Sunday, December 19, 2021

రామకుమారీ” నిర్గమనం

 


మేము మీ చిత్రాన్ని ఇసుకలో వ్రాసాము,
కానీ..... నీటి తరంగాలు దానిని తుడిచి వేసాయి.
మేము మీ చిత్రాన్ని ఆకాశంలో వ్రాసాము,
కానీ ....గాలి దాన్ని దూరం చేసింది.
ఈసారి....

 మేము మీ చిత్రాన్ని మా హృదయంలో వ్రాసాము,
ఇక .....అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది.

.......................................................ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,

                                 మరియు మీ స్మృతి మానసులు

Friday, December 17, 2021

 

దేవుడు తన తోట చుట్టూ చూశాడు
ఒక ఖాళీ స్థలాన్ని కనుగొన్నాడు.
దేవుని తోట అందంగా ఉండాలి
తను ఎప్పుడూ ఉత్తమమైనవే తీసుకుంటాడు.
                      *****
అప్పుడు ఈ భూమిని చూసాడు,
అలసిన మీ ముఖాన్ని చూసాడు
మిమ్మల్ని తన వద్ద విశ్రాంతి తీసుకోమని చెప్పాడు
తన చేతులు మీ చుట్టూ ఉంచాడు
                     *****
స్వర్గంలో గులాబీలు పెరిగితే,
దయచేసి నా కోసం కొన్ని వుంచండి,
వాటిని నా తల్లి చేతుల్లో ఉంచండి
ఆమెను గుర్తుపట్టటం చాలా సులభం,
                    *****
అంతులేని కష్టాలతో
ఇక్కడ సంచరించింది
ఉల్లాసమైన చిరునవ్వుతో
ఆమె ఈ భూమిని వదిలింది
                 *****
ఆమె చిరునవ్వుతో ఉన్నప్పుడు
మీరు నా నుండి వచ్చారని చెప్పండి
నేను ఆమెను ప్రేమిస్తున్నాను అనీ
ఆమెను కోల్పోయానని అని చెప్పండి.
                 *****
నా హృదయంలో నొప్పి ఉంది
ఈ నొప్పి ఎప్పుడైనా ముగుస్తుందా?
ఎంతసేపు వేచి ఉండాలి,
మేము స్వర్గంలో కలిసే వరకు, నా?
............................................. ధరణికోట సురేష్ కుమార్


Saturday, December 11, 2021






 

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా!

రాగబంధం విలువు నీకు తెలియదా!!

 

గతం గుర్తులు గగనానికే వదిలేసి
తన గమ్యాన్ని వెతుక్కుంటూ
వెలుతురులు విరజిమ్ముతూ
వేగంగా వడివడిగా వెళ్ళనేవెళ్ళింది

 

 జననం.... ... మరణం-ఈ మధ్యలో నీ జీవనం ....

ఎర్రగా పరుచుకున్న-పుడమి నుదుట సింధూరం
వేకువ వెలుతురు-వెండి మబ్బుల నాట్యం
కదులుతున్న ఆకాశం-కమ్మని కూని రాగం


పడమటి చరిత్ర గాయాలు-ఆక్రోశగానాలు

కదిలే కాలం తలపై అగ్గికుంపటి లా-పక్కనే వున్నాయి..
అయినా చెదరని చిరు నవ్వు
ఎక్కడిది ధైర్యం-ఎక్కడిది త్యాగం


రగులుతూ, కరుగుతూ
పరుగులు తీస్తూ
పడమటి సంధ్య వైపు
నీ జననంనీ మరణం

తనొక మరణం లేని శక్తి

తానెప్పుడూ ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది

 ఇక్కడ చనిపోయింది ఎవరు - బ్రతికి ఉన్నది ఎవరు?

 


 

Wednesday, February 26, 2020

మనిషి ఏదో నల్లబిలంలో తప్పిపోయాడు. మీకెక్కడైనా కనబడ్డాడా?


