ఇకపై హాల్‌మార్కింగ్
తప్పనిసరి.
బంగారం
వ్యాపారం.. అది ఎంత తెలిసినా ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన బ్రహ్మ పదార్థం. బంగారం
స్వచ్ఛత కొలిచేందుకు పట్టణాల్లో ప్రతి గల్లీకీ మిషన్లు వచ్చాయి. మరి ఇక బంగారం
కొన్నా ఏదయినా ఆభరణం చేయించుకున్నప్పుడు మోసపోయే ఛాన్స్ ఎక్కడిది? మీలో ఈ భావన కనుక ఉన్నట్లయితే 'బంగారం' అమ్మకాలు కొనుగోళ్లలో మీరు ఇంకా ఇంకా మోసపోతూ
ఉండాల్సిందే..
Purity Grades
99.9 – 24 carat – పూర్తిస్వచ్చత
95.8 – 23 carat
91.6 – 22 carat
87.5 – 21 carat
75.0 – 18 carat
70.8 – 17 carat
58.5 – 14 carat
41.7 – 10 carat
37.5 – 9 carat
33.3 – 8 carat
ఈ నెల 12 నుంచి నగలపై హాల్ మార్క్ గుర్తు ఉండటం
తప్పనిసరి. 22,18,14 క్యారట్ల నగలు
మాత్రమే షాపుల వారు అమ్మకాలు జరపాలి. అంతేగాక నగలపై 22K916, 18K750 ఉదాహరణకు.. ఆభరణాలపై 22K916 సంఖ్య రాసి ఉంటే ఆ ఆభరణాల్లో 22 క్యారెట్లు అంటే 91.6 శాతం బంగారం ఉందని అర్థం. ఆభరణాలపై18K750 సంఖ్య ఉంటే 75 శాతం మాత్రమే బంగారం ఉందన్నంమాట. ఈ 18 క్యారట్ల బంగారాన్ని వజ్రాలు పొదిగిన ఆభరణాలకు
ఎక్కువగా ఉపయోగిస్తారు.. ఎందుకంటే వజ్రాల ఆభరణాలు కొనే చాలా మంది డైమండ్స్ ఎంత
క్వాలిటి ఉన్నాయో చూసుకుంటారు కానీ బంగారం మీద దృష్టి పెట్టరు. ఇదే నగల షాపుల వారికి
క్యాష్ పాయింట్. తర్వాత 18K శాతం ఉన్న బంగారం
దేనికి ఉపయోగిస్తారంటే షాపుల్లో స్టాక్ గా రకరకాల నగలు చేయించి డిస్ప్లే మీద
పెడతారు. అయితే 18K అంటే 75 శాతం ఉన్న నగలు అమ్మడం తప్పుకాదు.. కొనడం
మోసపోయినట్లు కాదు.. ఏ ఆభరణాలు కొన్నా వాటి శాతమేంతో తెలుసుకుని అంతే ధర
చెల్లించాలి.. తప్పనిసరి గా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు పై ఎంత శాతం ఉన్న నగ
కొన్నామో వ్రాయించుకోవాలి.
బంగారం కాయిన్లు, ఆభరణాల్లోని స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ వాటిపై
భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది. బీఐఎస్ లోగో,
ప్యూరిటీని సూచించే
క్యారట్ నంబర్ మరియు నిర్ధారించిన హాల్‌మార్క్ కేంద్రం, ఏ సంవత్సరం, బంగారం వర్తకుని గుర్తింపు మార్క్ ఉంటాయి..
అయితే ఈ హాల్ మార్క్ మనం కొన్న ఆభరణాలపై జీవితాంతం ఉంటుందని అనుకోవద్దు. నగలపై
ఉన్న హాల్ మార్క్ వాడకంలో పూర్తిగా చెరిగిపోతుంది. ఎందుకంటే నగలపై మిషన్లతో లేజర్
కిరణాల టెక్నాలజీతో వేస్తారు. ఆ లేజర్ కిరణాలు పైపైనే ఓ ప్రింట్ లా 22k
91.6 అని మనకు కనిపిస్తాయి.
కాబట్టి సాధ్యమైనంత వరకు నగపై హాల్ మార్క్ తో పాటు ఆ ఆభరణం తయారులో ఉన్నప్పుడే
స్వర్ణకారుడు '91.6' అని ఒక సీల్
వేస్తాడు.. అది గమనించి కొనుగోలు చేయడం గుర్తుంచుకోండి .
అయితే భారత్‌లో 3 లక్షల మంది జ్యూలరీ షాపుల వారు కానీయండి..
వ్యక్తులు కానీయండి అమ్మకాలు జరపడానికి లైసెన్స్ పొంది ఉంటే ఇందులో కేవలం 10 శాతం మందే బీఐఎస్ నుంచి లైసెన్సు
తీసుకున్నారని పేపర్లో చదివాను.
ఇంకో విషయమేమంటే ఎంత చిన్న నగలైనా, ఎంత పెద్ద ఆభరణాలైనా.. అతుకులలో జింక్ మాత్రమే
ఉపయోగించి తయారు చేయాలి. KDM తో, వేరే వేరే వాటితో చేయకూడదు. kdm అని నగపై ఉంటే కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. kdm
తో తయారుచేసిన నగలు
వాడితే స్కిన్ క్యాన్సర్ వస్తుందని చాలా దేశాల్లో kdm నగలపై నిషేధం ఉంది.
అన్నిటికన్నా ముఖ్యవిషయం ఏమంటే ఆభరణాలు
కొనుగోలు చేశాక GST నెంబర్ తో
ప్రింట్ అయిన ఖచ్చితమైన బిల్లు తీసుకోవటం ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఆ బిల్లు పై
ఎంత శాతం ఉన్న నగ కొన్నామో వివరాలు అన్ని వున్నాయో లేదో కూడా చూసుకోండి...
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment