Wednesday, February 28, 2018

ఇలా చేస్తే చాలు.. బ్యాంకుకు ఒక ఒక్క రూపాయి కూడా ఛార్జీ కట్టక్కర్లేదు!!




కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఆ నోట్ల రద్దు వల్ల ఒరిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ గాయాలు మానుతున్న నేపథ్యంలో బ్యాంకులు తీసుకున్న నిర్ణయం మానుతున్న పుండును గిల్లి కారం చల్లినట్లయింది. నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల ముందు డబ్బులు తీసుకునేందుకు పడిగాపులు కాచిన సామాన్యుడు, ఇప్పుడా ఏటీఎం వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నాడు. బ్యాంకులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలే ఇందుకు కారణం. బ్యాంకులో డబ్బులు వేసినా, తీసినా చార్జీలు వసూలు చేయడంపై సామాన్యుడు కారాలుమిరియాలు నూరుతున్నాడు. అయితే ఈ బ్యాంకుల బాదుడు నుంచి తప్పించుకునే మార్గం ఒకే ఒక్కటి.
అదే ఆధార్ ఆధారిత యాప్ ద్వారా నగదు చెల్లింపులు. ఆధార్ పే యాప్ ద్వారా నగదు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత యాప్‌ను ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. ఈ యాప్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదీ అవసరం లేదు. దుకాణదారుడు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దాన్ని బయోమెట్రిక్ లేదా ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్‌ను అందులో నమోదు చేసి, బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక నగదు చెల్లించడమే తరువాయి.
ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ట్రాన్షాక్షన్ ఫీజులు ఉండవు. బ్యాంకులు డబ్బులు వేయడం, తీయడం, ఏటీఎంల నుంచి డ్రా చేయడంపై విపరీతమైన ఆంక్షలు అమలుచేస్తున్న క్రమంలో ఇంతకంటే మార్గం లేదని సూచిస్తున్నాను. ఇలా సులభంగా పేమెంట్ చేయడం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు ఛార్జీ పడకుండా తప్పించుకోవచ్చని  నా సలహా

