Saturday, July 27, 2019

ఇదే ఇండియా అభివృద్ధి


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .
మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది .
NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .
విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .
రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .
ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .
.
జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది ..
.
కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది ..
.
.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి ..
.
మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .

Wednesday, July 10, 2019

కొన్ని జ్ఞాపకాలు


ది.08.07.2019 అనగా ఈ రోజు మన బాపట్ల GST అసిస్టంట్ కమీషనర్ శ్రీ నరసింహులు గారు బదిలీ మరియు వారి  స్థానంలో శ్రీమతి వనజాక్షి గారు నూతనం గా భాద్యతలు స్వీకరిస్తున్న  సందర్భంగా, టాక్సు ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, పొన్నూరు మరియు బాపట్ల లోని  టాక్స్ ప్రాక్టీషనర్లు   వారిని శాలువ మరియు పూల తో గౌరవించుకుంటూ జరిగిన సందర్భంలోనివి





















మీ నికర సంపాదన ఎంత?



బ్యాంకు లో దాచుకుంటే  రూ. 2000 / - లకి  ఒక సంవత్సరానికి, మీకు లభించేది రూ. 160 / - (@ 8% వడ్డీ.)

బ్యాంకు లో  అప్పు తీసుకుంటే  రూ. 2000 / - లకి ఒక సంవత్సరానికి, మీరు చెల్లించేది రూ. 260 / - @ 13% వడ్డీ.

కానీ , అదే రూ. 2000 / - తో మీరు బయట హోటల్లో  భోజనం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది  రూ. 360 / - 18% GST

ఇది ఇదివరకే చెప్పాను ! ఒక సారి  మళ్ళీ గుర్తుచేసుకొండి
ఇప్పుడు  .. నేను ఒక వ్యాపారి వద్ద అతని లాభంతో కలిపి 1000 రూపాయల మూల ధర గల వస్తువును కొనవలసి ఉందని అనుకోండి.దానిపై GST @ 18%  అనుకోండి
నేను ఆ వస్తువు కోసం రూ .1000 + రూ 180 = రూ 1180 చెల్లించాలి.
ఇప్పుడు, ఈ మొత్తాన్ని చెల్లించాలీ అంటే  నేను మొదట రూ .1180 సంపాదించాలి
నేను 20% ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నాను అనుకోండి (సంవత్సరానికి రూ .5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయం).

అప్పుడు నేను 1489.94 రూపాయలు సంపాదిస్తే ,అప్పుడు నేను  ఆదాయపన్ను రూ .297.99 (@ 20%), మరియు రూ .11.92 (ఆదాయపు పన్నులో% 4%) పన్ను చెల్లించాలి, ఇక  పన్నుపోను నా సంపాదన లో మిగిలింది రూ .1180 అప్పుడు మాత్రమె పై వస్తువు నేను కొనగలను
అంటే , రూ .1000 అసలు  ధర గల వస్తువు కొనాలంటే నేను మొదట  రూ .1489.94 సంపాదించాలి
అంటే 1000 రూపాయల వస్తువును కొనుగోలు చేసినందుకు నేను రూ .489.94 పన్నులు చెల్లిస్తాను.

 ప్రియమైన ప్రజలారా,  మీ సంపాదనలో 48.94%  ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల ద్వారా చెల్లిస్తున్నారు  (ఎక్కువ పన్ను స్లాబ్ లో వుంటే ఇంకా ఎక్కువగా ఉండొచ్చు).

ఒక వేళా , 28%  జీఎస్టీ స్లాబ్‌లోని వస్తువులను కొంటె  ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. (ఇది మొత్తం పన్నులలో 61.2% ఉండొచ్చు)

అంటే మీరు 1000 రూపాయలు సంపాదించామని అనుకుంటున్నారు
 కానీ నిజానికి రూ.38.80(లేదా రూ.51.02  )-మాత్రమె మీవి మిగిలినవి ప్రభుత్వానివి.
కనుక, మిత్రులారా, ఇది మీ డబ్బు యొక్క నిజమైన మిగులు. ఖర్చు    పెట్టేటప్పుడు ఈ విషయం తెలుసుకుని ఖర్చు పెట్టండి

