Friday, December 28, 2018

బాపట్ల ఆదాయపన్ను శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ వేణు గోపాల్ గారి రిటైర్మెంట్ సందర్భంగా


బాపట్ల ఆదాయపన్ను శాఖ ఇన్స్పెక్టర్  శ్రీ వేణు గోపాల్ గారి  రిటైర్మెంట్ సందర్భంగా 
ఆదాయపన్ను శాఖ కమీషనర్ గారితో

Saturday, December 15, 2018

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు...ఏయే దేశాలు పెడతాయి:




               వాస్తవానికి ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 1953 నుంచే ఉంది. ఐరాసకు చెందిన వరల్డ్ మెట్రొలాజికల్ ఆర్గనైజేషన్ ఈ పని చేస్తుంది. కానీ, దక్షిణాసియాలో, మధ్య ప్రాచ్యంలో తుఫాన్లకు పేర్లు పెట్టడం ఇటీవలే మొదలైంది.
              గతంలో చాలా ఏళ్ల పాటు హిందూ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో తుపాన్లు ఏ పేరూ లేకుండా అనామకంగానే మిగిలిపోయాయి.
           తుఫాన్లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటుందని వాతావరణ నిపుణులు భావించారు. అలాగే ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి పేర్లు పెట్టడం సమంజసమని నిర్ణయించారు.
               తుఫాన్లకు పేర్లను పెట్టే ప్రక్రియను 19వ శతాబ్దం చివర ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్రజ్ఞురాలు క్లెమెంట్ లిండ్లీ రాగ్ ప్రారంభించారు. ప్రజలు ఏ రాజకీయ నాయుకులనైతే ఇష్టపడరో, అలాంటి వారి పేర్లను ఆమె పెట్టడం ప్రారంభించారు అయితే అది ఎక్కువ రోజులు కొనసాగలేదు
            అందుకే 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ పేర్లపై సమావేశాన్ని నిర్వహించారు..
          భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ ఎనిమిది దేశాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో అన్ని దేశాలకూ సమ ప్రాధాన్యం లభించింది. ప్రతి దేశం 8 పేర్లను కమిటీకి సమర్పించింది. అలా మొత్తంగా 64పేర్లతో ఓ జాబితా సిద్ధమైంది. ఆ పేర్లను భవిష్యత్తులో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలో రాబోయే తుఫాన్లకు పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
          ఏ తుపానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలనే దానిపైన కూడా కమిటీ ఓ పద్ధతిని రూపొందించింది. దీని కోసం ఇంగ్లిష్ అక్షరక్రమం ఆధారంగా దేశాల పేర్లను ఒక క్రమంలో పొందుపరిచారు. ఇంగ్లిష్ అక్షరం బితో మొదలయ్యే బంగ్లాదేశ్‌ ఆ జాబితాలో మొదటి స్థానంలో టి అనే అక్షరంతో మొదలయ్యే థాయిలాండ్ ఆ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.
          2004లో ఈ సమావేశం అనంతరం అక్టోబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుపానుకు ఒనిల్ అనే పేరును పెట్టారు. ఈ పేరును జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ సూచించింది. అదే ఏడాది నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుపానుకు అగ్ని అనే పేరు పెట్టారు. ఆ పేరును జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ సూచించింది.
                  అలా ఇప్పటివరకు జాబితాలో ఉన్న దేశాలు వరసగా సూచించిన పేర్లనే ఒక్కో తుపానుకు పెడుతూ వచ్చారు. గతంలో భారత్‌ను వణికించిన హుద్‌హుద్ తుఫాను పేరును ఒమన్,  ఫైలిన్ తుఫాన్ పేరును థాయిలాండ్, వర్ధ నర్గిస్ పేర్లను పాకిస్తాన్ సూచించాయి.
                  ఎనిమిది దేశాలూ సూచించిన 64పేర్లలో ఇప్పటిదాకా 57 పేర్లను వాడేశారు.
                   2004లో జరిగిన సమావేశంలో భారత్ తన వంతుగా 8 పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థకు సూచించింది. అవి అగ్ని, ఆకాశ్,బిజ్లి, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు. ఈ ఎనిమిది పేర్లలో ఇప్పటి వరకు ఏడు పేర్లను ఉపయోగించగా వాయు పేరును మాత్రమే వాడాల్సి ఉంది. తుఫాన్లు సంభవించినప్పుడు ఢిల్లీలోని వాతావరణ విభాగం అధికారికంగా ఈ పేర్లను ప్రకటిస్తుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, December 08, 2018

