Pages

Monday, September 25, 2017

ప్రముఖ హోమియో వైద్యుడు డా.II రాతిక్రింద కోటేశ్వరరావు గారికి జ్ఞాపకాలతో నివాళిగా



              ఇద్దరు స్నేహితులు హత్తుకుంటే ఓ ఆలంబన ..! అదే కష్టాల్లో కుంగిపోతున్న స్నేహమయి వెన్ను నిమిరితే..ఆ నెచ్చెలికి కలిగే విశ్వాసం ఏ హిమాలయం కన్నా దిగదిడుపే సుమా! అందుకే 'విశ్వాసం లేకుండా స్నేహం వుండదు..' అంటాడు గౌతమబుద్ధుడు


'ఇంత త్వరగా నిన్ను తీసుకెళ్ళినందుకు
ఏదోరోజు దేవుడు ఉరేసుకుంటాడు తన తప్పులు క్షమించమంటాడు నా సామిరంగ దేవుడోడికి సంకెళ్లు వేసి నడిబజార్లో లాక్కెళ్లుతుంటే ఆకాశం పక్కున నవ్వుతుంది'

      మంచి కొంచెం పెరుగుతుందంటే ఈ వాస్తవిక ప్రపంచమే దాన్ని ఎప్పటికప్పుడు తుంచివేస్తుంటుంది. ఆత్మానంద మయ్యేదంతా అర్థం కావాలని లేదు. అర్థమయ్యిదంతా ఆత్మానందానికి దారి తీయాలని లేదు.                  

                       సామాన్యుడికి వైద్యం ఖరీదయిన  నేటి నిజంలో చిన్న జ్వరం వస్తే దిక్కెవరు? నీ లాంటి స్నేహితులేగా. అర్థరాత్రీ అపరాత్రీ అనే తేడా లేకుండా మందుగోలీ కోసం పరుగులు పెట్టే మనసుకు అంతకు మించిన ఆశలేముంటాయి. ఆ స్నేహితుని చేయి అలాగే పట్టుకోవాలనే తపన తప్ప. పట్టుకోలేక పోయానే అనే భాదతప్ప.. దోస్తానాకు మనసుతో కానీ మనిషితో నిమిత్తం వుండదు
     'శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద వున్నా తక్కువే ...' అంటాడు వివేకానందుడు.. అక్షరసత్యం...
(ఈ లోకాన్ని వదిలి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమయిన నా స్నేహితుడు ,ప్రముఖ హోమియో వైద్యుడు డా.II రాతిక్రింద కోటేశ్వరరావు గారికి జ్ఞాపకాలతో నివాళిగా)


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment