"చివరికి ఒక రోజు మీరు అతిథిగా రానే వచ్చారు,
వస్తూ వస్తూనే మనమందరం ముందు ముందుఎలా ఉంటాం అనే వార్త తెచ్చారు "
ఆ రోజు, జూలై 1, 2017, మొదటి ఉదయం -బాగా గుర్తు తెచ్చుకోండి
మీరు మొదటిసారి వచ్చినప్పుడు,
ప్రతిచోటా మీరే,జనం నోటా మీరే
టీవీ, రేడియో లేదా వార్తాపత్రిక ఏమైనా. మీరే మీరే
అన్ని ప్రభుత్వాలు మీ ఆతిథ్యంలో తరించాయి
మేము కూడా ఆతిథ్యంలో వాటిని అనుసరించాము
మీరు పరివర్తన క్రెడిట్ (Transitional credit) బహుమతులు ఇచ్చారు,
క్రొత్త దిశలు, కొత్త నియమాలు, కొత్త వ్యాపారం-,కొత్తకొత్తగా అంతా
అప్పుడే గుండె కొట్టు కోవటంలో కొత్త తేడా కూడా వచ్చింది ,
ఎవరెవరో వచ్చారు ఏదేదో వివరించారు, , విన్నంత విన్నాం,
తప్పుల్లేకుండా మీరు చేయలేరు అన్నారు నిజమే.ఇప్పటికీ అలాగే వున్నాం
మేమందరం R1, R2, 3B, ఫైల్స్ అంటూ ఆన్-లైన్ కి అతుక్కు పోయాం,
లేట్ ఫీ, ఇంటరెస్ట్ మరియు పెనాల్టీ అంటూ... మీ జేబులు నింపాము
ఎక్కడో విన్నాను, 10 వ విద్యార్థి కూడా దీన్ని చేయగలడు, అని
మీకు గుర్తుందా మేము CA / MBA/Bcom/ ఫైనాన్స్, అందుకేనేమో మావల్ల కావట్లేదు.
ఎంతో ఉత్సాహంగా, పోర్టల్‌లోకి ప్రవేశించాం .అంతే “జింతాక-జింతాక-జింతాక థ” కనపడింది.,
2 నిమిషాలు మాత్రమే పనిచేసి , ఆన్‌లైన్ కి , మా ఫేస్ కి మా ఎదురుచూపుల్తో లాక్ చేయబడింది
మీ సాఫ్ట్‌వేర్ మార్కెట్ వేడెక్కిన, వెంటనే
మాన్యువల్ ఎంట్రీలు, నగదు, నకిలీ అంటూ -అప్పుడే గందరగోళం మొదలయ్యింది
నియమాలు పై నియమాలను నిభందనలు మార్చారు – మాకు కొద్దిగా పిచ్చెక్కింది,
అకౌంటెంట్లు, న్యాయవాదులు మరియు సిఐలు తలోక వాట్సాప్ గ్రూపులకు ADD అయ్యాం. పూర్తి పిచ్చోళ్ళు అయ్యాం
మొదటి కానుకగా -PAPER-LESS GST లో PAPER కొంచెం తగ్గించబడింది
రామ రామా ! మాకు మాత్రం, A4 పేపర్ కట్టలు 2 రీమ్స్ పూర్తయ్యాయి.
ఆలస్య రుసుము తీసేసారు అని ఆనందించే లోపే,
RCM మరియు EWAY-BILL అంటూ రెండు CYCLON లు వచ్చాయి.
నోటిఫికేషన్ల తుఫానులు మన చుట్టూ ఎన్ని ఉన్నా
ఆకలి దాహం, లెక్కచేయకుండా శక్తి అంతా పోగుచేసి ధైర్యంగా పరిగెత్తాము .
లూప్-హోల్స్ వల్ల, అవకాశం ఉన్నవారంతా ప్రజల్ని దోచుకున్నారు.
మమ్మల్ని, మాత్రం బంధువులు, స్నేహితులు, అందరూ వదిలిపోయారు.
హోలీ, దీపావళి లాంటి అన్ని పండుగలు, ఇప్పుడు కల
GST HELPLINE మాత్రమే మాకు మిగిలింది –ఒకే ఒక ఆశ ...లా
ఇప్పుడు పనికే కాదు శెలవు కీ భయపడుతున్నాము
క్లయింటు కి, భయపడుతున్నాము- అధికార్లకి భయపడుతున్నాము
అంతర్జాలానికి భయపడుతున్నాము-అధీకృత సైటు కి భయపడుతున్నాము
భయం-భయం గా బతుకుతున్నాము - అందుకే రక్తం చెమట గా కారుస్తున్నాము
ఈ టైంలోనే కజిన్ వివాహానికిచ్చిన కార్డు గుర్తుకు వచ్చింది,
అంతలోనే అసిస్టెంట్ ఒక సమస్యతో వచ్చాడు,
చాలా గౌరవనీయమైన క్లయింటు ఫోన్‌లో ఉన్నారు,
వారి ఇన్‌వాయిస్లు 2-ఎలో తక్కువగా వున్నాయి,
ఫోన్ కత్తిరించి వేద్దమా? -నుదిటిపై దట్టంగా చెమట పట్టుకుంది,.
మెదడుని కూడా వజ్రం లా కత్తిరిస్తేనే మెరుస్తుందేమో
సెక్షన్ 42/43 - [ITC] -అంటూ, మీరు ఆనందాన్ని సగం లాక్కున్నారు
17 (5) –(Blocked Credits) అంటూ సమాజం మమ్మల్ని పూర్తిగా ‘బ్లాక్’ చేసింది
పరిస్థితి ఇప్పుడు షోలే సినిమా లో 'ఠాకూర్' లాగా ఉంది
ఏమీ చేయాల్సిన పని లేదు , వాటిని తట్టుకునే అలవాటు చేస్తే చాలు
అప్పుడప్పుడు ఆవేశంగా అనిపిస్తుంది, వెళ్లి కౌన్సిల్ని , కమిటీ ని నిలదీయాలని
పూర్తి సన్నాహాలు లేనప్పుడు, సెక్షన్ 49A {itc set -off ) ను ఎందుకు తీసుకురావాలి అని
తుఫాను ముందు కారుమేఘాల్లా వార్షిక రిటర్న్ – 9, 9A , 9C వచ్చాయి
మునుపటి గాయాలన్ని మళ్ళీ నెత్తురోడుతున్నాయ్.
ఎక్కడినుండి వచ్చాం,ఎక్కడికి వెళ్తున్నాం
హృదయం బరువెక్కింది , కళ్ళు తేమగా ఉన్నాయి
అకౌంటెంట్లు, న్యాయవాదులు మరియు సిఐలు చేతులు జోడించి ప్రార్దిస్తున్నాం,
జీఎస్టీ సులభం, చేయండి- సరళంగా చేయండి- సాధారణం చేయండి
“మేరా భారత్ మహాన్”
"జై హింద్, జై భారత్"
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
No comments:
Post a Comment