income Dis-closer scheme అనగా
మనం ఇంతవరకు బహిర్గతం చేయని ఆస్తులు మరియు బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వానికి తెలియచేసి వాటికి చట్ట భద్దత కల్పించే అవకాశం .
ఇది ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు దాదాపు 10 సార్లు ప్రకటించారు.కానీ ఇంతకుముందు ప్రకటించిన వాటికి దీనికి తేడా వుంది.ఇంతకుముందు వచ్చిన అన్నీ G.O ల్లో కూడా voluntary declaration అన్నారు.కానీ ఈ G.O లో మాత్రం income declaration అన్నారు. ఆ వొక్క పదానికి scheme స్వరూపమే మారిపోయింది
ఇంతకుముందు వాటిల్లో మీరు ఇష్టపడి స్వచందంగా వెల్లడించారు.లేకపోతె లేదు.కానీ
ఈ సారి అలా కాదు తప్పనిసరిగా వెల్లడి చేయాల్సిందే.
మీకుతెలుసు ఇప్పుడంతా online trend.దాదాపు 32 మార్గాలు ద్వారా వారూ మన ఆర్ధిక లావాదేవీలు గమనించిన తర్వాత అనుమానస్పద లావాదేవీల వివరాలని తెలియ చేయమని మనకి నోటీస్ ఇవ్వవచ్చు .అప్పుడు మనం తప్పనిసరిగా వారు సంతృప్తి పడే లాగ అన్ని వివరాలని డాక్యుమెంట్లు రూపంలో ఇవ్వాలి.
అసలు చిక్కంతా ఇక్కడనుంచే మొదలవున్తుంది.ఈ స్కీములో వారు ముందా మనం ముందా అనేది ప్రధానమయిన పాయింట్. మనమే వారు అడగకుండానే తెలియచేస్తే వకరకమయిన టాక్స్ కట్టాలి.(సుమారు 45% టాక్స్ కాస్త ఎక్కువయినా,చాలా ఉపయోగాలున్నాయి.మీకు ఆ డబ్బు ఎక్కడనుంచి,వచ్చింది,దాన్నిఎలా మార్చారు,దానికి ముందు తర్వాత ఆదాయం ,పెట్టుబడి,మదుపు లాంటి వివరాలన్నిఏ స్తాయి అధికారి గాని,మరేఇతర డిపార్ట్మెంట్ అధికారి గాని అస్సలు అడగరు.మిగిలిన వాటిగూర్చి తర్వాత మాట్లాడుకుందాం.).
వారు అడిగిన తర్వాత మీరు తెలియచేస్తే ఎంత కట్టాలో వారు నిర్ణయిస్తారు
( మీకు ఆ డబ్బు ఎక్కడనుంచి,వచ్చింది,దాన్నిఎలా మార్చారు,దానికి ముందు తర్వాత ఆదాయం ,పెట్టుబడి,మదుపు లాంటి వివరాలన్ని తప్పనిసరిగా టాక్స్ ని ప్రభావితం చేస్తాయి దీనికి అదనంగా జయిలుశిక్షలు,పెనాల్టిలు వున్నాయి)
అయితే మీఅంతట మీరు ఎప్పడో తీరిక చేసుకుని, వాళ్ళని వీళ్ళని అడిగి నిదానంగా చేద్దాం అంటే కుదరదు.అప్పటిదాకా వారుచూస్తూ ఊరుకోరు వారిపని వారు చేస్తుంటారు.ఇప్పటికే చాలామందికి నోటీస్లు వచ్చాయి.దీనికిమనకి ఉన్న గడువు ఆఖరి తేది 31.09.2016. వకవేళ మీకు ఇప్పటికే నోటీస్ వచివుంటే.అది IDS కిందా లేదా మమూలుగ ITO గారినుంచా తెలుసుకోవాలంటే,ఆ నోటీస్ వెనుక వైపు క్రింద త్రిభుజాకారంలో IDS సింబల్ వుంటుంది చూసుకోవచ్చు.
No comments:
Post a Comment