Thursday, February 20, 2020

జ్నాపకాలకి మరణం లేదు


చివరి మజలి ఇంత కఠినమా----


ఇంత విషాదపు స్పర్శ ,మునుపెన్నడూ హృదయాన్ని స్పృశించలేదే
కళ్ళల్లో ఇంత దురావస్థ ,చూపుల్లో ఇంత అచేతనం, ఎన్నడూ దరిచేరలేదే!!
చివరి మజలి ఇంత కఠినమా----
కరుణా రాహిత్యమై ,కన్నీరు మున్నీరు రోదనై ,బతికున్నదేహాల విలవిల ,సృష్టికర్తకి అర్ధం కాలేదా?
కీర్తి మూటగట్టుకొని వట్టి స్పర్శలూ ,అనుభవాలూ ,మిగిల్చి ,ఏ స్వర్గ లోకాలలోకి వెళ్ళిపోయారు?
చివరి మజలి ఇంత కఠినమా----

మంచివాళ్ళకి ఇక్కడ చోటులేదని మరణం రాసావా దేవుడా !
మంచిమనసున్న మనిషికి నీదగ్గర కరువు వచ్చినాదని ఎత్తుకుపోయావా దొంగోడా!
చివరి మజలి ఇంత కఠినమా----
----
నిశ్చల భయాల నిర్వికార స్వప్నమై స్వరతంత్రులు తేలికైపోతే...
నిర్జీవం జీవమై ,నాన్న ఎప్పటికి సజీవమై
కళ్లు తెరచి అదే చిరునవ్వుతో -----!
చివరి మజలి ఇంత కఠినమా----

............ ఇటీవలే స్వర్గస్తులైన నాన్న గారు,
కీర్తిశేషులు.....శ్రీ .ధరణికోట సాంబశివరావు  గారికి నిశ్శబ్ద భాష్ప మౌక్తికంబు---
....ధరణికోట సురేష్ కుమార్ ఆడిటర్ పొన్నూరు

No comments:

Post a Comment

Address for Communication

Address card