ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Monday, January 21, 2019
Saturday, January 12, 2019
మీ పాన్ నెంబర్ ఎక్కడ బడితే అక్కడ ఈజీగా ఇచ్చేస్తున్నారా?
ఆ మనకొచ్చే
ఆదాయం ఎంతలే.. పాన్ కార్డ్ డిటెయిల్స్ ఇస్తే మాత్రం ఏమవుతుందిలే అని లైట్
తీసుకుంటున్నారా? అయితే ఓ పాతిక వేల రూపాయల జీతగాడి
పాన్ కార్డ్ డిటెయిల్స్
దొంగిలించి ఏకంగా 20
కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేసేసిన సంగతి మీకు
తెలియదన్నమాట. ఓ సాధారణ
సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాన్‌కార్డ్ డిటెయిల్స్ వాడుకుని ఏకంగా ఇన్నికోట్ల
రూపాయల మోసానికి పాల్పడ్డారంటే
నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చదవండి
ఢిల్లీలోని లక్ష్మీనగర్ అనే ప్రాంతంలో
ఉండే అనూజ్ కుమార్ శ్రీవాత్సవ ఓ ఫార్మా కంపెనీలో సేల్స్
ఎగ్జిక్యూటివ్. నెలకు 25వేలు జీతం. అయితే ఇటీవల అతనికి ఇన్‌కమ్
ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు
వచ్చాయి. మీ పాన్ నెంబర్‌తో
భారీగా కోట్లలో ట్రాన్సాక్షన్లు జరిగాయని దానర్థం. నెలకు పాతికవేల
జీతగాడిని.. తన పేరు మీద కోట్లరూపాయల
ట్రాన్సాక్షన్లేమిటి? ఐటీ
వాళ్లు పొరబడ్డారనుకుని అనూజ్
కూల్‌గా ఉన్నాడు. అయితే వరుసగా
అతనికి ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి మూడు నోటీసులు రావడంతో
కంగారుపడి ఆరా తీశాడు.
తనకు 5 లక్షల లోన్ కావాలని అనూజ్ అడిగితే బ్యాంక్ వాళ్లు ఇవ్వలేదు.
అందువల్లే తనకు ఇలా
రాంగ్ నోటీసు వచ్చి
ఉంటుందనుకున్నాడు. అయితే అతని పాన్‌కార్డ్ డిటెయిల్స్ ఎవరో కొట్టేసి అదే నెంబర్‌తో
ఏకంగా 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు
చేసేశారని తేలి లబోదిబోమంటున్నాడు. ఆ
ట్రాన్సాక్షన్లు
తనవికావని పోలీసుస్టేషన్‌లో
కంప్లయింట్ కూడా చేశాడు.
అనూజ్ ఓ ఛార్టెడ్ అకౌంటెంట్ హెల్ప్ తీసుకుని ఏం జరిగిందని ఆరా తీస్తే ఈ విషయాలన్నీ
బయటపడ్డాయి. ఇంకో విషయమేమిటంటే
ఓ సాధారణ ఫార్మా కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన అనూజ్‌ను
ఏకంగా 13 కంపెనీలకు డైరెక్టర్‌గా చూపించేశారు
మోసగాళ్లు. ఢిల్లీలోని మోంగ్‌కాక్ రోడ్‌లో ఉండే డైనమిక్
టెలికం కంపెనీ లిమిటెడ్‌లో అతను
61.73 లక్షల రూపాయల
ట్రాన్సాక్షన్లు చేసినట్లు పాన్ కార్డ్
రికార్డుల బట్టి తెలుస్తోంది.
అది జనక్‌పురిలోని ఓ నేషనల్ బ్యాంక్ నుంచి ఆ ట్రాన్సాక్షన్
జరిగిందని తెలిసి
వెళ్లి ఆరా తీస్తే ఓటర్ ఐడీ, పాన్‌కార్డ్ ఇలా అన్నీ మ్యాచ్
అయ్యాయి. ఒక్క ఒరిజినల్
సంతకం తప్ప అన్ని వివరాలు
దొంగిలించారు. అనూజ్ శ్రీవాత్సవ పాన్‌కార్డ్ డిటెయిల్స్ కొట్టేసి అతని
పేరు, పాన్ నెంబర్ మీద ఇలా చాలా ట్రాన్సాక్షన్లు లక్షల విలువైనవి
చేసినట్లు గుర్తించారు. ఐటీ
డిపార్ట్‌మెంట్ కూడా ఈ ఫ్రాడ్‌పై
దృష్టి పెట్టింది. ఇవన్నీ తాను చేయలేదని గుర్తించాలని, ఐటీ
డిపార్ట్‌మెంట్ డేటా నుంచి తన
పాన్‌కార్డ్ ఉన్న ఆ ట్రాన్సాక్షన్ల వివరాలను తీసేయాలని అనూజ్
కోరుతున్నాడు.
చూశారుగా.. మన పాన్ కార్డ్
డిటెయిల్స్ నేరగాళ్ల చేతులో పడితే ఏమవుతుందో..
అందుకే పాన్‌కార్డ్‌తోనూ బీకేర్‌ఫుల్.
---------------------ధరణికోట
సురష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
Thursday, January 10, 2019
ప్రియమైన ఎరువులు పురుగు మందుల వ్యాపారస్తులకు శుభవార్త..
Agro Input Dealers Association. - New Delhi, మరియు Fertilisers
and Pesticides Dealers Association- AP యొక్క సమిష్టి కృషి ఫలితంగా
భారత దేశ ప్రభుత్వం వారు GO NO GSR
11(E) Dated 03.01.2019 ద్వారా Pesticides licence నందు qualification certificate ను నమోదు
చేసుకొనుటకు ఆఖరి తేదీని ది 30.01.2021 వరకు పొడిగించటమైనదని తెలియ చేయుటకు సంతోషిస్తున్నాము.