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

Monday, July 01, 2019

మూఢనమ్మకము--- శాస్త్రీయం

ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే అనేక
అంశాలు తరువాతి కాలములో  అమెరికా వాడు చెప్పాడు, బ్రిటీష్ వాడు చెప్పాడు అది అలా చేస్తే మంచిదిట...అనే అంశాలు మీకు తెలిసినవి  ఇక్కడ చెప్పగలరా.....
.
ఉదాః  దక్షిణము వైపు చూస్తూ పడుకోరాదు. అది యమ స్థానమ్..
ఈ మధ్య పేపరులో చదివాను..అమెరికా వాడు రీసెర్చ్ చేసి మరీ కనుక్కున్నాడుట...అలా పడుకోరాదని, భూమ్యాకర్షణ శక్తి వల్ల జరిగే మాగ్నెటిక్ ఫీల్డ్స్ కారణముగా బుర్రలో చెడు పరిణామాల గూర్చి.
మరి మన వాళ్ళు యముడు అన్నది అందుకే కదా... ఇలాంటివన్నమాట

మన వాళ్ళు బ్రహ్మముహూర్తం లో ధ్యానము జపాదులు చెయ్యడం ఉత్తమం అని సూచించారు. OBE(out of body experience) సమాధి స్థితిలో మొదటి దశ గురించి పాశ్చాత్యులు కనుగొన్న విషయం ఏంటంటే ఎక్కువ శాతం obe లు పొద్దున 4 నుంచి 6.30 మధ్యలో జరుగుతాయని కనుగొన్నారు. వారు obe లో చెప్పిన అంశాలు ఒక సాధకుడికి మూలాధారం జాగృతం అయినప్పుడు కలుగుతాయి

రాత్రిళ్ళు చెట్టుకింద పడుకుంటే దెయ్యాలు వచ్చి గుండెల మీద కూర్చుంటాయి అని చెప్పేవారు. ఇప్పుడు co2 వల్ల ఊపిరి ఆడదు అంటున్నాము

మన పూర్వీకులు ఆచారాలుగా చెప్పిన విషయాలను మన ప్రస్తుత సమాజం logic గా ఆలోచించి ఇవి అశాస్త్రీయ మైనవాని అంటారు. కానీ అదే విదేశీయులు వాటిని నమ్మి పరిశోదనలు చేసి అవి నిజము అని నిరూ పించు చున్నారు. అప్పుడు మనవాళ్ళు ఆ ఆచారాన్ని నమ్మరు.
Ex: ఏకాదశి నాడు ఉపవాస లేదా నిరాహార దీక్ష ఆరోగ్యానికి మంచిది అని మన పూర్వీకులు చెపితే చాదస్తం అన్నారు చాలా మంది. కానీ అదే ఒక జపాన్ శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధి కి విరుగుడుగా సంవత్సరములో 28 రోజులు, ఒక రోజు లో 10 గంటలు కడుపు ఖాళీ గా ఉంచితే క్యాన్సర్ వ్యాధి రాదు అని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందాడు.
కనుక సనాతన ధర్మాలు, ఆచారాలు అన్నికూడ TESTED, పామరులు కూడా సులభంగా ఆచరించే విధంగా ఆచార వ్యవహారాలను మన పూర్వీకులు నియమించారు. ఇది నా వ్యక్తిగత అభప్రాయము.

సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి, సూర్యునికెదురుగా నిల్చిని సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్పారు పెద్దలు. హుష్.. సెకండ్ షో సినిమా/ లేదా టివీ/ లేట్ నైట్ పార్టీ.. ఆ పైని కబుర్లు, పడుక్కునే సరికి దాదాపు రెండు దాటుతుందా.. మరి సూర్యుడు రాకుండా లేవాలిట..  అది చాదస్తం. కానీ ఇప్పుడు, అలా చేస్తే ఏమవుతోంది? వైటమిన్ డి లోపం, ఎండలో కూర్చోండి.. అదీ పొద్దుటి పూటైతే డి విటమిన్ బాగా శరీరంలో ఏర్పడి, కాల్షియం బాగా ఎముకల్లోకి వెళ్తుంది. పొద్దున్నే యోగా చెయ్యండి.. అంటూ డప్పు తీసుకుని మరీ చెప్తే వింటామండీ.

