈ మతం ఒకటి.
కాకపొతే ఈ మత మార్పిడులు దేని కోసం జరుగుతున్నాయి.


నిజంగా ప్రజల సుఖం కోరే వారే అయితే మతాలు మార్చఖ్ఖరలేదు. Governance మారిస్తే చాలు. 


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Friday, December 15, 2017

ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను


ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను
             యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. వాట్సాప్‌ మెసేజ్‌ టోన్‌.. వెంటనే ట్విటర్‌లో కూత.. మరుక్షణంలో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌.. ఇవి చాలవన్నట్టు స్కైపీలో కాల్‌.. సోషల్‌ మీడియా స్మార్ట్‌ అయ్యాక చాలామందికి ఇలా అష్టావధానం చేయక తప్పట్లేదు. కానీ మల్టిపుల్‌ సోషల్‌ మీడియా యాక్టివిటీ్‌సతో మల్టిపుల్‌ కష్టాలు తప్పేట్టు లేదు. లిప్తపాటులో సామాజిక మాధ్యమాలన్నీ చుట్టేయడం అలవాటైతే.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఖాయం
       GST,IT ఇతరా పని వత్తిడివల్ల ఈ మధ్య సోషల్ మీడియా కి కొద్దిగా దూరంగా ఉన్నా లంచ్ బ్రేక్ లో  అక్కడే ఉన్న నాక్లయింటు ,బాల్య స్నేహితుని ఫోన్లో వాట్సాప్ చూస్తూ “ఏరా వాట్సప్ చూడటానికి టైము వుండటం లేదా అని అడిగా” .అంతే ఇలా విసుక్కున్నాడు ‘‘ఎలా చావనురా? ఇదుగో చూడు; అక్షరాలా ఏడు వేల మెసేజీలున్నాయి;. మొత్తం మెమరీ అంతా మట్టిగొట్టుకుపోతున్నది; ఫోన్ స్లో; డిలిట్ చేస్తూ కూర్చోవటానికే టైమ్ లేదు, ఇక వాటిని చదివేంత ఓపిక, సమయం ఎక్కడుందిరా;? ఎవడో గ్రూపులో జాయిన్ చేస్తాడు, లెఫ్ట్ అని కొడదామని అనుకుంటే, అదీ అందులో కనిపించి దొబ్బేస్తుంది; వాడు ఫీలవుతాడు; వెంటనే ఫీలై ఫోన్ చేసి చెడామడా ఆడేసుకుంటాడు; ఎవడేమనుకుంటాడో ఏమో; ఈ ఫీలింగ్ తో అన్ని గ్రూపులూ భరిస్తున్నాను; పోనీ, ఈ అడ్డమైన స్మార్ట్ భీకర ఫోన్ వదిలించుకుందామంటే, మా ఆఫీసరు గ్రూపు, మా కొలీగ్స్ గ్రూపు, మా కులపోళ్ల గ్రూపు, మా అపార్ట్ మెంట్ గ్రూపు, మా మందు దోస్తుల గ్రూపు అన్నీ ఇందులోనే;. ఏంబే;? వాట్సప్ లో లేవా? తీసేస్తావా? అంటూ కస్సుమంటున్నారు; చివరకు ముఖ్యమైన సమాచారం ఏదో పెడతాడు, మా ఆఫీసర్; ఏదో తొక్కలో మెసేజీ, వేలల్లో అదొక్కటి అనుకుని ఊరుకుంటానా? ఫోన్ చేసి తిట్టేస్తున్నాడు; యూ నాన్సెన్స్ ఫెలో, సోషల్ గా ఉండటం తెలియదా? అంటున్నాడు; ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను         
         నాదో దరిద్రపు ఫోన్, డిలిట్ చేయాలంటే ఒక్కొక్కటీ సెలక్ట్ చేసి మరీ డిలిట్ కొట్టాల్సి వస్తున్నది;. మొన్న రాత్రి కూర్చున్నాను, పొద్దున్న నాలుగు గంటలకు గానీ తెమల్లేదు; తెల్లారి ఆఫీసు డుమ్మా;. కాస్త కాఫీ తాగి సేద తీరానో లేదో, మరో రెండొందల మెసేజీలు; జాతికి పట్టిన వైరసురా ఇది;? వీడియోలు, ఫోటోలు, నా ఖర్మరా నా ఖర్మ;. హాయిగా ఏ నోకియా పాత మోడల్ ఫోన్ కొనేస్తానూ అనుకుంటే, ఫోన్ నంబర్లన్నీ మెయిల్ తో లింకై ఉండిపోయాయి;
        ఇక ఇలా కాదని, మొన్న ఓ డాక్టరు దగ్గరికి పోయాను, కాస్త ఏదైనా నాలుగు టాబ్లెట్లు ఇస్తాడేమో, ఈ తలతిక్క వాట్సప్ బాధల నుంచి రిలీప్ కోసం అనుకున్నాను; వెళ్లాక ఏముంది? తనూ మెసేజీలు డిలిట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.సరే అని ఇక్కడ నువ్వూ ఇంతే ,ఇప్పుడు ప్రపంచం అందరికి రిలీఫ్ కావాలనుకొంటా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


