ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Wednesday, June 24, 2015
Saturday, June 20, 2015
ఫోన్ టాపింగ్
ఫోన్ టాపింగ్ : ఒక వ్యక్తి ఫోన్ సంభాషణలను అతనికి తెలీకుండా వినటం.
మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రం లో ఇప్పుడు ఇదొక కాలే కుంపటి. రోజు వార్తా పత్రికల్లో ఈ టాపింగ్ పదం చూసి చూసి, అసలు ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారు ? ఎవరు చేస్తారు ? మన రాజ్యాంగం లో ఈ విషయం గురించి ఏమైనా ఉందా ? అనైతికంగా ఫోన్ టాపింగ్ చేస్తే ఏమి జరుగుతుంది ? ఇలా చాల ప్రశ్నలు నా మెదడుని తోలిచేసాయి. వాటి సమాధానాలు..
* ఒకరి ఫోన్ టాపింగ్ చేయాలంటే, ముందుగా రాష్ట్ర లేదా కేంద్ర హోం శాఖ కు ఒక దరకాస్తు చేయాలి. సంబందిత విభాగం వాళ్ళు ఆ దరకాస్తు ని పరిశీలించి న్యాయ బద్దమైనది అని నిర్దారణ కి వస్తే, టాపింగ్ చేసే అధికారం ఇస్తారు.
* దరకాస్తు లో టాపింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎవరిని చేయాలనుకుంటున్నారు, టాపింగ్ వాళ్ళ నిజంగా ఉపయోగం ఉందా అనే విషయాలు స్పష్టంగా పేర్కొనాలి.
* టాపింగ్ చేసేఅనుమతి వచ్చిన తరువాత, టాపింగ్ చేయాలనుకునే వ్యక్తి సిమ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్లి అతని కాల్స్ ని గవర్నమెంట్ ఆఫీసు లో ఉండే ఒక పరికరానికి అనుసంధానం చేస్తారు. కావాలంటే రికార్డు కూడా చేసుకోవచ్చు.
* ఇలా టాపింగ్ చేసిన కాల్స్ ని న్యాయస్తానంలో తప్పించి బయటకి ఇవ్వటం చట్టరీత్యా నేరం.
ఒక వేళ అనైతికంగా అంటే ఎటువంటి అనుమతి లేకుండా ఫోన్ టాపింగ్ చేస్తే,
* ముఖ్యంగా అది వ్యక్తిగత స్వేచ్చా హక్కుని ఉల్లంగణ గా పరిగణించి ఎటువంటి పరినామాలైన జరిగే అవకాశం.
* FIR ఫైల్ చేయటం జరుగుతుంది. నిరూపణ అయితే గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష.
ఒక వేళ నైతికంగా ఫోన్ టాపింగ్ చేసి వివరాలు బయటకి చెపితే.. పైన చెప్పినవి అమలు.
*-* భారత ఆర్ధిక శాఖ విభాగం, సిబిఐ మరియు న్యాయన్ని అమలు చేసే ప్రభుత్వ శాఖ లు అన్నీ ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా 72 గంటల వరకు ఫోన్ టాపింగ్ చేయవచ్చు. ఒకవేళ ఇలా టాపింగ్ చేసినవి అనవసరం అని తేలితే, 48 గంటల్లో ఆ రికార్డులని ధ్వంసం చేయాలి.
*-* ఒక సారి అనుమతి లబించిన తరువాత అవసరం ఉంటె నిరవధికంగా 60 రోజులు ఫోన్ టాపింగ్ చేయొచ్చు. ఆ తరువాత కొత్త దరఖాస్తు చేసుకోవాలి.
** అనైతిక ఫోన్ టాపింగ్ కి పాల్పడి, నిరూపణ అయితే రెండు కోట్ల వరకు పరువునష్టం దావా వేసుకునే అవకాశం రాబోయే రోజుల్లో అమలు కానుంది.
