అంతర్జాతీయ సమావేశాలలొ కొన్నిదేశాలు పాల్గొని కొన్నిదేశాలను సబ్సీడీలను తగ్గించాలని సామ్రాజ్య దేశాలు పట్టుబట్టి సాధించాయని చదివాను. ఇక్కడి రైతాంగానికి ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి డబ్బు సబ్సీడీ ఇస్తే వాళ్ళకేంటి నస్టం. అసలు వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలి? ఆయా దేశాల్లొ వాళ్ళ వాళ్ళ యిస్టం వచ్చినట్టు చేసుకొవచ్చు కదా.
-అక్కడి వ్యాపార శక్తులకు మార్కెట్ కావాలి. మరి పేద, వెనుకబడిన దేశాలు స్థానికి ప్రజలకు సబ్సిడీలు ఇచ్చి, ఆహార భద్రత లాంటి చట్టాలు తెస్తే వాటి ఉత్పత్తులు ఎవరు కొంటారు. ఉదాహరణకు అమెరికాలో చెరకు బాగా పండుతుంది. అది అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. అందుకోసం అది మన దేశంపై ఒత్తిడి తెచ్చి చక్కెర దిగుమతి చేసుకునేలా చేసింది. ఫలితంగా మన దేశంలో చెరకు పండుతున్నా….మనం చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం. ఫలితంగా మన దేశంలో చెరకు పంటకు ధర లేకుండా పోయి రైతులు నష్టపోతున్నారు. ఇలా అనేక కారణాలు.
WTO చట్టాల్లో భాగంగా, వ్యవసాయ ఒప్పందాల్లో భాగంగా…సబ్సిడీలపై నియంత్రణ విధించారు. సబ్సిడీలను-గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్ లుగా వర్గీకరించారు.
ఈ వర్గీకరణ ప్రకారం పేద దేశాలు తమకిష్టం వచ్చినట్లు సబ్సిడీలు ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలన్నా…., కోట్లాది ఉద్యోగాలు రావాలన్నా WTO నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అగ్రరాజ్యాలు తీర్మానించాయి.
మనం WTO
సంస్థలో సభ్య దేశంగా చేరాం. కాబట్టి ఎగుమతి దిగుమతి విధానాలైనా, పన్నుల
విధానాలైనా, వ్యవసాయ విధానాలైనా…ఆ సంస్థ చేసే రకరకాల ఒప్పందాల ప్రకారమే మన
ఆర్థిక వ్యవస్థను అనుగుణంగా మార్చుకోవాలి. అది ఒప్పందంలో భాగం. ఒకసారి WTO
లో చేరి సంతకం పెట్టాక ఆ నియమావళి ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే
కోర్టుకు ఈడుస్తారు. విచారణ జరిపి భారీగా జరిమానా విధిస్తారు. రకరకాల
ఆంక్షలు విధిస్తారు.
No comments:
Post a Comment