Saturday, August 09, 2014

మెదడుకు వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే...

            వృద్ధాప్యం ఎలాగూ వస్తుంది. ఎవరూ ఆపలేరు. అయితే, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మెదడు పదును, గ్రహణశక్తి తగ్గుతూ ఉంటుంది చూడండి, దానికి ఒక విరుగుడు ఉందంటున్నారు. అది, రెండు, అంతకంటె ఎక్కువ భాషలు వచ్చి ఉండడం. ఎక్కువ భాషలు వచ్చి ఉండడానికి, మెదడు పదునుగా ఉండడానికి సంబంద óమేమిటని మనకు వెంటనే అనిపిస్తుంది. కానీ కచ్చి తంగా సంబంధముందని ఎడింబరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని నిరూపించడానికి 1947లోనే ఒక ప్రయోగం చేప ట్టారు. ఆశ్చర్యమేమిటంటే ఆ ప్రయోగ ఫలితాన్ని యాభై ఏళ్ల తర్వాత పరిశీలించి వృద్ధాప్యంలో కూడా మెదడు చురుకుగా ఉండడానికి, రెండు మూడు భాషలు తెలిసి ఉండడానికి సంబంధముందని నిర్ధారించారు. ఈ ప్రయోగానికి స్కాంట్లాండ్‌లోని ఎడింబరోకు చుట్టు పక్కల ఉన్న 835 మందిని ఎంచుకున్నారు. వీరంతా ఇంగ్లీష్‌ మాట్లాడతారు. 1947లో వీరికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీరి మేధోశక్తిని పరిశీలించారు. 2008-20010 మధ్యలో వీరు 70వ పడిలో ఉన్నప్పు డు మరోసారి పరీక్షించారు. వీరిలో 195 మంది తమకు 18 ఏళ్ల లోపు వయసు ఉన్నప్పుడు కానీ, 65 ఏళ్లు దాటి న తర్వాత కానీ రెండు లేదా అంతకంటె ఎక్కువ భాషలు నేర్చుకున్నారు. ఒక్క భాష మాత్రమే తెలిసిన వారితో పోల్చితే, వీరి మెదడు వృద్ధాప్యంలో కూడా చురుకుగా ఉన్నట్టు తేలింది. సాధారణమైప ఇంటెలి జెన్స్‌లోనూ, పుస్తకపఠనంలోనూ ఈ తేడా మరింత ఎక్కువగా కనిపిం చింది. ఈ అధ్యయనంలో ఇంకొకటి కూడా వెల్లడైంది. ఒకటి కంటె ఎక్కువ భాషలు చిన్న ప్పుడు నేర్చేకున్నా, పెద్దయిన తర్వాత నేర్చుకున్నా మెదడు చురుకుదనం మీద, గ్రహణశక్తి మీద ఒకే రకమైన సానుకూల ప్రభావా న్ని చూపిస్తుంది. అంతే కాదు. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల మెదడు చురుకు దనం పెరుగుతుందా లేక సహజం గానే మెదడు చురు కుగా ఉండేవారు ఎక్కువ భాషలు నేర్చుకుంటారా అన్న చర్చ కూడా మొదట్లో జరిగింది. అయితే, ఒకటిని మించిన భాషలు నేర్చుకున్న తర్వాతే మెదడు పదును పెరుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. మన పురా ణాల్లో ఆదిశేషుడికీ, హనుమం తుడికీ అనేక భాషలు వచ్చని చెబుతుంటారు. వారు మంచి పండితులుగా, మేధావులుగా గుర్తింపు పొంద డంలోని రహస్యం ఇదే కావచ్చేమో. మన సమకా లికు ల్లోనూ, ఇంతకుముందూ కూడా బహుభాషావేత్తలు చాలామందే ఉన్నారు. వీరు కూడా మేధావులుగానే గుర్తింపు పొందారు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా కొత్త భాషలు నేర్చుకోవడం ప్రారంభించండి

No comments:

Post a Comment

Address for Communication

Address card