Wednesday, August 07, 2019

“విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,-వివేకం నేర్పిన సరస్వతీ పుత్రుడివి”

“విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,-వివేకం నేర్పిన   సరస్వతీ పుత్రుడివి”



మేము నిడుబ్రోలు జెడ్ పి హెచ్ స్కూల్ లో చదివే  రోజుల్లో  బయట గోడ కి  నల్ల రంగు పూసిన బోర్డు వుండేది.దానిమీద ప్రతీరోజు ఒకరు ఆరోజు వారు చదివిన న్యూస్ పేపర్లోని  వారికి నచ్చిన ముఖ్య విషయాన్ని హెడ్డింగ్ లాగా రాయాలి  అనే నిభందన  (వారు ప్రవేశపెట్టిన దే )వుండేది. దానికోసం తప్పని సరిగా న్యూస్ పేపర్ చదివే వెళ్ళేవాళ్ళం. పత్రిక చదవటం  అలా అలవాటు అయ్యింది
ప్రతి ఒక్కరికీ సొంతంగా నేర్చుకునే తెలివి కొంత ఉంటుంది. విద్యార్థులు సొంతంగా నేర్చుకునే విధంగా ప్రతి విషయంపై వారికి అవగాహన కల్పించడమేగాక వారితో నిరంతరం చర్చించి అభ్యాసాన్ని సులువు చేసిన రూపశిల్పి
పత్రికలో ఏ వార్తలని ఎలా అర్ధం చేసుకోవాలి ,తప్పనిసరిగా ఎడిటోరియల్ ఎందుకు చదవాలో వివరించి చదివించిన మార్గదర్శి
తెలుగా? ఆంగ్లమా? అని భేదం లేదు.   విజ్ఞానమా? భూగోళమా? అని తేడా లేదు...
అన్నీ వారికి  కొట్టిన పిండి...
అలాంటి గురువు గారు
మన గురువు గారు, నిడుబ్రోలు జెడ్ పి హెచ్ స్కూల్ మాజీ హెచ్ఎం పాములపాటి అంకినీడు మాస్టర్ గారు  ది. 06.08.19 సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారని తెలియజేయుటకు చింతిస్తున్నాను.
“అడుగుతావా ఏమైనా ఆఖరిసారిగ నన్ను....,
ఏడవకు మరి ఎదురుగా చూడు...,
ముగిసింది బ్రతుకు వచ్చింది మృత్యువు...,
పోతోంది వెలుగు వస్తోంది చీకటి...,
సాగనంపు నన్ను చివరి క్షణం..”
.................  అన్నట్లుగా చెవుల్లో  మ్రోగుతోంది మీ గొంతు
మాస్టారు మీకు  అంతిమంగా మీకేమిఇవ్వగలం
“తస్మైశ్రీ గురవే నమః “   అనే ఒక నమస్కారం తప్ప
------------ధరణికోటసురేష్  కుమార్, ఆడిటర్    పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card