Thursday, June 11, 2015
ఉన్నత విద్యకు ఆర్థిక ప్రోత్సాహం
ప్రభుత్వఫీజురీయింబర్స్‌మెంట్ పథకం
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో అత్యంత ప్రధానమైనది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు అందజేస్తారు. ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులకు ఈ పథకం అందుబాటులో ఉంది. ఆయా కోర్సులు, కమ్యూనిటీ, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాల మేరకు ఫీజు రీయింబర్స్ చేస్తారు. విద్యార్థుల స్థానికత ఆధారంగా రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు. బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి దాదాపు గతేడాది మాదిరిగానే ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధి విధానాలు ఉంటాయని ఎంసెట్-2015 ఫలితాల వెల్లడి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. తెలంగాణలోనూ ఈ ఏడాది కూడా గత విధానాన్నే అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతేడాది నిర్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతలు, విధి విధానాల వివరాలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం:
ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) 2013-14 నుంచి 2015-16 బ్లాక్ పిరియడ్‌కు ఇంజనీరింగ్ కళాశాలలకు వాటి ప్రమాణాల ఆధారంగా వేర్వేరు మొత్తాల్లో ఫీజులు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కనిష్టంగా రూ. 30 వేల నుంచి గరిష్టంగా 1.13 లక్షల వరకు ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కళాశాలలకు లభించింది. అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సీలింగ్ విధించింది. గరిష్టంగా సంవత్సరానికి రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అదే విధంగా బీఫార్మసీ కోర్సుకు రూ. 31 వేలు గరిష్ట పరిమితిగా పేర్కొంది.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంవత్సరానికి రూ. 20 వేలు. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు విధించింది. అవి..
ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితి రెండు లక్షల్లోపు ఉండాలి.బీసీ, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉండాలి.కమ్యూనిటితో సంబంధం లేకుండా పది వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులందరూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు గతేడాది గరిష్ట వయోపరిమితి నిబంధన కూడా అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలు; ఓసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు 25 సంవత్సరాలుగా పేర్కొన్నారు.ఈ ఏడాది కూడా దాదాపు ఇవే నిబంధనలు అమలు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.
స్థానికత నిర్ధారణ ఇలా..
సీట్ల కేటాయింపు, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న లోకల్ (స్థానికత) నిర్ధారణకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలు.. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంతో కలిపి అంతకుముందు నాలుగేళ్లపాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం వరకు ఎస్వీయూ రీజియన్‌లో చదివితే.. ఎస్వీయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు. అదే విధంగా ఏయూ రీజియన్‌లో చదివితే.. ఏయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు.
ఒక వేళ అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల్లో తమ విద్యాభ్యాసం సాగిస్తే (బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం నుంచి గడిచిన ఏడేళ్ల కాలంలో చదివిన ప్రాంతాలను గుర్తించి ఎక్కువ కాలం చదివిన ప్రాంతానికి లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. అదే విధంగా మూడు రీజియన్లలోనూ చదివుండి అందులో రెండు రీజియనల్లలో సమాన కాలం చదినట్లయితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ప్రాంతానికే లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండేళ్లు (మొత్తం మూడేళ్లు) ఏయూ రీజియన్‌లో, ఏడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు(మొత్తం మూడేళ్లు) ఓయూ రీజియన్‌లో,ఆరో తరగతి (ఒక సంవత్సరం) ఎస్వీయూ రీజియన్‌లో చదివితే..
ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తి చేసిన ప్రాంతమైన ఏయూ రీజియన్‌కు లోకల్‌గా పరిగణిస్తారు.అదే విధంగా బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ ఇయర్స్‌కు సంబంధించి మొత్తం ఏడేళ్ల కాలంలో మొదటి మూడున్నరేళ్లు ఒక రీజియన్‌లో, మరో మూడున్నరేళ్లు ఇంకో రీజియన్‌లో చదివితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన రీజియన్‌కు లోకల్ అభ్యర్థులవుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమైన పత్రాలు(ఏపీ)కుల ధ్రువీకరణ పత్రం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (జనవరి 1, 2015 తర్వాత జారీ చేసిన)
బ్యాంకు రుణాలు.. మరో మార్గం
బీటెక్ ఔత్సాహికులకు కోర్సు వ్యయాలు భరించేందుకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. బ్యాంకు రుణాలు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ విద్యా రుణాలు అందజేస్తున్నాయి. ట్యూషన్ ఫీజు, బుక్స్, కంప్యూటర్ కొనుగోలు, స్టడీ టూర్స్ వంటి మొత్తాలకు సరిపడే విధంగా రుణాలు అందిస్తున్నాయి. వీటిని పొందేందుకు కొన్ని విధి విధానాలు అమలవుతున్నాయి. అవి..