ఆర్ధికసంస్కరణలంటే?



ఆర్ధికసంస్కరణలంటే?BSNL/ MTNL/VSNLలకు ఉరిబిగించి,
విదేశీ +దేశంలోని వారిదళారీలకు టెలికాం రంగాన్ని
అప్పగించడమే!
అర్ధిక సంస్కరణలంటే! దేశంలోని టోకు ,చిల్లర వర్తకాలలోకీ
విదేశీ MNC లనూ,స్వదేశీ
కార్పొరేట్లకు అవకాశంకల్పించడమే!
ఆర్దిక సంస్కరణలంటే? LIC గొంతుకు తాడుబిగించి!
విదేశీ+ప్రయివేటు భీమా కంపెనీ లకు పట్టం!
ఆర్ధిక సంస్కరణలంటే సామాన్యుడి నడ్డివిరిచి
కార్పొరేట్లు కు దోచిపెట్టటమేనా?
 ఇవికాక ఆర్ధిక సంస్కరణలు అంటే
 ఇంకేమయినా వుంటే  వివరించగలరా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

మంచిని సమాధి చేస్తారా? ఇది మనుష్యులు చేసే పనియేనా?



అదేదో సినిమా పాట  లో మాదిరిగా మంచిని సమాధి చేస్తారా? ఇది మనుష్యులు చేసే పనియేనా? మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి?” అంటూ  రాజకీయ భక్తులు ప్రభుత్వాన్నీ వెనకేసుకొస్తున్నారు.
అంతే తప్ప..... అసలు అవినీతిమయమైన ప్రభుత్వాల పనితీరేమిటి? అధినేతల అవతారమేమిటి?’ అన్న ఊసే లేదు. బరి తెగించిన అవినీతి ఎంత నిస్సిగ్గుగా ఉందంటే..... ఏకధాటిగా ప్రభుత్వం  పన్నులు  పెంచుకుంటూ పోతుంటే, ఆ నెపంతో అన్ని వస్తువుల ధరలూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. సేవల ధరలు మరింత ప్రియమై కూర్చున్నాయి. మరో ప్రక్క..... ఫ్యూన్ ని కదిపితే కోటి రూపాయల ఆస్తులు బయట పడుతున్నాయి. చిన్న స్థాయి అధికారిని కదిపితే, బహుళ అంతస్థుల భవనాలు, వాటి పెంట్ హౌసుల్లో ‘బారు’ లూ కనబడుతున్నాయి. ఎప్పటికి భారతీయుల తామసం వదిలి రజో గుణం రగులుతుందో తెలియదు కానీ, ఆ లోపున మాత్రం జనాల నడ్డి విరగటం ఖాయం! ఇవి దేశ, రాష్ట్రాల పరంగా నడుస్తున్న వ్యవహారాలైతే, అంతర్జాతీయంగా నకిలీ కణిక వ్యవస్థకి నడ్డి విరిగే గడ్డు పరిణామాలు బాగానే ఏర్పడ్డాయి. కీలక ఏజంట్లు నిర్మూలింపబడ్డారు. బాబాల దగ్గర నుండి బిన్ లాడెన్ ల దాకా, చావు తప్పి కన్ను లొట్ట పోవటం గాక, లొట్ట పోయిన కళ్ళతో సహా చావు తప్పక పోవటం పరిశీలించ దగినవే!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card