Pages

Thursday, June 21, 2018

నువ్వే నచ్చినట్టు బతికి చూడు




ఫలానా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గంటకు లక్ష సంపాదిస్తే నెలకెంత అనే లెక్కలు పెట్టే జెనరల్ నాలెడ్జ్ (?) ప్రశ్న వల్ల ఉపయోగమేమిటి? నువ్వు కూడా సంపాదించి లెక్క పెట్టుకోవాలి తప్ప.. అలాగే ఫలానా దేశంలో నెమళ్ళు తెలుపు రంగులో ఉంటాయని , మరో దేశంలో దోమలు కుట్టకుండా ఉంటాయని చదువుకోవటం దేనికి? నిజంగా కావాలంటే వెళ్ళి చూడాలి తప్ప.... నీకు స్మశానంలో దెయ్యాలుంటాయో లేదో నిజంగా తెలుసుకోవాలంటే దెయ్యం కథలు చదవటం కాదు ఈ రాత్రే వెళ్ళి చూడు.. ఇంకా అన్నం ఉడికిందా లేదా అని మెతుకును పట్టుకొని చూడటమెన్నాళ్ళు చేస్తావు ఎన్ని నీళ్ళు పోస్తే నీకు ఆ అనుమానం రాకుండా ఉడికిపోతుందో నేర్చుకోలేవూ? ఈత కొట్టాలంటే ఒడ్డున కూర్చొని చూడటం కాదు నీళ్ళల్లో దూకాలి.. వర్షం లో తడవటం బావుంటుందని ఎవరో చెప్తే వినటం కాదు నిజంగా తడిస్తేనే ఎందుకు బావుంటుందో తెలియాలంటే తడిచి చూడు.. ఫైనల్లీ బతకటం ఎలా బావుంటుందో వాడూ వీడూ చెప్పటం కాదు.. నువ్వే నచ్చినట్టు బతికి చూడు !
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment