"నేను నీ కోసం చావగలను. కానీ, నేను నీ కోసం బ్రతకను.
బ్రతకలేను."~ వైనాండ్ తో రోర్క్- ఫౌంటెన్ హెడ్ నుండి..
Charles Dickens , Milton
, Jane Austen ,Mills & Boon,
Jeffrey Archer, Sir Arthur Conan Doyle (Sherlock Holmes రచయత) రాజ్యం చేస్తున్న కాలంలోఇంగిలీషు పుస్తకాలు సరదా కోసమే చదివేవాళ్ళము.
కాలక్షేపం బఠాణీల్లాగా. ఎందుకంటే అందులోభావోద్వేగాలు అర్ధమయ్యేవికావు. (ఇంగ్లిషు పూర్తిగా
రాక ,ఇది నా అభిప్రాయం మాత్రమే).
కాలక్షేపం పుస్తకాలు కాక ఇంకొంచం
అలోచింపచేసే దశగా ఉన్న పుస్తకాలు చూసే నేనెరగని ప్రపంచం అది.అలాంటి రొజుల్లొ (దాదాపు పాతికేళ్ళ క్రిందట ).ఇంగిలీషు లొ The Fountainhead చదవాను
రాండ్
పుస్తకాలు ఆవిడ అలోచనా తీరు నాకు పరిచయమైందాకా నా చుట్టూ ఉన్నవి అర్ధం పర్ధం లేని
పోచికోలు కబుర్లే. నాకు అప్పట్లో విపరీతంగా నచ్చింది కనుక అందరికీ నచ్చాలని రూలేమి
లేదు. ఎందుకూ? ఏమిటీ
ఆవిడ గొప్ప? అంటే నా దగ్గర జవాబూ లేదు. ఎపుడైనా ఎవరైనా యండమూరి
, శ్రీ శ్రీ గురుంచి
ఆవేశపడితే కుతూహలంగా చూడటం తప్ప.
నేను కొత్తగా ఇంగిలీషు నవలలు చదవాలీ అని అనుకున్నప్పుడు నా ముందు రూట్స్, ఫౌంటెన్‍హెడ్ గుర్తుకొచ్చాయి. ఎందుకోతెలియదు
నా చెయ్యి రూట్స్ మీద ఆగింది నేనురూట్స్
చదివేనాటికే నా ద్రిష్టిలో హీరో అర్ధం మారిపోయింది. కన్వెన్షనల్ హీరోలు జోకర్స్
అనిపించడం మొదలు పెట్టారు.
ఆ
తరువాత 5 సంవత్సరాలకు
"Howard Roark " నాకు పరిచయమయ్యాడు.
అప్పుడు నాకు దొరికిందే The
Fountainhead. ఐతే కల్పనే ఐనప్పటికీ, ఇంతగా ఈ
పుస్తకం నచ్చడానికి కారణం నాకూ అంతు బట్టలేదు. ఈ పరంపరలో నేను We the
Living, Atlas Shrugged కూడా చదివెసాను ఆమె చెప్పిన ఫిలాసఫీ వెలిబుచ్చిన
భావాల మీద, సిద్దాంతాల మీద నాకు చాలా అస్పస్టతలు (సరిగా అర్ధం
గాక,) వదిలేసి కధతో సంతోష పడ్డాను.
అప్పట్లో ఆ పాత్ర అంతగా
నచ్చడానికి కారణం ‘నచ్చినట్లు తన అలోచన
ప్రకారం రాజీ లేకుండా బ్రతకడం కష్టం. కానీ అదే చేసి చూపిన హీరో కాబట్టి అంతగా
నచ్చాడు” అని నేను అనుకుంటున్నాను. కానీ అలాంటి
కధలు చాలా వున్నాయి.ఈ పుస్తకం మాత్రమే ఇంతగా పాపులర్ అవటానికి కారణం ఆమె
చెప్పిన ఫిలాసఫీ అని తర్వాత అర్ధమయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అదే నవల తెలుగు లొ
డా. రెంటాల
శ్రీ వెంకటేశ్వరరావు గారి అనువాదం లొ చదువుతుంటే
...సుదూరంగా కొన్ని సంవత్సరాలు ముందుకు చూడగలిగిన ఆ దార్శినికతకు నేను "
ఫిదా" (ఇది హిందీమాట) ఐపోయాను.
ముగింపు
మాట:
శ్రీ వడ్డెర చండిదాస్ “అనుక్షణికం “ శ్రీ యండమూరి “అంతర్ముఖం” అయాన్ రాండ్ ఫౌంటెన్‌హెడ్‌తో పోల్చదగ్గ తెలుగు రచనలు
అని నా స్వంత అభిప్రాయం
------------
ధరణికోట సురేష్
కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
No comments:
Post a Comment