మనిషి ఏదో నల్లబిలంలో తప్పిపోయాడు. మీకెక్కడైనా కనబడ్డాడా?
                                                     ఆకలిరాజ్యం! ఈ సినిమా నా టీనేజీలో రిలీజైంది. అప్పటి నా నేపధ్యం కూడా చెప్పాలి ఆ సినిమా నా మీద చూపించిన ప్రభావాన్ని వివరించాలంటే. అప్పటికి యూత్ ఐకాన్ గా వున్న కమల్ హాసన్ అంటే ఆరాధన. చలాన్ని చదివి వున్నాను. మ్యూజింగ్స్, మైదానం, బ్రాహ్మణీకం వంటి నవలలు చదివి ఏదో లోకంలో ఉన్నట్లుండేవాణ్ని. చలం అంటే పెద్ద క్రేజ్.
                                        జీవితం ఎంత అశాంతికరంగా ఉండేదో అంత ఆసక్తిగానూ కనిపించేది. రోడ్ల మీదకొస్తే గోడల మీద "విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది" "మీ దోపిడి కొట్టాలకు నిప్పులంటుకున్నాయి. మా ఊపిరితిత్తులతో ఊదిఊది మండిస్తాం" వంటి నినాదాలు కనిపించేవి. ఆర్.ఎస్.యు., పి.డి.ఎస్.యు. వంటి పేర్లు కనిపించేవి కింద. మాదాల రంగారావు వంటి వారు "ఎర్రమల్లెలు". "యువతరం కదిలింది", "విప్లవశంఖం" వంటి ఉద్రేకపూర్వక సందేశాత్మక సినిమాలు తీసేవారు. ఆ సమయానికి శ్రీశ్రీ అంటే గొప్ప సినిమా పాటల రచయిత, మహాప్రస్థానం అనే గొప్ప పుస్తకమేదో రాసాడని తెలుసు. ఆయన రాసిన "ఎవరివో నీవెవరివో", "బొమ్మని చేసి ప్రాణము పోసి" వంటి గొప్ప పాటలు అనేకం విన్నాను. కానీ ఆయన కవిత్వం పెద్దగా తెలియదు.
                                       సరిగ్గా ఆ సమయంలోనే ఆకలి రాజ్యం సినిమా వచ్చింది. కమల్, శ్రీదేవి అంటే ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమా చూసాను. అయితే ఆ సినిమాలో నాకు కమల్ కన్నా, శ్రీదేవి కన్నా శ్రీశ్రీ అన్న పేరే అత్యంత ఎక్కువగా ఆకర్షించింది. అంతకు మునుపు శ్రీశ్రీ కవిత్వ కోట్స్ చదవక పోలేదు. కానీ ఆ సినిమాలో హీరో పాత్ర ద్వారా శ్రీశ్రీ బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో కమల్ నోట "పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్" అన్న కవిత వినగానే చెప్పలేని ఉద్వేగం నన్నావరించింది. ఎక్కడో నన్నే అడ్రెస్ చేసినట్లనిపించింది. నా బోటి ఒక మనిషి తన ఆత్మఘోషని చెబుతున్నట్లనిపించింది శ్రీశ్రీ కవిత్వం వింటూంటే.                           
