చాలా రోజుల తరువాత నాకు ‘యండమూరి’ గారు గుర్తుకు
వచ్చారు. ఆయన గురించి ఎందుకు చెప్పాలనిపించింది
అంటే రక రకాల subjects ని
తెలుగు పాఠకుల దగ్గరికి తీసుకు
వచ్చారు. ఆయన నవల "థ్రిల్లర్" .మీలో కొంతమంది
అయినా చదివివుంటారు. అందులో
absurdity తీసుకుని రాసారు.
నాకు వృత్తి రీత్యా ఖాళీ దొరకక చదవడం తగ్గించాను.ఆయన ఈమధ్య వ్రాసినవి ఏమీ చదవలేదు కూడా. అప్పట్లో ఒక interview లో మీరు అసలు మీరు ఇన్ని successful నవలలు ఎలా వ్రాస్తారు అని అడిగితె correct wording గుర్తులేదు కానీ, "నేను వ్రాసేదానితో నా పాఠకులు వాళ్ళని వాళ్ళు identify చేసుకుంటే అది సక్సెస్ ఫుల్ నవల వ్రాసినట్టే - చదివిన వాళ్ళు తమని తాము ఎంతలా ఆ నవల తాలూకు క్యారెక్టర్ కి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తే అంత ప్రభావితం అయ్యి నట్టు " అని అన్నారు.
అలా ప్రభావితం అయిన వాళ్ళలో నేనూ ఒకడిని –

నేను ఇప్పుడు
చెప్పబోయేది కూడా అయన పుస్తకాలలో వుండే వుంటుంది. కానీ నాకు అనిపించింది
వ్రాస్తాను. ప్రతీ వాడికి జీవితంలో
ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత
clarity of thought వచ్చినా, ఎంత పోరాడినా అవకాశాలు రావచ్చు,
రాక పోనూ వచ్చు. కానీ ఎవడి జీవితానికి వాడే రాజు. తనలో తనకి నమ్మకం పోయినవాడు -వాడు
ఓడిపోయినవాడు.
అసలు గెలవటం అంటే ఏమిటి.
ఒక రిక్షా వాడి కొడుక్కి auto కొనుక్కోడం టార్గెట్ అయితే, వాడికి అది వస్తే చాలు తృప్తి/ గెలుపు. ఒక clerk కొడుక్కి manager post వస్తే చాలు అనుకుంటే అది వాడికి దొరికి పొతే ఒక తృప్తి/ గెలుపు .ఒక అంబాని కొడుక్కి, ఒక మల్టీ నేషనల్ తో ఢీ కొని ఒక deal close చేస్తే ఒక తృప్తి/ గెలుపు .ఒక నిజమైన గురువుకి వాడి శిష్యుడు సాధిస్తే తృప్తి/ గెలుపు .ఇప్పుడు ఒక రిక్షా వాడి కొడుకు మల్టీ నేషనల్ deal close చెయ్యాలంటే - చెయ్యొచ్చు - -కానీ దానికి కావలిసిన శిక్షణ , ఆ పరిస్థితికి చేరుకోవడానికి కావలిసిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక పట్టుదల, దానికి తగ్గ వాతావరణం ఉంటే ఆ పరిస్థితికి చేరొచ్చు. ఎన్నో కారణాల వాళ్ల చేరలేకపోనూ వచ్చు. కానీ ఈ ప్రయత్నం వాడిని ఆటో డ్రైవర్ కంటే better position లోనే నిలబెడుతుంది.
పూర్వం మనవాళ్ళు "ఉద్యోగం పురుష లక్షణం అన్నారు" - ఉద్యోగం అంటే జీతమొచ్చే పని అని కాదు - - ఉద్యోగం అంటే ప్రయత్నం.
‘Shiv Khera’ అని ఒకాయన ‘You can win’ అని ఇంగ్లీషులో ఒక పుస్తకం వ్రాసాడు. అందులో ఆయన ఏమన్నాడంటే ముందు నీ జీవితానికి నువ్వు ఏమీ కావాలని అనుకుంటావో అది define చెయ్యి - తరువాత దాని కోసం ప్రయత్నం చెయ్యి - ప్రయత్నం అంటే రోజూ పగటి కలలు కనడం కాదు. ఒక పేపర్ మీద వ్రాయి ఎలా సాధించాలి అనుకుంటున్నావో స్టెప్ బై స్టెప్. దాని మంచి చెడ్డలు నువ్వు చేస్తున్నప్పుడు తెలుస్తాయి. అనుగుణంగా నీ పద్ధతి improvise చేసుకుంటూ వెళ్ళు - fail అవ్వడమనే ఛాన్స్ లేదు.
ఇది ఫుల్ ప్రూఫ్ అని నాకు అనిపించింది. కానీ ఎక్కడైనా ఆగిపోతే? - solution తెలియకపోతే ఏమిటని ?- -అసలు solution లేని సమస్య లేదు ఈ ప్రపంచంలో - అది ఆ క్షణానికి మన తెలివికి అందక పోవచ్చు - కానీ ఆలోచిస్తూ, ప్రయత్నిస్తూ పొతే, ఖచ్చితంగా దొరుకుతుంది. అంత solution వెతికేంత తెలివితేటలూ లేకపోతే - ఈ జీవిత కాలం లో చేరుకోలేకపోతే ఇంతకు ముందు నేనన్నట్టు దాని కోసం నువ్వు చేసే ప్రయత్నం వృధా పోదు - ఎంతో కొంత అనుభవాన్ని, జ్ఞ్యానాన్ని ఇస్తుంది. అది ఇంకెవరికైనా ఉపయోగ పడుతుంది.
పూర్వం మనవాళ్ళు దేవుడికి ‘ సంకల్పం’ చెప్పమనే వారు. సంకల్పం అంటే నువ్వు ఏది కోరుకుంటూ ఉన్నావో దానిని ఒక clarity తో గట్టిగా అనుకోవడం.
సంకల్పం అంటే గుర్తుకు వచ్చింది నాకు "కొమరం పులి" సినిమా. మంచి concept - డైరెక్టర్ పాపం ఏదో తీసాడు - -కానీ పవన్ కల్యాణ్- సీన్ కి రెండు సార్లు ‘సంకల్పం’ ‘సంకల్పం’ అని అరిచాడు - డైరెక్టర్ సరిగ్గా సంకల్పించుకోలేదు ఏది తీద్దామని - అక్కడ కొట్టింది దెబ్బ
సరే ఇంక విషయానికి వద్దాం. అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది, నువ్వు కావాలనుకున్నది నీకు దొరక్కపోతే. నువ్వేమి కావాలనుకుంటున్నావో అది నీకు తెలియకపోతే.
అసలు ముందు నువ్వు నీకు ఏమి కావాలో తెలుసుకోవాలి. ‘సద్గురువు’ అన్నవాడు నీకు ఇదే చెప్తాడు. ప్రతివాడికి Jackie chan లాగ fighting abilities , లేదా రాహుల్ గాంధీ లాగ ఒక political legacy , లేదా Prince Charles లాగ ఒక royal back ground etc ., ఉండకపోవచ్చు.
జీవితం సుఖంగా ఉండాలంటే నేను అనుకునే దేమిటంటే నీకు ఉన్నదేమిటో గుర్తించి, కావలసిందేమిటో గుర్తెరిగి, చెయ్యాల్సినదేదో చేస్తూ, ఆటుకి- పోటుకీ వెరవక - అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తూ, జరగపోతే క్రుంగిపోక - నీలో ఉన్న నీతో- సత్సంబంధాలు పెంచుకుంటూ - నీ చుట్టు పక్కల వాతావరణం అధ్యయనం చేస్తూ, సమత్వం పొందుతూ - సమాజ హితానికి నువ్వు చెయ్యగలిగేదేమైనా ఉంటే అది చేస్తూ - నువ్వు సంతోషంగా ఉండి - -నీ చుట్టుపక్కల సంతోషాన్ని కలుగ చేస్తూ బ్రతికేయ్యడమే. జీవితానికి అర్ధం పరమార్ధం కూడా అదే.
“Then You are the Hero “
హిందూ వేదాంతం లో ఇది మన వాళ్లెప్పుడో చెప్పారు -చదవడానికి తీరిక, అర్ధం చేసుకోవడానికి ఓపిక, అనుసరించడానికి ధైర్యం కావాలి.

------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681