Pages

Wednesday, October 31, 2018

నాకో షుగర్ లెస్సూ...లె.....స్సూ.....స్సూ.....


 
 
చీకట్లను చీల్చుకుంటూ..వెలుతురు దారి
చెమటలు కక్కుకుంటూ..అలుపెరగని ఓ బాటసారి

యూజ్ అండ్ త్రోలు.. చిందర వందరగా వ్యర్ధాలు
మరికొన్ని గురుతులు.. కొన్ని మరకలు
మార్నింగ్ వెరీ ఫ్రెస్షూ..ఈవెనింగ్ వెరీ స్ట్రెస్షూ
ఉరుకు పరుగుల జీవితం..ఆశే ఆసాంతం

పేరు మధురం..తీరు దుర్భరం
ప్రతి మనిషికి విరోధి..అంతులేని వ్యాధి

చక్కెర.. షుగర్ ..డయాబెటిక్ ..
ఎలా పిలుచుకున్నా..తీయగా పలుకుతుంది
ఆనక విషం చిమ్ముతుంది

ఆకలికి తీర్చే అన్నం విషమై
తనువెల్లా తూట్లు పొడుస్తుంటే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
వారు గొంతు నులిమేస్తున్నట్లుంది

నిరంతరం చావు భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని హాయిగా జయించాలనే
తెలతెలవారుతుండగా వాకింగులు-జాగింగు ల నే
ఈ వేకువ పోరాటం-బ్రతకటానికి ఆరాటం

నీడ కూడా జాడ చూపని వేళలో
జీవితాన్ని కాచి వడపోసిన వాడిలా
పొద్దూన్నే టీ స్టాల్స్ వద్ద తప్పనిసరి సరిగా వినే వాయిస్సు
బాబూ ఒక కాఫీ....నాకో షుగర్లెస్సూ...
నాకో టీ.... నాక్కూడా..... షుగర్లెస్సూ

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681




No comments:

Post a Comment