-----ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు @9441503681
Wednesday, January 09, 2019
రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు
రూ.2.5లక్షల ఆదాయం దాటినవారు ఆదాయ పన్ను కట్టాలంటున్నారు.
ఇప్పుడు రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు అంటున్నారు.
ఆదాయ పన్ను పరిమితిని కూడా సడలిస్తూ నిబంధనలు తీసుకురండి
------------ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
ఇప్పుడు రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు అంటున్నారు.
ఆదాయ పన్ను పరిమితిని కూడా సడలిస్తూ నిబంధనలు తీసుకురండి
------------ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Tuesday, January 08, 2019
ఇన్ఫ్లేషన్ గురుంచి అర్ధం చేసుకోండి
మీకు అవగాహన ఉందో లేదో
తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల
నుండి వివిధ రూపాలలో పన్నులను వసూలు
చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , గూడ్స్ అండ్ సర్వీస్
టాక్స్ .ప్రజల వద్ద నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన
మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి సమకూర్చుకోవడానికి
వినియోగిస్తారు.
ఈ రోజు ప్రజలు
సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే పోతుంది.
సాదారణంగా ప్రజలు వారు చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని
ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా
ప్రభావితం చేస్తున్నాయి. ఎలా?
ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి
అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి పై ఏ విధమైన
ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం.
రోజు రోజుకి వస్తువుల ధరలు
పెరుగుతున్నాయి
అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా
మంది ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి (ఇన్ఫ్లేషన్ పెరుగుదలని
అరికట్టడానికి) ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి
ప్రభుత్వం ఏమైన
చర్యలు తీసుకుంటుందా? మీరు ఒక్కసారి
గత పది సంవత్సరంల నుండి ఇన్ఫ్లేషన్ రేటు ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి.
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ
కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం
ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ . 30,000
లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు .
కాని వాస్తవం వేరే
ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
GST(Goods
and Service tax ) అనేది ప్రభుత్వం
విధించే టాక్స్ . వస్తువుకి
లేదా సేవకి అదనపు విలువ కలవడం వలన
వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం కావడానికి కారణం
అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం సమానంగా కేంద్ర మరియు రాష్ట్ర
ప్రభుత్వానికి వెళ్ళుతుంది. ఈ టాక్స్ రేటు ఒక్కో వస్తువు పై ఒక్కో విధంగా ఉంది.
మీరు వస్తువుల,సేవలపై పై
ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను
చెల్లించవలసి ఉంటుంది.
సాదారణంగా
పెట్రోలు , డిజీల్
మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి
అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్ని ఉహించలేం . వస్తువులు రవాణా
చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి
వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు
పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు
ఒక వస్తువు ధర రూ 20 ఆయితే ఇంధన
ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ 25 అవుతుంది.
మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోకెల్లా అత్యధికంగా పెట్రోలు డీజిల్ పై టాక్స్ వసూలు చేస్తుంది.ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75 ఉంటే మీరు చెల్లించే డబ్బులలో రూ .25.50 ప్రభుత్వానికే
వెళ్తాయి.అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే
పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన
రూ 11
తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ
వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.
మనం పెట్రోలు పై మాత్రమే
కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5
% to 28%
వరకు ప్రభుత్వం టాక్సు వసూలు
చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా
పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు టాక్సు తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా
తగ్గుతుంది. కాని ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి
ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం
ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా చెస్ అని వేరే టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది.
చాలా మంది ఇంతకు ముందు గోవాకి
అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ ,
వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు .
ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు.
....................................................................సురేష్ కుమార్ ధరణికోట,ఆడిటర్,పొన్నూరు@9441503681
“ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.దాన్నెందుకు ఆపలేరు ” భార్య అడిగింది
నీకు 21 సంవత్సరాలు వయస్సు లో , నడుము 28 మరియు బరువు 45 కిలోలు
ఇప్పుడు నీ వయస్సు 35 సంవత్సరాలు, నడుము 38 మరియు బరువు 75 కిలోలు.
నీకు ఇప్పుడు ఉన్నదేదో అప్పటికే ప్రతిదీ ఉంది.. కానీ తక్కువగా ఉంటుంది
వస్తువు మారదు లేదా పెరగదు తరగదు .. కానీ ఖర్చు పెట్టె విలువ పెరగటమే ..
నీకు ఇప్పుడు ఉన్నదేదో అప్పటికే ప్రతిదీ ఉంది.. కానీ తక్కువగా ఉంటుంది
వస్తువు మారదు లేదా పెరగదు తరగదు .. కానీ ఖర్చు పెట్టె విలువ పెరగటమే ..
ఇది ద్రవ్యోల్బణ రేటు. కష్టపడినా
దాన్ని కొంతవరకే అదుపుచేయగలం
నైతిక విలువలు -
సరియైన ఉదాహరణ లేకపోతే
ఆర్థికశాస్త్రం వివరించడానికి ..కష్టం.
నైతిక విలువలు -
సరియైన ఉదాహరణ లేకపోతే
ఆర్థికశాస్త్రం వివరించడానికి ..కష్టం.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Subscribe to:
Posts (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
Difference Between Statement of Affairs and Balance Sheet Posted on October 27, 2014 by koshal Statement of Affairs vs Balance S...