*జీతాలు లేదా పెన్షన్ పొందే వారు గమనించండి:*


2018 బడ్జెట్ లో, పన్నుల స్లాబ్లలో అత్యధికంగా అంచనా వేసిన మార్పులు ఆర్థిక మంత్రి, తీసుకురాలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల పరిమితులను పెంచకపోవడంతో సెక్షన్ 80C ను అతను తాకలేదు. అయితే, జీతాలు లేదా పెన్షన్ పొందే వారు బడ్జెట్ తర్వాత దాని గురించి ఆనందించడానికి ఒకటి ఉంది.
ఆసక్తికరంగా, జీతాలు లేదా పెన్షన్ పొందేవారు రూ. 40,000 రూపాయల’ ప్రామాణిక తీసివేత’ను(స్టాండర్డ్ డిడక్షన్) తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
అసలు ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) అంటే ఏమిటి? ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం, 1961 సెక్షన్ 16 ద్వారా మొత్తం జీతం నుంచి తగ్గింపు మొత్తం - 40,000 రూపాయల మొత్తం తగ్గించాలి.
ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) యొక్క నిబంధన ఇంతకు ముందు అందుబాటులో ఉంది కానీ దానిని ఫైనాన్సు చట్టం 2005 లో రద్దు చేయబడింది.
కానీ ఈ సంవత్సరం నుండి రవాణా భత్యం నెలకు రూ .1600 రూపాయల మరియు వైద్య భత్యం సంవత్సరానికి 15,000 రూపాయల కు పన్ను మినహాహింపు ఇకపై ఇవ్వరు..దాని బదులు స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000/-మాత్రమె ఇస్తుంది .దానికి అవసరమైన ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం, 1961 సెక్షన్ 17 (2) (viii) కు అవసరమైన సవరణలను ప్రతిపాదించింది.

15,000 రూపాయల వైద్య భత్యం మరియు నెలకు రూ. 1600 రవాణా బదిలీ అంటే సంవత్సరానికి 19,200 ఉంటే, అంటే మొత్తం 34200 ఇంతకుముందు వుండేది . రూ.40,000/- రూపాయల ప్రామాణిక మినహాయింపు ఫలితంగా, *అదనపు ప్రయోజనం రూ. 5,800*
*సర్ ఛార్జ్ ఇంతకుముందు 3% గా వుండేది ఇప్పుడు అది 4% అయ్యింది ఇదికుడా గమనించండి*

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, December 06, 2018

498ఏ నిజంగా దుర్వినియోగం అవుతుందా?