భారతదేశంలో చదవడానికి గరిష్టంగా రూ. పది లక్షలు అందిస్తారు (కోర్సు మొత్తం)
రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి మార్జిన్ ఉండదు. రుణ మొత్తం రూ. నాలుగు లక్షలు దాటితే 5 శాతం (భారతదేశంలో) మార్జిన్ చెల్లించాలి.రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. తల్లిదండ్రుల హామీ సరిపోతుంది.రూ. నాలుగు లక్షల నుంచి రూ. ఏడున్నర లక్షల వరకు తల్లిదండ్రుల హామీతోపాటు థర్డ్‌పార్టీ కొల్లేటరల్ సెక్యూరిటీ చూపించాలి. రూ. ఏడున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తం రుణం కావాలంటే తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థిని కొల్లేటరల్ సెక్యూరిటీగా చూపించాలి.ఈ నిబంధనలు పాటిస్తే నామమాత్రపు వడ్డీతో రుణం మంజూరవుతుంది. తిరిగి చెల్లింపు విషయంలోనూ వెసులుబాటు లభిస్తుంది. కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత నుంచి లేదా కోర్సు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక ఆరు నెలల తర్వాత నుంచి (ఈ రెండిటిలో ఏది ముందు సాధ్యమైతే అప్పటి నుంచి) రుణం నెల వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.
వెబ్‌సైట్:www.iba.org.in
స్కాలర్‌షిప్ సదుపాయాలు
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, బ్యాం కు రుణాలతోపాటు పలు స్కాలర్‌షిప్ పధకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫీజు మొత్తాన్ని అందించకపోయినా నెలవారీగా నిర్దేశిత మొత్తాలు లభిస్తాయి.
ఎన్‌టీపీసీ స్కాలర్‌షిప్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థుల కోసం అందిస్తున్న స్కాలర్‌షిప్ స్కీం ఇది. వెబ్‌సైట్:
సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్:
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత విద్య ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన పథకం సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్. జాతీయ స్థాయిలో అమలు చేసే ఈ పథకం ద్వారా మొత్తం 82 వేల గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీటిలో సగం మహిళా విద్యార్థులకు అందిస్తారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరంలో పది నెలలపాటు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్:www.cbse.nic.in
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కాలర్‌షిప్ పథకం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండి ఇంటర్మీడియెట్ వరకు 60 శాతం మార్కులతో అకడమిక్ రికార్డ్‌తోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. అకడమిక్ మెరిట్, తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి పది నెలలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్:www.licindia.in
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్స్
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సు అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కీం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. మూడు వేలు వరకు ఆర్థిక చేయూత లభిస్తుంది.
వెబ్‌సైట్:www.iocl.com
ఏఐసీటీఈ - PRAGATI స్కాలర్‌షిప్స్
టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకం PRAGATI (Providing Assistance for Advancement of Girl Participation in Technical Education) సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల్లోపు ఉండాలి. జాతీయ స్థాయిలో ఏటా నాలుగు వేల మంది విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థినులకు గరిష్టంగా రూ. 30 వేల ట్యూషన్ ఫీజుతోపాటు సంవత్సరంలో పది నెలలపాటు నెలకు రూ. రెండు వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్:www.aicte-india.org
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ మైనారిటీస్
కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ.. మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకమిది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. మూడు లక్షల్లోపున్న మైనారిటీ వర్గాలకు చెంది న విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, మెయింటనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.
వెబ్‌సైట్: www.minorityaffairs.gov.in

Subscribe to:
Posts (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
Difference Between Statement of Affairs and Balance Sheet Posted on October 27, 2014 by koshal Statement of Affairs vs Balance S...