Monday, December 16, 2019

నేను కూడా స్వామిజీ గా మారాలనుకుంటున్నా!


     జీవితం మీద bore కొట్టింది. ఒకప్పుడుసామాన్య గుమాస్తాల దగ్గర్నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఆర్థిక నిపుణుల వరకు ఈ రంగం లో వున్నారు.అని గర్వంగా వుండేది కానీ చాంతాండంత GST  విధివిధానాలు పూర్తి చెసి చేసి  ఉన్న ఆసక్తి కాస్తా పోయి విసుగు వచ్చేస్తుంది.books of accounts, ledgers, ,balance sheet, trial balance, returns, reports audits scrutiny, time limit deadlines ctc  అంటూ విరక్తి - జీవితం లో సుఖం కనపడలేదు. ఇంకా ఏదో కావాలి, ఏదో జరగాలి, ఏదో variety ఉండాలి.
ఇది మానేసి ఇంకేదన్నా చేద్దాం అనిపించింది.
       ఏమిచేయాలి ?అసలు నాకేమి చాతవతుంది?. ఇలాగ అనుకుంటూ office కి బయలుదేరా! అనాలోచితంగా దృశ్య,శ్రవణ యంత్రం (TV) వైపుచూడగా స్వామి అలౌకికానంద ప్రవచనం వస్తుంది .అంతే “మదీయ మానసంబు నందు తళుక్కున మెరిసినదో భావ వీచిక.. ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ గడిపపేయటమే సులభమనుకున్నా.నా చిన్ననాడు విన్నవీ, కన్నవీ అతీతకాలపు స్మృతియవనిక వెనుక దాగిన మఱికొన్ని జ్ఞాపకాలను ప్రజలకు అంకితం చేయటం కంటె వేఱే మార్గం గోచరింపలేదు నాకు. ఒక అలౌకికానంద పారవశ్యంతో నేను కూడా ఒక మహాస్వామివరేణ్యులు అయిపోతే బాగుంటుందనిపించింది.కావాల్సినంత దబ్బు,పేరు సుఖం అన్నీ వున్నాయందులో అనిపించీంది. పేరు కూడా పెట్టేసుకున్నా! స్వామి గణికానంద.
కాని ఒక సమస్య మదిలో మెదిలింది. ఎలా మొదలుపెట్టాలి తోచలా!నిస్పృహతో నడుస్తూ ఎదురుగా కనిపించిన ఒక ఆశ్రమంలోకి నడిచా!
శ్లో: హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయా యుధ్ధాయ కృతనిశ్చయః
తా: ఓ కౌంతేయా రణరంగమున మరణించినచో వీరస్వర్గం పొందేదవు. యుధ్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడివై యుధ్ధమునకు లెమ్ము. నిజమే అనిపించిది. ఇందాక వీర స్వర్గం, రాజ్య భోగం అని అర్జునుడిని tempt చేసిన కృష్ణ పరమాత్మ ఫలాపేక్ష వదలమంటాడే. ఫలాపేక్ష వదిలేస్తే జీవితంలో ఏదైనా ఎందుకు చెయ్యాలి అనిపించింది.
ఇంతలో ప్రవచనం ముగిసింది. భక్తులు ఒక్కొక్కరే కానుకలు సమర్పించుకుని వెళ్తున్నారు. అందరూ అయ్యారు. స్వామి ప్రశ్నార్ధకంగా చూశారు. నా కథంతా చెప్పుకొచ్చా!..నేను కూడా స్వామిజీ గా మారాలనుకుంటున్నాస్వామీ అని చెప్పా! అంతా విన్న తరువాత (కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి, దాన్ని మించిపోయేలా చిరునవ్వు నవ్వి) పరమేశ్వరనుగ్రహ ప్రాప్తిరస్తు. అంటూఎంతో చిరాకుతో కూర్చున్నాడు స్వామి అలౌకికానంద .కానీ ఇందులో కూడా కష్టం వుంది నాయనా. చెప్తాను వినుఅన్నాడు.
పేరులో తప్పితే అలౌకికంగా, లౌకికంగా జీవితంలో నాకు ఆనందం దొరికినట్టు కనపడటం లేదు. ఎప్పుడూ ఇంతే నేను ఉపదేశించే దానికి, నా జీవితంలో జరిగే దానికి చుక్కెదురు. మొన్ననే ఏదో tv channel లో interview కి వెళ్లినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పలేక కోపం కూడా వచ్చింది. నేనేమో పరిపూర్ణమైన జ్ఞ్యానం ఈ జనాలకి అందించాలని ప్రయత్నం, వీళ్ళు నా జీవితంలో జరిగిపోయిన వాటిని తీసుకుని ప్రశ్నలు. మొన్నటకి మొన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు విడవాలి అని చెప్తే నా గత జీవితంలో వదిలేసిన పంకజం గురించి, ప్రస్తుతం ఆశ్రమం పేరు మీద ఉన్న భూముల గురించి, నా competitor స్వామి అభేదానంద గురించి అడిగితే మరి కోపం రాదా. ఇవాళ బొల్డు డబ్బు పెట్టి జనాలని పోగేసేకూడికలు ఆరాధనలు” వచ్చాయి, asthma తగ్గింది, గుండె జబ్బులు ,కిడ్నీ లు బాగయ్యాయి. అని చెప్పి ఎంత ప్రచారం చేసినా ఎవడూ comment చేయడు. డబ్బు మహిమ అలాటిది. వాళ్లెమో కోట్లకి పడగలెట్టడం. నేను ఎంత local, indigenous స్వామి అయితే మాత్రం నాకేమో harassment. అసలు ప్రజలకి వేదాలు, ధర్మం అంటే గౌరవం పోయింది.నేను కూడా కొద్దిగా foreigners ని పోగేసి art of living, level of thinking అని కొద్దిగా political propaganda కలిపితే తప్పితే ఇది కుదుటపడేలాగా కనపడటం లేదు. ఇది కాకుండా ఈ మధ్య పురాణాల మీద టీకా, తాత్పర్యాలు చెప్పే బ్రహ్మశ్రీ లు ఎక్కువై నాకు అక్కడి నించి కూడా stiff competition. ఈ next generation కి అసలివేమీ పట్టటం లేదు. వీళ్ళు computers, dollars, abroad అని, అదే తాపత్రయం. ఇలాటి conditions లో ఎలాగైనా నా సత్తా నిరూపించుకోవాలి. ఎలా?..... స్వామి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
నాకు బుర్ర తిరిగిపోయింది. ఈ జిలేబీకి అంతం కనపడలేదు. ఒకటే విషయం అర్ధం అయ్యింది. ఎలా కొట్టుకున్నా నా కష్టం నేనే తీర్చుకోవాలి. ఎవడూ తీర్చలేడు. చావో, బ్రతుకో నేనే తేల్చుకోవాలి. ఒక నమస్కారం పెట్టి తిరిగి పోయా!.
శ్లో: కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా
మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగో౭స్త్వకర్మణి
తా: కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఎన్నటికీ దాని ఫలములయందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానరాదు. ఫలాపేక్షరహితుడవై కర్మలనాచరింపుము. 
దూరంగా స్వామీజీ ప్రవచనం లీల గా వినపడుతుంది
……………………………………ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్