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, February 27, 2018

బహుశా ఇది సంధి దశ



                          ఒకనాడు సాయంత్రం ఆరింటికల్లా అమ్మాయి ఇంట్లో లేకపోతే సైకిలేసుకుని వెతకడానికి బయల్దేరే తండ్రి ఇవాళ హాయిగా హైదరాబాద్‌ పంపించి మా అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది అని చెప్పుకోగలుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన మంచి మార్పు ఇది.  డిగ్రీ చదివి ఊర్లో వీధి అరుగుల మీద ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఉద్యోగాలివ్వడం లేదు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆవారా యువబృందాలు ఇపుడు కనిపించడం లేదు. ప్రభుత్వమే ఏకైక దిక్కు అనే భావనను బద్దలు చేయడం వల్ల వచ్చిన పాజిటివ్‌ చేంజ్‌ ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగం ఇరవై యేళ్ల క్రితం ఉన్నట్టుగా ఇపుడు కనిపించడం లేదు.
                         ఎమోషనల్‌ బాండేజ్‌కి ఫిజికల్‌ బాండేజ్‌కి ఉన్న తేడాను అర్థం చేసుకోలేకనో మానవసంబంధాలపై స్పష్టత లేకనో కొందరి జీవితాలు బుగ్గిపాలవుతున్న విషయం వాస్తవమే అయినా అది సంధిదశలో అనివార్యమైన విషాదంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువభాగం విషాదాలు మగవాళ్లు ఇంకా పాత మైండ్‌ సెట్‌ నుంచి రాకపోవడం వల్ల మేల్‌ పిగ్‌ ఇగో వల్ల జరుగుతున్నవి. అందుకోసం మొత్తం పరిణామాన్ని నిందించనక్కర్లేదు.
     ఇవాల్టి పట్టణ సమాజం ముసుగు అంతగా అవసరం లేనిది. ఇన్‌ఫార్మల్‌గా ఉండే గ్రామీణ సమాజంలో మనిషిని గుర్తించేది కులంతో డబ్బుతోనే. పట్టణాల్లో చేసే పనిని బట్టే గుర్తింపు. పట్టణాల్లో అన్నీ ప్రదర్శన వస్తువులే. ఇల్లూ ఒళ్లూ అన్నీ. వేసుకునే చొక్కా, నడిపే వాహనం, ఉండే ఇళ్లు, తినే హోటల్‌, ఆరాధించే దేవత అన్నీ ప్రదర్శనకు పెట్టుకోవాల్సిందే. ఈ ఇరవై యేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. సమానత్వంలో సంతృప్తిని పొందే స్థితి సమాజంలో లేదు కాబట్టి ఆధిక్యంలో సంతృప్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారు. అందుకు మనిషి నిరంతరం పరుగు పెడుతూనే ఉంటాడు. ఇరవై యేళ్లలో ఈ పోటీ విపరీతంగా పెరిగింది. మనిషి స్థానాన్ని వినియోగదారుడు ఆక్రమించినట్టుగానే మనిషి కోసం మనిషి అనే ఆలోచనను పూర్తిగా పోగొట్టి మనిషి కి మనిషి పోటీ అనే వాతావరణాన్ని పెంచింది. చదువుల్లో కెరీర్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి ఇది. ఎక్కువ జీతం పొందడమే చదువు ఏకైక లక్ష్యంగా మారిపోవడం వల్ల మానవశాస్ర్తాలు అనాధల్లాగా మారిన విషాదాన్ని కూడా చూస్తున్నాం. ఈ ధోరణులపై అసంతృప్తితో వచ్చిన  దిల్‌ చాహ్ తా హై, త్రీ ఇడియట్స్‌, జిందగీ దుబారా నహీ మిలేగీ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ కావడం మన అంతరాల్లో ఉన్న కోరికలకు వాస్తవ స్థితికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుందనుకోవచ్చు. బహుశా ఇది సంధి దశ. 
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Monday, February 12, 2018