నాలుగు గోడల మధ్య స్త్రీల మీద హింస అనేది ఒక కఠిన వాస్తవం. భారత దేశంలో వరకట్న వేధింపులు ఈ హింసకు ఒక ప్రధాన కారణం. దానిని నివారించటానికి రూపకల్పన చేసిన చట్టం 498 ఏ. వరకట్నపు ప్రసక్తి లేని గృహహింసకు కూడా ఈ సెక్షను వర్తిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా గృహహింస అనుభవిస్తున్న మహిళలు 498ఏలో మొదటి భాగాన్ని ఉపయోగించుకొని కేసు పెట్టుకోవచ్చు. కానీ 498ఏ ప్రస్థానం వరకట్న వ్యతిరేక ఉద్యమాలనుండి ప్రారంభం అవటం వలన కోర్టులు కానీ పోలీసులు కానీ వరకట్న ఆరోపణలు లేకుడా ఈ కేసులను ముట్టుకోవటం లేదని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. గతి లేని పరిస్థితుల్లో వరకట్నానికి సంబంధించిన కొన్ని వాక్యాలైనా జత పరచాల్సి వస్తుంది. అయితే ఈ తప్పు కంప్లైంట్ చేసిన వారిదా? లేక తప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్న పోలీసులు, లాయర్లదా? లేదా చట్టం స్వభావంలోనే లోపం ఉందా? అనే విషయం తరచి చూడాలి. అవినీతి, తప్పుడు విచారణలు, కేసు పడిన భర్త మీద సానుభూతి .. ఇవన్నీ యాంత్రిక తీర్పులకు దారి తీస్తున్నాయి. వరకట్న చట్టాలు దుర్వినియోగమవుతున్నాయిఅనే వ్యంగ్య పూరిత ప్రచారం వెనుక ఈ చట్టాన్ని పటిష్ట పరిచి పకడ్బందీగా అమలు పరచాలనే కర్తవ్యం మరుగున పడుతుంది.

భర్త నుండి డబ్బు గుంజటానికే ఈ కేసులు పెడుతున్నారని ఈ సెక్షను మీద ఇంకో ఆరోపణ. ఎందుకంటే ఎక్కువ కేసులు డబ్బు తీసుకొని సెటిల్ అవుతున్నాయి కాబట్టి. మెజారిటీ 498 కేసులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని రాజీ పడుతున్నపుడు అది న్యాయమే అవుతుంది. ఆ డబ్బుతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కోర్టులు కూడా ఎప్పటి కప్పుడు ఈ విషయంలో నిర్దేశిక సూత్రాలు చెబుతూ ఆ సౌకర్యం కలిగిస్తున్నాయి. హింసాయుతమైన వైవాహిక జీవితంలో చిక్కుకొన్న యువతికి భర్తకు శిక్ష పడటం ఉపశమనం కలిగించదు. కొంత డబ్బు భద్రతతో గౌరవనీయమైన నిష్క్రమణ ఆమెకు అవసరం. ఈ రాజీల వలన వచ్చే డబ్బు ఆమె అప్పటికే దావా వేసిన మనోవర్తికి బదులుగా (ఇంకా చెప్పాలంటే చాలా తక్కువగా) ఇస్తున్నారని అర్ధం చేసుకోవాలి.


ఈ చట్టం చదువుకొన్న, ధనిక, మధ్య తరగతి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుందని, వారు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏక్తా గ్రూపు సర్వే ప్రకారం ఈ కేసుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారు భర్తల మీద ఆధారపడి పడిన నిర్భాగ్యులయిన స్త్రీలు. చదువుకొన్న,ధనిక స్త్రీలు పరిహారం కోసం నేరుగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఏటా ఐదు కోట్ల మహిళలు గృహహింస పాలు అవుతుంటే రెండు లక్షల కేసులు మాత్రమే ఈ సెక్షను క్రింద్ర నమోదు అవుతున్నాయి. యాభైవేల అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. పదిహేను శాతం కేసుల్లోనే శిక్షలు ఖరారు అవుతున్నాయి. తక్కువ శిక్షలు పడటానికి కారణం దొంగ కేసులు నమోదు అవటమేనని కోర్టులు అంటుంటే , స్త్రీలకు కోర్టుల్లో న్యాయం జరగటం లేదని మహిళాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, December 04, 2018

అసలు మధుపర్కం అంటే ఏమిటి?


 
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం అందరికీ తెలిసినదే. కానీ, చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అంటే బట్టలు పెట్టడం అని పెద్దలలో స్థిర పడిపోయింది కదా?
మొన్నెపుడో టీ.వీ. చానళ్ళు తిరగేస్తుంటే, ఒక దానిలో అప్పుడే మధుపర్కం సమర్పయామిఅని వినబడేసరికి, ఒక్క క్షణం నా పరుగును ఆపాను. అదో సామూహిక పూజ. వెంటనే ఇద్దరు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఓహో! అనుకొని మళ్ళీ ముందుకు కదిలిపోయాను. పూజా పద్ధతులు అందించే బ్లాగులూ వెబ్‌సైట్‌లలో మధుపర్కం సమర్పయామిఅన్ని ఉన్నప్పుడు, ‘ఇప్పుడు రెండు దూది వత్తులు సమర్పించండిఅని చూశాను. కొన్ని చోట్ల, శోడశోపచారాలలో వస్త్రం సమర్పయామిని మధుపర్కం సమర్పయామిఅని కూడా ప్రచురిస్తున్నారు. పెళ్ళిళ్ళలో కూడా మధుపర్కం అనే పదం వినబడుతుంది.మధుపర్కం బట్టలుమీరూ వినే ఉంటారు. దీపావళి అంటే టపాసుల పండుగఅయినట్టేమో కదా? ఇది కరెక్ట్ కాదు అని తెలుస్తోంది. మధు అంటే తియ్యనిలేకతేనెఅని అర్థం. పర్కం అంటే మిశ్రమం. మరి మధుపర్కం అంటే బట్టలు అని ఎలా స్థిరపడిపోయింది? ప్రామాణికంగా మధుపర్కం అంటే ఏమిటి అని శోధించాను. మధుపర్కం గురించి నాకు తటస్థించిన వివరాలు
అసలు మధుపర్కం అంటే ఏమిటి?
మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. ఆ మిశ్రమం వేటితో చేయాలి? దధి సర్పిర్జలం క్షౌద్రం సితా చైతైశ్వ పంచభిఃఅంటే సమపాళ్ళలో పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇంకా జలం. వీటి మిశ్రమమే మధుపర్కం.
పంచామృతం మధుపర్కం తేడా?
పూజల్లో పంచామృతం వాడతారు కదా మరి పంచామృతానికీ, మధుపర్కానికీ తేడా ఏమిటి? పాలు, పెరుగు, నెయ్యి, తేనే ఇంకా చెక్కెర ఈ క్రమంలో ఆయా పదార్థాలను విడి విడిగా స్నపనం చేసి, అలా వచ్చిన పదార్థాన్ని అంటే పంచామృతాన్ని తీర్థంగా స్వీకరించాలి. అన్నిటినీ కలిపేసి అభిషేకం చేస్తుంటారు. ఈ పద్ధతి ఎంతమటుకూ సరైనదో తెలియదు. పంచామృతంతో అభిషేకం చేస్తాము; మధుపర్కం స్వీకరించమని అంటే తాగమని సమర్పించుకుంటాము అది తేడా.
మధుపర్కం ఎందుకు సమర్పిస్తారు?
గౌరవాన్ని సుచిస్తూ సమర్పించుకునేది మధుపర్కం. యజమాని అంటే పూజ చేయిస్తున్న గృహస్తు లేదా పెళ్ళిలో కన్యాదానం చేస్తున్నతను మర్యాద పూర్వకంగా గౌరవాన్ని సూచిస్తూ మధుపర్కం సమర్పించుకోవాలి. పూజలో అయితే భగవంతుడికి, పెళ్ళిలో ఐతే నారాయణ స్వరూపమైన వరుడికి. మధుపర్కం సమర్పించుకోవటం ఎంతటి గౌరవ సూచకమో, దానిని పద్ధతిగా స్వీకరించటమూ అంతే మర్యాదతో కూడుకున్నది. సంస్కృత నిఘంటువులో  ‘A mixture of honey’, a respectful offering made to a guest or to the bridegroom on his arrival at the door of the father of the bride అని ఉంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card