ఎక్కడైనా ఎప్పుడైనా ఎత్తున కూర్చుని ున్నప్పుడు కాళ్ళు ఊపరాదు....
ఇలా చేస్తే దరిద్రదేవతకు ఆహ్వానం అని పెద్దల హెచ్చరిక
ఇప్పుడు... అలా ూపడం వలన నరాలు దెబ్బతినడమో, బలహీనపడడమో ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నట్లు దశాబ్దాలకిందటే చదివాను.



గాయాలపై తులసి పసరు రాస్తే చాదస్తమనేవారు.
నేడు .... తులసి ఆయింట్మెంట్ చాలా మంచిదంటారు కదా..

ఉదయం పరగడుపున రాగి చెంబులో నీరు త్రాగమన్నారు మనపెద్దలు. అది చాదస్తంగా తలచి మానివేశారు. ఇప్పుడు రాగి పాత్రలో రాత్రంతా నిలవ వున్న నీరు తాగితే మీఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అందుకని ఇప్పుడుచాలామంది రాగి వాటర్ బాటిల్ లోనీరు తాగుతున్నారు. ఏదైనా శంఖంలో పోస్తేనేగానీ తీర్థంకాదు.

పని మనుషులు అన్నీ ముట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు . ఇప్పుడు అన్నీ ఇతరుల చేత చేయించుకుంటుంన్నందు వలననే శరీరం విశాలంగా పెరిగిపోతోందని తేల్చారు

పైవిషయాలన్నీ ఆచారాలు మనం పాటించాము. పాటిస్తున్నామా??... ఆంగ్లేయ సంస్కృతీ సంప్రదాయానుసారణులు వ్యామోహులు వెక్కిరించారు.
ఇంకా కొంతమంది వీరులు ప్రచారమాధ్యమాలలో వెక్కరింతలూ. పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు . సూర్యోదయం కాకముందే లేవాలి
అనే నియమం ఒకటుంది. మనకు దీనికి కారణం ఏమంటే పగలు రాత్రి అనేక తిండిపదార్థాలు తింటాము రాత్రిపడుకునే ముందు చెంబెడు నీరు త్రాగిపడుకోమన్నారు మనం నిద్రించిన తరువాత జఠరం బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు నెడుతుంది. మలముమూత్రముల ద్వారా కొంత చెమట ద్వారా కొన్ని వ్యర్థాలు మరియు ఇంకా కొంత మలినము ఫాలభాగాన పేరుకుంటుంది. ఇది సూర్యోదయమైతే మరలలోపలి కెళ్ళిపోతుంది. అందుచే బద్ధకం తలనొప్పి మొదలగునవి ఏర్పడుతాయి కావున సూర్యోదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని ముఖప్రక్షాళనంచేసుకుంటే ఆ రోజల్లా ఉత్సాహంగా ఉంటుందారోగ్యం. అందుకే సూర్యోదయానికిముందులేవమన్నది .కాని  వింటున్నారా మనవాళ్ళు?
బయట ఆహారం తినద్దు..
పొద్దున్నే లేవండి..
నీళ్ళు చక్కగా తాగండి...
ఉతికిన వస్త్రాలనే ధరించండి...
చాతీ, పొట్ట భాగాలను నొక్కి వుంచే బట్టలను వేసుకొనివ్వకండి...పిల్లలని, మగవాళ్ళని,
6 కల్లా శరీర మలినాలు విసర్జించే వ్యవస్థ ని అలవాటు చేసుకోండి.
వెంటనే స్నానం చేయండి.
జుట్టుని ఎక్కువ సేపు దువ్వండి...
ఇంట్లో వెంట్రుకలు లేకుండ... తల్లో పేలు లేకుండా చూసుకోండి...
వీలైనంత...మౌనం గా వుండటానికి ప్రయత్నం చేయండి...
కొద్ది ఆచారాలు పాటించండి. శరీరానికి పని చెప్పండి... పాత అలవాట్లు మళ్ళీ జీవితం లోకి తెచ్చుకుందాం.. లేదంటే... ఇంకో పదేళ్ళకి మన పిల్లల పిల్లలు మనకి మా టీచర్ ఇలా చెప్పింది అని... మన అలవాట్లనే కొత్తగా పరిచయం చేసే సమయం వస్తుంది. జాగ్రత్త.

Address for Communication

Address card