Thursday, August 08, 2019

ఇదీ చుక్కల భూమి కథ



         చుక్కల భూములు.. కొద్దిరోజులుగా తరచూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో అసలు చుక్కల భూములు అంటే ఏమీటి?  తెలుసుకోవాలంటే బ్రిటీష్‌ పాలనా కాలం నుండి పరిశీలించాల్సిందే..
సాధారణంగా భూమిని దాని యాజమాని స్వభావం ఆధారంగా ప్రభుత్వ, పోరంబోకు, మాన్యం, ఈనాం భూమి తదితర పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో డాటెడ్‌ ల్యాండ్స్‌గా గురింపు పొందిన వాటిని తెలుగులో చుక్కల భూములు అంటారు. 1906 నుండి 1916 వరకు ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. కొన్ని ప్రాంతాల్లో భూమి ఉన్నా, అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నా వాటి యజమాని ఎవరో తెలియలేదు. దీంతో చట్టబద్ధంగా యజమాని అధీనంలో లేని భూములన్నింటికీ అప్పటి ప్రభుత్వం గుర్తుకోసం తన రికార్డుల్లో చుక్కలు పెట్టింది. అందువల్ల ఆయా భూములకు చుక్కల భూములు అనే పేరు వచ్చింది. నాటి నుండి ఈ భూములు అధిక శాతం ప్రభుత్వ అధినంలోనే ఉన్నాయి. కొన్ని భూముల్లో మాత్రం ప్రజలు సాగు చేపట్టడం, ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వారి అధీనంలోకి వెళ్లాయి. ప్రస్తుతం పలు వివాదాల నేపథ్యంలో, ఇతర కారణాల దృష్ట్యా భూములకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ మండలాల నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఇటీవలే తరలించారు. ఈ క్రమంలోనే చుక్కల భూముల లెక్కలూ తేల్చాలని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. అందులో భాగంగానే చుక్కల భూములను ప్రభుత్వం మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం.
                               ఇప్పటికే కొన్ని భూములు పలువురి అధీనంలో ఉన్నదృష్ట్యా అవి ఎవరి అధీనంలో ఉన్నాయో అందుకు తగిన ఆధారాలను అధికారులకు చూపాల్సి ఉంటుంది. ఇదుకుగాను 1916 నుండి చుక్కల భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో నిర్థారించేందుకు అధికారులు పూనుకున్నారు
                                     దీంతోపాటు ఈ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు, బదలాయింపులు, వంశపారంపర్యంగా సంక్రమించడం తదితర కారణాలతో చేతులు మారిన దృష్ట్యా గత 12 ఏళ్లలోనూ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో అందుకు సంబంధించిన ఆధారాలతోనూ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌, ఇసి, 10.1, భూమి సిస్తు రశీదులను ఫారం ఎఫ్‌-3తో జోడించి దరఖాస్తును అధికారులకు అందించాలి.
              అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియపై సంబంధిత భూములకు చెందిన రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయి. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు చుక్కల భూములనే పేరుతో గందరగోళంలో పడేశారని చెబుతున్నారు.

No comments:

Post a Comment

Address for Communication

Address card