Wednesday, July 23, 2014

రూ.5 లక్షల లోపైనా ఐటీ రిటర్నులు తప్పనిసరి

పన్ను పరిధిలోకి వచ్చినవారంతా ఈ అసెస్‌మెంట్ ఇయర్ నుంచి తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) పేర్కొంది. గత రెండు సంవత్సరాల నుంచి రూ.5 లక్షల లోపు జీతం ఆదాయంగా ఉండి, బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.10,000 దాటకపోతే ఐటీ రిటర్నులు దాఖలు నుంచి మినహాయింపునిచ్చారు. ఆ మినహాయింపు కేవలం 2011-12, 2012-13 అసెస్‌మెంట్ సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని, 2013-14కి అందరూ తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని సీబీడీటీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత మే నెలలో రూ.5 లక్షల ఆదాయం దాటిన వారందరూ ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాలని పేర్కొన్న విషయం విదితమే. గత సంవత్సరం ఈ నిబంధన కేవలం రూ.10 లక్షల ఆదాయం దాటితేనే ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల ఆదాయం లోపు వారు ఆన్‌లైన్ ద్వారా కాని లేదా కాగితం రూపంలో కాని రిటర్నులు దాఖలు చేయవచ్చు.

No comments:

Post a Comment

Address for Communication

Address card