                                                           ఆ మరుసటి రోజే మహాప్రస్థానం కొని చదివాను. అదేం కవిత్వమండి? అదసలు కవిత్వమా? దగాపడ్డ మనుషుల ఆత్మఘోషా? అది భాషా లేక ఉద్విగ్న అగ్ని ప్రవాహమా? కోటానుకోట్ల మంది మాట్లాడుతున్న శబ్దమది. (అఫ్ కోర్స్ ఇంత క్లారిటీ అప్పుడు లేదనుకోండి). శ్రీశ్రీ పూర్తిగా అర్ధం కాకపోయినా ఫిదా అయిపోయాను.
                                                     ఆ సినిమా మళ్ళీ చూసాను. మళ్ళీ మళ్ళీ చూసాను. నచ్చటం అనేది చాలా చిన్న మాట. అదేదో పెనవేసుకుపోయాను. అదేదో అశాంతి. అప్పటివరకు నేను చూసిన జీవితం మీద గత రెండు మూడు సంవత్సరాల నుండి ఏవగింపు. స్థిమితంగా వుండలేనితనం. ఏదో చిరాకు. అది నా అస్తిత్వానికి సంబంధించిన అశాంతి అన్న ఎరుక లేని పరిస్థితి విపరీతమైన మూడ్ స్వింగ్ వుండేది.
                        శ్రీశ్రీ కవిత్వం నాలో అశాంతిని పెంచింది, శాంతిని కూడా కల్పించింది. అందులో హీరో తనకి సమస్య వచ్చిన ప్రతిసారి, ఘర్షణ ఏర్పడిన ప్రతిసారి శ్రీశ్రీ కవిత్వాన్ని మననం చేసుకుంటాడు. జీవితాన్ని అర్ధం చేసుకోవటంలో, నిలదొక్కుకోవటంలో కళలు, కవిత్వం ఎటువంటి పాత్ర పోషిస్తాయో ఆ సినిమా చెబుతుంది.                    
                                 అందులో మనం ఐడెంటిఫై అయ్యే ఎన్నో సన్నివేశాలున్నాయి. రోడ్డు ప్రమాదంలో మూగ కళాకారుడు మరణించినప్పుడు "కూటి కోసం కూలి కోసం" అన్న పాట వస్తుంది. శ్రీదేవి కమల్ ని వెతుకుతున్నప్పుడు "ఓ మహాత్మా! ఓ మహర్షి" అన్న పాట వస్తుంది. భార్య చేత వ్యభిచారం చేయించే వాడిని చూసి కమల్ "పతితులారా భ్రష్టులారా" అన్నప్పుడు ఎక్కడో తాకుతుంది. శ్రీదేవిని తండ్రి ఎక్స్ప్లాయిట్ చేసిన తీరు కదిలిస్తుంది. ఆ పాత్రధారి కృష్ణారావు (గొప్ప మరాఠీ నాటక కళాకారుడు) అద్భుతంగా చేసారా పాత్రని. అన్నీ కష్టాలే, ఘర్షణలే ఆ సినిమాలో! కానీ ఎక్కడో ఓ భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. అందుకే కదలకుండా చూసాం. అన్ని సార్లు చూడగలిగాం.
                       ఇప్పుడేది ఆ ఘర్షణ? అంతా పలాయనవాదమే! స్పందించే సున్నితత్వమే చచ్చిపోయింది. మనిషి లొంగిపోయాడు. దుర్మార్గాలకి సాష్ఠాంగ పడ్డాడు. పడగ్గదుల్లోకి దూసుకొచ్చిన ఇంపీరియలిజానికి బానిసయ్యాడు. దేహాన్ని వినిమయవాదానికి దాసోహం చేసాడు. మనసుని వస్తుజాలానికి అంకితమిచ్చాడు. మనిషి లేడండీ! మనిషి ఏదో నల్లబిలంలో తప్పిపోయాడు. మీకెక్కడైనా కనబడ్డాడా?

