ఫోన్ టాపింగ్ : ఒక వ్యక్తి ఫోన్ సంభాషణలను అతనికి తెలీకుండా వినటం.
మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రం లో ఇప్పుడు ఇదొక కాలే కుంపటి. రోజు వార్తా పత్రికల్లో ఈ టాపింగ్ పదం చూసి చూసి, అసలు ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారు ? ఎవరు చేస్తారు ? మన రాజ్యాంగం లో ఈ విషయం గురించి ఏమైనా ఉందా ? అనైతికంగా ఫోన్ టాపింగ్ చేస్తే ఏమి జరుగుతుంది ? ఇలా చాల ప్రశ్నలు నా మెదడుని తోలిచేసాయి. వాటి సమాధానాలు..
* ఒకరి ఫోన్ టాపింగ్ చేయాలంటే, ముందుగా రాష్ట్ర లేదా కేంద్ర హోం శాఖ కు ఒక దరకాస్తు చేయాలి. సంబందిత విభాగం వాళ్ళు ఆ దరకాస్తు ని పరిశీలించి న్యాయ బద్దమైనది అని నిర్దారణ కి వస్తే, టాపింగ్ చేసే అధికారం ఇస్తారు.
* దరకాస్తు లో టాపింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎవరిని చేయాలనుకుంటున్నారు, టాపింగ్ వాళ్ళ నిజంగా ఉపయోగం ఉందా అనే విషయాలు స్పష్టంగా పేర్కొనాలి.
* టాపింగ్ చేసేఅనుమతి వచ్చిన తరువాత, టాపింగ్ చేయాలనుకునే వ్యక్తి సిమ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్లి అతని కాల్స్ ని గవర్నమెంట్ ఆఫీసు లో ఉండే ఒక పరికరానికి అనుసంధానం చేస్తారు. కావాలంటే రికార్డు కూడా చేసుకోవచ్చు.
* ఇలా టాపింగ్ చేసిన కాల్స్ ని న్యాయస్తానంలో తప్పించి బయటకి ఇవ్వటం చట్టరీత్యా నేరం.
ఒక వేళ అనైతికంగా అంటే ఎటువంటి అనుమతి లేకుండా ఫోన్ టాపింగ్ చేస్తే,
* ముఖ్యంగా అది వ్యక్తిగత స్వేచ్చా హక్కుని ఉల్లంగణ గా పరిగణించి ఎటువంటి పరినామాలైన జరిగే అవకాశం.
* FIR ఫైల్ చేయటం జరుగుతుంది. నిరూపణ అయితే గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష.
ఒక వేళ నైతికంగా ఫోన్ టాపింగ్ చేసి వివరాలు బయటకి చెపితే.. పైన చెప్పినవి అమలు.
*-* భారత ఆర్ధిక శాఖ విభాగం, సిబిఐ మరియు న్యాయన్ని అమలు చేసే ప్రభుత్వ శాఖ లు అన్నీ ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా 72 గంటల వరకు ఫోన్ టాపింగ్ చేయవచ్చు. ఒకవేళ ఇలా టాపింగ్ చేసినవి అనవసరం అని తేలితే, 48 గంటల్లో ఆ రికార్డులని ధ్వంసం చేయాలి.
*-* ఒక సారి అనుమతి లబించిన తరువాత అవసరం ఉంటె నిరవధికంగా 60 రోజులు ఫోన్ టాపింగ్ చేయొచ్చు. ఆ తరువాత కొత్త దరఖాస్తు చేసుకోవాలి.
** అనైతిక ఫోన్ టాపింగ్ కి పాల్పడి, నిరూపణ అయితే రెండు కోట్ల వరకు పరువునష్టం దావా వేసుకునే అవకాశం రాబోయే రోజుల్లో అమలు కానుంది.
No comments:
Post a Comment