గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి
ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం...
పట్టాదారు పాసుపుస్తకం...
పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు.
ఏటీఎం కార్డయితే...
ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్‌లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. వారు ఒక No.. ఇస్తారు.దానిని తీసుకుని ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే, వారు ముందుగా క్రొత్త ATM ఫార్మ్ ఇస్తారు దానిలో ముందు తీసుకున్న ఫిర్యాదు No. తొ BANK FEE చెల్లిస్తే మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్‌కోడ్ నంబర్ ఇస్తారు.
పాన్కార్డు
ఆదాయపు పన్నుకు అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్)కార్డు పోగొట్టుకుంటే.. సంబంధిత ఏజెన్సీల్లో పాత పాన్కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. కొత్తకార్డు కోసం అదనంగా మరో 105 రూపాయలు చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీచేస్తారు. www.nsdl.pan వెబ్సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
పాస్పోర్టు
పాస్పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్ట్రేస్డ్ పత్రంతో పాస్పోర్టు కార్యాలయం, హైదరాబాద్ పేరిట వెయ్యి రూపాయల డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తర్వాత డూప్లికేట్ పాస్పోర్టును జారీ చేస్తారు. తత్కాల్ పాస్పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov. in ను సంప్రదించవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు
ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్తో *10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www. ceoandhra.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఆధార్కార్డు
ఆధార్కార్డు పోగొట్టుకుంటే టోల్ఫ్రీ నెంబర్ 18001801947లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai. gov.in వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందవచ్చు.
డ్రైవింగ్ లెసైన్స్
వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో డ్రైవింగ్ లెసైన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జతచేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. అలాగే 10 రూపాయల బాండ్పేపరుపై కార్డుపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలి. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. aptransport.org వెబ్సైట్ నుంచి ఎల్ఎల్డీ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందవచ్చు.
రేషన్కార్డు
గుర్తింపుతో పాటు రేషన్షాపుల్లో సరుకులు తీసుకోవడానికి రేషన్కార్డు అవసరం. ఇదిపోతే www.icts2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. అక్కడ ఉన్న username guest, password guest123 సాయంతో విచారణ(క్వేరీ) ఉపయోగించి మన రేషన్కార్డు నంబర్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే మండల తహశీల్దార్ దానిని పరిశీలించి నామ మాత్రపు రుసుంతో అదే నంబరుపై కార్డు జారీ చేస్తారు.

No comments:
Post a Comment