Pages

Monday, September 25, 2017

దైవత్వమా,రాక్షసత్వమా?



 

మనకి నాలుగు యుగాలున్నాయన్న సంగతి మీఅందరికి తెల్సు
ప్రతీయుగంలో ఒక పోరాటం వుంది ఒక విజయం వుంది
మొదట సత్యయుగం
...............సత్యయుగంలో దేవతలకి (దేవలోక వాసులు) రాక్షసులకి(అసుర లోక వాసులు) కి యుద్ధం జరిగింది శత్రువులు వేర్వేరు లోకాల్లో వున్నారు అంటే వేరే ప్రపంచంలో
తర్వాత త్రేతాయుగం
.....................ఈ యుగంలో వేరెవేరు దేశాలమధ్య యుద్దం జరిగింది రామరాజ్యం ,రావణుని లంక రాజ్యం మధ్య
తర్వాత ద్వాపరయుగము
...................ఈ యుగంలో ఒకే కుటుంబంలో రెండు వర్గాల మధ్య (అంటే అన్నదమ్ముల మధ్య పాండవులు,కౌరవులు మధ్య జరిగింది)
ఇక ఇప్పుడు కలి యుగం
...........మరి ఈ యుగంలో ఎవరితో జరగాలి పైన జరిగిన యుద్దాలుఒక సారి పరిశీలిస్తే మొదట ప్రపంచాలమధ్య,తర్వాత దేశాలమధ్య,రాజ్యాల మధ్య,చివరికి ఒకే కుటుంబంలోకి యుద్ధం వచేసింది అంటే దూరం తగ్గుతూ వచ్చింది
మరి కుటుంబం కంటే తక్కువ అంటే మనతో మనమే యుద్ధం చేయాలి.అంటే మంచి చెడు రెండూ మనలోనే ఉన్నాయు.ఏది గెలుస్తుంది. అన్ని యుగాల్లో యుద్ధం బయట జరిగింది అందుకే దేవుడు బయట వున్నాడు అవతారరూపంలో,ఇప్పుడు యుద్ధం లోపల అందుకే దేవుడు నీలోనే వున్నాడు మీరెటు వైపు ?గెలుపు వైపా? ఓటమి వర్గంలో నా?
              దేన్నీ గెలిపిస్తారు అన్ని యుగాల్లో మాదిరిగా ‘మంచి దైవత్వము,సత్యం  వీటినా ,వీటి వ్యతిరేకంగా దుర్మార్గానికి ఒటేస్తారా ఆలోచించండి? దైవత్వమా,రాక్షసత్వమా?

(ఇంగ్లిష్  రాని వారికోసం వాట్స్ ప్ లోవచ్చిన ఆంగ్ల మెస్సేజ్ కి స్వేచ్చానువాదం)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681



No comments:

Post a Comment