మనలో చాలా మంది వారు సంపాదించిన డబ్బుని షేర్లు, మ్యూచువల్ ఫండ్ల
రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అత్యవసరంగా నగదు అవసరమవుతుంది. ఇలాంటి ఎమర్జెన్సీ
సమయంలో ఎక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా తీసుకు రావడం మనం చూస్తుంటాం. మెడికల్ ఎమర్జెన్సీలో
మన దగ్గర నగదు లేనప్పుడు, తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో నగదుని ఎలా తీసుకురావాలో ఇప్పుడు
చూద్దాం.
గోల్డ్ లోన్: మీ వద్ద ఉన్న
బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టి లోన్ రూపంలో నగదుని పొందవచ్చు. బంగారానికి
వ్యతిరేకంగా మీరు 85 శాతం నగదు పొందేందుకు వీలుంది. బంగారంపై బ్యాంకులు విధించే వడ్డీ
శాతం కూడా తక్కువగా ఉంటుంది. మీకు తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నా కూడా బంగారం లోన్
పోందే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు ద్వారా నగదు: నగదు వేగంగా పొందేందుకు ఇదొక చక్కని మార్గం. మీరు గనుక క్రెడిట్
కార్డు వినియోగదారులైతే బ్యాంకులు మీకు కొంత మొత్తంలో నగదు ఆఫర్ చేస్తాయి.
క్రెడిట్ కార్డు ద్వారా పొందే నగదుకి కూడా వడ్డీ శాతం తక్కువగానే ఉంటుంది. అయితే
క్రెడిట్ కార్డు ద్వారా రూ. 50 వేలు వరకు మాత్రమే పొందగలుగుతారు.
పర్సనల్ లోన్: పర్సనల్ లోన్
పొందేందుకు కాస్త టైం పడుతుంది. అయితే ఇది కూడా ఒక మార్గం అని సూచిస్తున్నాం.
పైవాటితో పోలిస్తే పర్సనల్ లోన్ తీసుకున్న వారు ఎక్కువ మొత్తంలో వడ్డీ
చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ముందుగానే చెల్లించే అవకాశాన్ని
బ్యాంకులు కల్పిస్తున్నాయి.
సెక్యూరిటీస్ ద్వారా లోన్: మీరు గనుక షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లైతే షేర్ల ఆధారంగా కూడా
బ్యాంకులు లోన్ పొందే వెసులుబాటుని కల్పిస్తున్నాయి. ఇక పోస్టా ఫీస్ స్కీంలైన
కేవీపీ, ఎన్ఎస్సీ లాంటి వాటి ద్వారా కూడా లోన్ పొందవచ్చు. వీటి ద్వారా మీరు
తీసుకునే రుణాలకు రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.
No comments:
Post a Comment