“జిందగి కా ఎక్ ఔ ర్
సాల్ పురా హువా
కిత్ని హాయ్ ఖుషియోన్ ఔ ర్ గమ్ సాత్ హువా
పార్ కిస్మత్ వాలా నిక్లా మెయిన్
జో కుచ్ పురాణే చెహ్రే సాథ్ రహే
తో కుచ్ నయే కా భీ దీదార్ హువా
కిసి కో హసయ తో కిసి కో రులయ
తో కబీ మెయిన్ ఇన్సె రుబారు హువా
జిందగి కా ఎక్ ఔ ర్ సాల్ పురా హువా.....”.
కిత్ని హాయ్ ఖుషియోన్ ఔ ర్ గమ్ సాత్ హువా
పార్ కిస్మత్ వాలా నిక్లా మెయిన్
జో కుచ్ పురాణే చెహ్రే సాథ్ రహే
తో కుచ్ నయే కా భీ దీదార్ హువా
కిసి కో హసయ తో కిసి కో రులయ
తో కబీ మెయిన్ ఇన్సె రుబారు హువా
జిందగి కా ఎక్ ఔ ర్ సాల్ పురా హువా.....”.
..(మాజీ ప్రధాన మంత్రి,శ్రీ
అటల్ బిహారీ వాజపేయి గారి కవిత లో కొంత భాగం..మీ కోసం..)
2019సం.లో
భారతదేశం, ప్రపంచం
ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రతీ
సంవత్సరంలాగే ఈసారి కూడా అనేక ఆశలతో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. అలాగే ప్రతీ
సంవత్సరంలాగే ఈసంవత్సరంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి
రావచ్చును.
ఈ ప్రపంచాన్ని
సుఖమయం చేయడానికి
అనేక అద్బుతాలు సృష్టించే మనిషే ఈ ప్రపంచానికి ఊహించని సమస్యలు, కష్టాలు కూడా తెచ్చిపెడుతుంటాడు.
చివరికి ప్రకృతి విపత్తులకి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనిషే కారణమవడం విస్మయం
కలిగిస్తుంది.
వాతావరణ
కాలుష్యం సరిపోదన్నట్లు రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. మన దేశంలో
అయితే ఆ కాలుష్యం ఇంకా ఎక్కువగా ఉన్నట్లుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలలో కూడా ఈ రాజకీయ
కాలుష్యం పెరిగిపోవడంతో సకల అవలక్షణాలను సంతరించుకొన్నాయి. ఆ కారణంగా అభివృద్ధి
కేవలం హామీలకి, కాగితాలకే పరిమితమయిపోయింది.
ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు సర్వరాజభోగాలు అనుభవిస్తుంటే, వారికి ఆ అవకాశం కల్పించిన సామాన్య
ప్రజలు జీవితాంతం త్యాగాలు చేయవలసి వస్తూనే ఉంది. ఈ పరిస్థితులలో మార్పు
కలుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.
కనుక చిన్న
చిన్న సంతోషాలని విస్మరించకుండా వాటినే లెక్కబెట్టుకొంటూ ఈ సంవత్సరాన్ని కూడా
ఉన్నంతలో ఆనందంగా లాగించేయాలి.
.. మీకు అద్భుతమైన
అనుభూతిని మరియు అనందాన్ని అందిస్తూనే ఉండటానికి మేము కూడా ఇంకా వినూత్నంగా
శ్రమిస్తూనే ఉంటాము. మీ పూర్తి మద్దతు మాకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాము.
మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.... నూతన సంవత్సర శుభాకాంక్షలు
...ధరణికోట సురేష్ కుమార్ ,ఆడిటర్
,పొన్నూరు
No comments:
Post a Comment