మీకు అవగాహన ఉందో లేదో
తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల
నుండి వివిధ రూపాలలో పన్నులను వసూలు
చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , గూడ్స్ అండ్ సర్వీస్
టాక్స్ .ప్రజల వద్ద నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన
మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి సమకూర్చుకోవడానికి
వినియోగిస్తారు.
ఈ రోజు ప్రజలు
సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే పోతుంది.
సాదారణంగా ప్రజలు వారు చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని
ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా
ప్రభావితం చేస్తున్నాయి. ఎలా?
ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి
అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి పై ఏ విధమైన
ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం.
రోజు రోజుకి వస్తువుల ధరలు
పెరుగుతున్నాయి
అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా
మంది ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి (ఇన్ఫ్లేషన్ పెరుగుదలని
అరికట్టడానికి) ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి
ప్రభుత్వం ఏమైన
చర్యలు తీసుకుంటుందా? మీరు ఒక్కసారి
గత పది సంవత్సరంల నుండి ఇన్ఫ్లేషన్ రేటు ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి.
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ
కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం
ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ . 30,000
లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు .
కాని వాస్తవం వేరే
ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
GST(Goods
and Service tax ) అనేది ప్రభుత్వం
విధించే టాక్స్ . వస్తువుకి
లేదా సేవకి అదనపు విలువ కలవడం వలన
వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం కావడానికి కారణం
అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం సమానంగా కేంద్ర మరియు రాష్ట్ర
ప్రభుత్వానికి వెళ్ళుతుంది. ఈ టాక్స్ రేటు ఒక్కో వస్తువు పై ఒక్కో విధంగా ఉంది.
మీరు వస్తువుల,సేవలపై పై
ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను
చెల్లించవలసి ఉంటుంది.
సాదారణంగా
పెట్రోలు , డిజీల్
మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి
అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్ని ఉహించలేం . వస్తువులు రవాణా
చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి
వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు
పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు
ఒక వస్తువు ధర రూ 20 ఆయితే ఇంధన
ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ 25 అవుతుంది.
మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోకెల్లా అత్యధికంగా పెట్రోలు డీజిల్ పై టాక్స్ వసూలు చేస్తుంది.ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75 ఉంటే మీరు చెల్లించే డబ్బులలో రూ .25.50 ప్రభుత్వానికే
వెళ్తాయి.అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే
పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన
రూ 11
తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ
వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.
మనం పెట్రోలు పై మాత్రమే
కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5
% to 28%
వరకు ప్రభుత్వం టాక్సు వసూలు
చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా
పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు టాక్సు తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా
తగ్గుతుంది. కాని ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి
ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం
ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా చెస్ అని వేరే టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది.
చాలా మంది ఇంతకు ముందు గోవాకి
అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ ,
వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు .
ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు.
....................................................................సురేష్ కుమార్ ధరణికోట,ఆడిటర్,పొన్నూరు@9441503681
“ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.దాన్నెందుకు ఆపలేరు ” భార్య అడిగింది
నీకు 21 సంవత్సరాలు వయస్సు లో , నడుము 28 మరియు బరువు 45 కిలోలు
ఇప్పుడు నీ వయస్సు 35 సంవత్సరాలు, నడుము 38 మరియు బరువు 75 కిలోలు.
నీకు ఇప్పుడు ఉన్నదేదో అప్పటికే ప్రతిదీ ఉంది.. కానీ తక్కువగా ఉంటుంది
వస్తువు మారదు లేదా పెరగదు తరగదు .. కానీ ఖర్చు పెట్టె విలువ పెరగటమే ..
నీకు ఇప్పుడు ఉన్నదేదో అప్పటికే ప్రతిదీ ఉంది.. కానీ తక్కువగా ఉంటుంది
వస్తువు మారదు లేదా పెరగదు తరగదు .. కానీ ఖర్చు పెట్టె విలువ పెరగటమే ..
ఇది ద్రవ్యోల్బణ రేటు. కష్టపడినా
దాన్ని కొంతవరకే అదుపుచేయగలం
నైతిక విలువలు -
సరియైన ఉదాహరణ లేకపోతే
ఆర్థికశాస్త్రం వివరించడానికి ..కష్టం.
నైతిక విలువలు -
సరియైన ఉదాహరణ లేకపోతే
ఆర్థికశాస్త్రం వివరించడానికి ..కష్టం.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment