Thursday, March 12, 2015

ధనం కావాలని అంటే ఏమి చేస్తారు



రోజుల్లో ధనం కావాలని దేవుడిని కోరుకోనివారు ఉండరు. చాలా మంది అనేక పూజలు చేసి, తమ దారిద్ర్యం తొలిగిపోవాలని కోరుకుంటారు. వారి దారిద్ర్యానికి గ్రహ స్థితి, వాస్తు, అన్నిటికన్నా పూర్వ జన్మ సుకృతం ఇలా అన్నీ ఉంటాయి. సహజం గా లక్ష్మి దేవి శుభ్రం గా ఉండే చోటే నివసిస్తుందట. ఇల్లు శుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో అసలు రోదించకూడదు. వంటగది కూడా శుభ్రంగా ఉండాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలి వేయకూడదు. ఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోవటం, ముఖ్యంగ సంధ్యవేళ నిద్ర పోవటం లాంటివి చేయకూడదు. అంతే కాదు నిత్య దీపారాధన కూడా చేయాలి. కూర్మం (తాబేలు) ప్రతిమని చిన్న ప్లేటులో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టటం, తామర వత్తులతో దీపారాధన లాంటివిచేయటం వలన కూడా దారిద్ర్యం మన దరి చేరదు. తామర వత్తుల తోటి ఆరు బయట గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేసి పడమర దిక్కున కూడా ఉంచవచ్చు. దీపారాధన అసురసంధ్య వేళ చేయాలి. అసలు తామరవత్తులు అంటే ఏమిటి ఎలా చేస్తారు అనేది చూద్దాంమామూలు సన్నని వత్తులు 13 తీసుకొని వాటిని పేని ఒకే వత్తి లాగా చేసుకోవాలి. ఇలా 8 వత్తులు చేసుకోవాలి. అంటే మొత్తం 13×8 వత్తులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కోవత్తిని తీసుకొని రెండు చివరలు కలపాలి అంటె సున్నా లాగా ఉంచుకోవాలి, ఇలా మిగిలిన 7 వత్తులను కూడా అలానే చేసి పద్మం లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక తామర వత్తి అవుతుంది. ఇలా రెండు చేసుకొని రెండు ప్రమిదల్లో ఉంచిదీపారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే దారిద్రం దరి చేరదు.

No comments:

Post a Comment

Address for Communication

Address card