‘క్రోని కేపిటలిజం’ అంటే ఎమిటి?


           ఈ మద్య మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పదం క్రోని కేపిటలిజం’. అంటే ఎమిటి? నాకు తెలిసినంత వరకు చెప్పటానికి ప్రయత్నిస్తా!
      50 ఏళ్ళ వయసుగల ఒక చేతివృత్తి కార్మికుడు 30 ఏళ్ళ పని చేయగలిగే కాలంలో,ఒక ఇల్లు కట్టుకోవడమే గగనకుసుమవుతున్న ఈ కాలంలో, అదే సమయంలో 30 ఏళ్ళ వయసుగల యువకుడు లక్ష కోట్లకు అధిపతి అవుతున్నాడు.
ఇంత వ్యత్యాసము దేనికి?ఎందుకిలా జరుగుతుంది ?
మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990నుంచి ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళలో అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి తగ్గుముఖం పెట్టి ఆయుః ప్రమాణం పెరిగింది. దేశజనాభా 130కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్‌, పొరుగున వున్న బంగ్లా, పాకిస్థాన్‌ లాంటి దేశాలను అధిగమించింది.
అయితే
అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం అయింది.భారత్‌ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినా, సంపన్నులే ఎక్కువగా లభ్ధి పొందారు.
క్రెడిట్‌ సూస్స్‌, ఆక్స్‌ఫామ్‌ సంస్థల అంచనా ప్రకారం పేదవారిలో పదిశాతం పేదవారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా, పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. అంటే పేదవారి ఆదాయం ఏటా ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది.
ఇదే క్రోని కేపిటలిజం అంటే ,
కరెన్సీకి 'బంగారు ప్రమాణం' లేదు. అసలు ఏ ప్రమాణం లేదు. శూన్య విలువగల పేపర్
కరెన్సీని బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు ఇష్ట మొచ్చినట్లుగా వ్యవస్థ లోనికి చొప్పిస్తున్నారు. ఇలా శూన్య విలువగల డబ్బును ఇష్టమొచ్చినట్లు వ్యవస్థలోనికి చొప్పిస్తూ పోతే 90 శాతం జనపు ఆర్ధిక స్థితి దెబ్బతింటుంది. మిగిలిన 10 శాతం జనం ఆస్తులు పెరిగిపోతాయి
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల పేర వేల, లక్షల కోట్ల డబ్బు బదిలీ జరుగుతున్నది  సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు, వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలకపాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి.
పురోగతి వున్నా,అంతకుముందు నుంచి మిగిలిన దేశాలవారి ఆదాయం- పురోగతిని పరిశీలిస్తే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌, థాయ్లాండ్‌, వియత్నాం, చైనా దేశాలకన్నా పురొగతిలో భారత్‌ వెనుకబడింది.
విలువ ఆధారిత డబ్బు అందని పండుగానే వుంది.






Address for Communication

Address card