Saturday, January 12, 2019

మీ పాన్ నెంబ‌ర్ ఎక్కడ బడితే అక్కడ ఈజీగా ఇచ్చేస్తున్నారా?



      ఆ మ‌న‌కొచ్చే ఆదాయం ఎంత‌లే.. పాన్ కార్డ్ డిటెయిల్స్ ఇస్తే మాత్రం ఏమ‌వుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే  ఓ పాతిక వేల రూపాయ‌ల జీత‌గాడి
పాన్ కార్డ్ డిటెయిల్స్ దొంగిలించి ఏకంగా 20 కోట్ల రూపాయ‌ల ఫ్రాడ్ ట్రాన్సాక్ష‌న్స్ చేసేసిన సంగ‌తి మీకు
తెలియ‌ద‌న్నమాట‌. ఓ సాధార‌ణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాన్‌కార్డ్ డిటెయిల్స్ వాడుకుని ఏకంగా ఇన్నికోట్ల
రూపాయ‌ల మోసానికి పాల్పడ్డారంటే న‌మ్మబుద్ధి కావ‌డం లేదా? అయితే చ‌దవండి
       ఢిల్లీలోని ల‌క్ష్మీన‌గ‌ర్ అనే ప్రాంతంలో ఉండే అనూజ్ కుమార్ శ్రీ‌వాత్సవ ఓ ఫార్మా కంపెనీలో సేల్స్
ఎగ్జిక్యూటివ్‌. నెల‌కు 25వేలు జీతం. అయితే ఇటీవ‌ల అత‌నికి ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు
వ‌చ్చాయి. మీ పాన్ నెంబ‌ర్‌తో భారీగా కోట్లలో ట్రాన్సాక్షన్లు జరిగాయని దాన‌ర్థం. నెల‌కు పాతిక‌వేల
జీత‌గాడిని.. త‌న పేరు మీద కోట్లరూపాయ‌ల ట్రాన్సాక్షన్లేమిటి? ఐటీ వాళ్లు పొర‌బ‌డ్డార‌నుకుని అనూజ్
కూల్‌గా ఉన్నాడు. అయితే వ‌రుస‌గా అత‌నికి ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి మూడు నోటీసులు రావ‌డంతో
కంగారుప‌డి ఆరా తీశాడు.
     త‌న‌కు 5 ల‌క్షల లోన్ కావాల‌ని అనూజ్ అడిగితే బ్యాంక్ వాళ్లు ఇవ్వలేదు. అందువ‌ల్లే త‌న‌కు ఇలా
రాంగ్ నోటీసు వ‌చ్చి ఉంటుందనుకున్నాడు. అయితే అత‌ని పాన్‌కార్డ్ డిటెయిల్స్ ఎవ‌రో కొట్టేసి అదే నెంబ‌ర్‌తో
ఏకంగా 20 కోట్ల రూపాయ‌ల ట్రాన్సాక్షన్లు చేసేశారని తేలి ల‌బోదిబోమంటున్నాడు.  ఆ ట్రాన్సాక్షన్లు
త‌న‌వికావ‌ని పోలీసుస్టేష‌న్‌లో కంప్లయింట్ కూడా చేశాడు.
      అనూజ్ ఓ ఛార్టెడ్ అకౌంటెంట్  హెల్ప్ తీసుకుని ఏం జ‌రిగింద‌ని  ఆరా తీస్తే ఈ విష‌యాల‌న్నీ
బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇంకో విష‌య‌మేమిటంటే ఓ సాధార‌ణ ఫార్మా కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన అనూజ్‌ను
ఏకంగా 13 కంపెనీలకు డైరెక్టర్‌గా చూపించేశారు మోస‌గాళ్లు. ఢిల్లీలోని మోంగ్‌కాక్ రోడ్‌లో ఉండే డైన‌మిక్
టెలికం కంపెనీ లిమిటెడ్‌లో అత‌ను 61.73 ల‌క్షల రూపాయ‌ల ట్రాన్సాక్షన్లు చేసినట్లు పాన్ కార్డ్
రికార్డుల బట్టి తెలుస్తోంది. అది జ‌న‌క్‌పురిలోని ఓ నేష‌న‌ల్ బ్యాంక్ నుంచి ఆ ట్రాన్సాక్షన్
జ‌రిగింద‌ని తెలిసి వెళ్లి  ఆరా తీస్తే ఓట‌ర్ ఐడీ, పాన్‌కార్డ్ ఇలా అన్నీ మ్యాచ్ అయ్యాయి. ఒక్క ఒరిజిన‌ల్
సంత‌కం త‌ప్ప అన్ని వివ‌రాలు దొంగిలించారు. అనూజ్ శ్రీ‌వాత్సవ పాన్‌కార్డ్ డిటెయిల్స్ కొట్టేసి అత‌ని
పేరు, పాన్ నెంబ‌ర్ మీద  ఇలా చాలా ట్రాన్సాక్షన్లు లక్షల విలువైన‌వి చేసిన‌ట్లు గుర్తించారు. ఐటీ
డిపార్ట్‌మెంట్ కూడా ఈ ఫ్రాడ్‌పై దృష్టి పెట్టింది. ఇవ‌న్నీ తాను చేయ‌లేద‌ని గుర్తించాల‌ని, ఐటీ
డిపార్ట్‌మెంట్ డేటా నుంచి త‌న పాన్‌కార్డ్ ఉన్న ఆ ట్రాన్సాక్ష‌న్ల వివ‌రాల‌ను తీసేయాల‌ని అనూజ్
కోరుతున్నాడు.
చూశారుగా.. మ‌న పాన్ కార్డ్ డిటెయిల్స్ నేరగాళ్ల చేతులో ప‌డితే ఏమ‌వుతుందో..
అందుకే పాన్‌కార్డ్‌తోనూ బీకేర్‌ఫుల్‌.
---------------------ధరణికోట సురష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card