Thursday, February 20, 2020

ఇండియా లో పన్నుల పరిస్తితి ఇలావున్నాయి


ఇండియా లో పన్నుల పరిస్తితి  ఇలావున్నాయి

1) మీరు ఏమి చేస్తున్నారు?
 INDIAN. : వ్యాపారము
ప్రభుత్వం: ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించండి!
 
2) వ్యాపారము లో మీరు ఏమి చేస్తున్నారు?
INDIAN. : వస్తువుల అమ్మకం.
 ప్రభుత్వం: అమ్మకపు పన్నుచెల్లించండి
 
3) మీరు ఎక్కడ నుండి వస్తువులను పొందుతారు?
INDIAN. : ఇతర ప్రాంతం / రాష్ట్రం / విదేశాల నుండి.
ప్రభుత్వం: సెంట్రల్ సేల్స్ టాక్స్, కస్టమ్ డ్యూటీ & ఆక్టోరోయి మరియు ఇప్పుడు ఎల్బిటి & ఎల్పిటి చెల్లించండి!
 
4) వస్తువుల అమ్మకంలో మీరు ఏమి పొందుతున్నారు?
INDIAN. : లాభము
 ప్రభుత్వం: ఆదాయపు పన్ను చెల్లించండి!
 
మీరు లాభాన్ని ఎలా పంపిణీ చేస్తారు?
INDIAN. : డివిడెండ్ ద్వారా:
 డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ చెల్లించండి!
5) వస్తువుల తయారీ ఎక్కడ?
INDIAN. : ఫ్యాక్టరీ లో
ప్రభుత్వం: ఎక్సైజ్ డ్యూటీ చెల్లించండి!
 
6) మీకు ఆఫీస్ / గిడ్డంగి / ఫ్యాక్టరీ ఉందా?
 INDIAN. : అవును
ప్రభుత్వం: మునిసిపాల్ & ఫైర్ టాక్స్ చెల్లించండి!
 
7) మీకు సిబ్బంది ఉన్నారా?
 INDIAN. : అవును
ప్రభుత్వం: పే స్టాఫ్స్ ప్రొఫెషనల్ టాక్స్!
8) ఎక్కువ టర్నోవర్ తో వ్యాపారం చేస్తున్నారా?
 
INDIAN. : అవును
 ప్రభుత్వం: టర్నోవర్ పన్ను చెల్లించండి!
 
INDIAN. : అంత టర్నోవర్ లేదా:అప్పుడు MINIMUM ALTERNATE TAX (MAT) చెల్లించండి
 
9) మీరు బ్యాంక్ నుండి 25,000 నగదును తీసుకుంటున్నారా?
 INDIAN. : అవును, జీతం ,ఇన్కా పన్నుల కోసం:
 అయితే పే క్యాష్ హ్యాండ్లింగ్ టాక్స్! 
10) మీ క్లయింట్‌ను ఎక్కడ ఉంచుతారు?
INDIAN. : హోటల్ లొ
 ప్రభుత్వం: లక్సరీ టాక్స్ చెల్లించండి!
 
11) వ్యాపారం కోసం వూరు బయటికి వెళ్తున్నారా?
INDIAN. : అవును
ప్రభుత్వం: ఫ్రింజ్ బెనిఫిట్ టాక్సు చెల్లించండి!
 
12) మీరు ఏదైనా సేవ / సేవలను తీసుకున్నారా?
 INDIAN. : అవును
 ప్రభుత్వం: సేవా పన్ను చెల్లించండి!
 
13) మీకు ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చింది?
INDIAN. : పుట్టినరోజున బహుమతులు
ప్రభుత్వం: గిఫ్ట్ టాక్స్ చెల్లించండి!
 
14) మీకు ఏదైనా సంపద ఉందా?
 INDIAN. : అవును
ప్రభుత్వం: సంపద పన్నుచెల్లించండి!
 
15) వత్తిడిని తగ్గించడానికి, వినోదం కోసం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
INDIAN. : సినిమా లేదా రిసార్ట్
టాక్స్: ఎంటర్టైన్మెంట్ టాక్స్ చెల్లించండి!
 
16) మీరు ఇల్లు కొన్నారా?
INDIAN. : అవును
ప్రభుత్వం: స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి!
 
17) మీరు ఎలా ట్రావెల్ చేస్తారు?
 INDIAN: రైలు బస్సు ,విమానం
ప్రభుత్వం: సర్చార్జ్ చెల్లించండి!
 
18) ఏదైనా అదనపు పన్నులు కడతారా?
 INDIAN. : లేదు
 ప్రభుత్వం: అయితే సెంట్రల్ పన్నుల్లో విద్య సెస్, సెకండరీ & హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ & సర్చార్. పన్నులు చెల్లించండి !!!
9) ఏదైనా పన్ను చెల్లించడం ఎప్పుడైనా ఆలస్యం అవుతుందా?
 INDIAN. : అవును
ప్రభుత్వం: వడ్డీ & పెనాల్టీ చెల్లించండి!
 
20) మీకు భారతదేశం వృద్ధి కావాలా.?
INDIAN. : వాస్తవానికి అంతేగా
 ప్రభుత్వం: అప్పుడు, వాటర్ టాక్స్, రోడ్ టాక్స్, స్వాచ్ భారత్ సెస్, ఇటిసి. మొదలైనవి చెల్లించండి
INDIAN: నేను ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాను?
ప్రవభుత్వం. : కొన్ని రోజులు ఆగండి,మేము ఫ్యూనరల్ టాక్స్ ప్రారంభించబోతున్నాం!

Address for Communication

Address card