అసలు MRP అంటేనే చట్టబద్ధమైన దోపిడీ----ముఖ్యంగా మందుల విషయంలో




(Dr.ప్రదీప్ అగరవాల్ గారు ఫేసుబుక్ ద్వారా పంపిన హిందీ పోస్టుకు నా తెలుగు స్వేచ్చానువాదం)
నల్ల డబ్బు    నిషేధించాల్సిన అవసరం ఏమిటి ? ఎందుకు?
"  నిజాయితీ కల వైద్యులు అందరి ని క్షమించమని  ప్రార్థన ...!"
• "హార్ట్ ఎటాక్" ...
డాక్టర్ రాశాడు - Streptokinase ఇంజక్షన్ తీసుకొని .రమ్మని.. దాని ధర రూ. 9,000 / -ఇంజక్షన్ యొక్క నిజమైన వ్యయం రూ. 700 / -నుండి - 900 /-  దాని యొక్క MRP.9000 / -మీరు ఏమి చేస్తారు?
“టైఫాయిడ్”
డాక్టర్ రాశాడు - Monocef   ఇంజెక్షన్లు  మొత్తం 14 తెమ్మని   .దాని ధర 25/- రూపాయలు ,కానీ  హాస్పిటల్ కెమిస్ట్ మీకు రూ. 53 / - MRP కే ఇస్తాడు ... మీరు ఏమి చేస్తారు?
  మూత్రపిండాలు విఫలమైయ్యాయి”
.., ప్రతి మూడవ రోజు డయాలసిస్ చేయాలి.. డయాలసిస్ తర్వాత ఒక-ఇంజెక్షన్ - MRP బహుశా రూ 1800! ఉన్నట్టుగా వుంది
ఇంజెక్షన్ యొక్క అసలు ధర 500 /- కానీ వైద్యుడు ఆసుపత్రిలో తన MRP ని అనగా 1,800/- కి ఇస్తాడు. మీరు ఏమి చేస్తారు?
*”ఇన్ఫెక్షన్ వచ్చింది”
      వైద్యుని యాంటిబయోటిక్, అది 540 / = రూ, దే లవణాన్ని మరొక తయారీ సంస్థ 150 /-కిస్తుంది  అదే జెనరిక్  అయితే 45/- కే ఇస్తుందలేదా /540/-- కే ఇతర కంపెనీలలో .., ఉంటుంది . కానీ డాక్టరు ఒప్పుకోడు అదే కంపెనీది కావాలంటాడు.అంటే వాళ్ళ కేమిస్టు వద్దే కొనాలి ....... మీరు ఏమి చేస్తారు
      టోకు మార్కెట్ నుంచి వారు తక్కువకే  తీసుకుంటున్నారు అనుకుంటున్నారా ! లేదు మీరు మొత్తం భారతదేశం అన్వేషణ జరిపినా, వారు రాసే వాటిల్లో ఏదైనా పొందలేము ... ఎందుకు?
తయారీ సంస్థ అవి  ‘డాక్టర్ సరఫరా మాత్రమే’ అని ఇస్తుంది !!
మార్కెట్లో అల్ట్రాసౌండ్ పరీక్ష 750 /-., ఛారిటబుల్ డిస్పెన్సరీ  అయితే రూ.240 / కే  చేస్తుంది! 750 / లో డాక్టర్ కమిషన్ కోసం రూ.300 / వుంటుంది
MRI లో డాక్టర్ కమిషన్ 2,000 / = నుండి 3,000 / = మధ్య ఉండొచ్చు
వైద్యులు మరియు ఆస్పత్రులు కలిసి చేసే ఈ దోపిడీ ఈ నగ్న, మూగ, అపస్మారక దేశంలో జరుగుతున్నాయి!
ఫార్మాస్యూటికల్ కంపెనీల లాబీ చాలా బలంగా ఉంది, అది  నేరుగా దేశాన్ని బందీగా చేసింది!
వైద్యులు మరియు ఔషధ సంస్థలు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే  ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది  యక్షప్రశ్న ...
భాద్యత గల మీడియా రోజు రాత్రి  పగలు ఏమి చూపిస్తుంది?
డ్రైవర్ లేకుండా నడిచే కారు, కారులోంచి పడిపోయిన ప్రిన్సు, సినిమా చెత్త ,కత్తి-సుత్తి రాఖీ సావంత్, BigBoss, మదర్ఇన్ లా అండ్ కుట్ర,  క్రైమ్ రిపోర్ట్, క్రికెటర్'స్ గర్ల్ ఫ్రెండ్, అన్ని ఈ ప్రదర్శనలలే, కానీ ...ఎవరయినా డాక్టర్, ఆసుపత్రిలో లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలు, చేసే ఈ బహిరంగ దోపిడి ఎందుకు  చూపట్లేదు ?
మీడియా చూపించదు, అప్పుడు ఎవరు చూస్తారు? ఎలా తెలుస్తుంది.వైద్య లాబీ యొక్క దోపిడీ  ఎలా ఆపబడుతుంది? ఈ లాబీ చూస్తూ ప్రభుత్వం నిస్సహాయంగానే  ఉంటుందా?ఎందుకు మీడియా కి ఈ నిశ్శబ్దం?
20 / - ఆటో రిక్షా వాడు ఎక్కువ అడిగితే, మీరు అతని కాలర్ ను పట్టుకుంటారు ..!మరి ఇలాంటి డాక్టర్ లని  ఏమి చేయాలి
ది మేకర్స్ ఆఫ్ ఆడియల్ సొసైటీ కి   వుండాల్సినవి ఆలోచన లో  మార్పు ఒకటి . . . .

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card