Pages

Tuesday, January 02, 2018

సాయంసంధ్యల వెలుగుల్లో ఇక నిన్నాదరించే తోడేదీ ?

 
చందమామని రమ్మనవు ఈనాటి రాగాలు... 
సూర్యుడిని పోమ్మనవు సాయింత్రపు ద్వారాలు!!
తల్లి ఒడిని కాదందీ ప్రీ కేజీ పాఠశాల... 
భావి ధనరాశి కై పాతికేళ్ళ చెఱశాల .!! 
పారాడు వయసుపై ఈ నైరాశ్యపు భారాలు... 
పసివాడి చదువుల కై లక్షల్లో బేరాలు !!

కఠిక చీకటిలో కలువరించే కన్నబిడ్డ కు ధైర్యమెవ్వరు?
కలలు కంటూ నిదరోయే పసిపాపకి లోకమెవ్వరు?
తడబడు అడుగుకి విడివడని ఊతమెవ్వరు ?
ఓంకార పలుకుల సాకార ఒజ్జలెవ్వరు?

చిరుప్రాయపు రోగానికి వైద్యులెవ్వరు?
అమ్మ నాన్నల కన్న దైవాలు పిల్లలకింకెవ్వరు?

కోట్లను దాచే పోటీ లో నీ చిన్నారి కథలకి చోటేదీ?
సంపాదనకై పట్టే నిశి దివిటీ లో పిల్లలతో కలిసే మాటేదీ?
దూరపు చదువుల లోగిట్లో ప్రేమలు కొసరే బువ్వేది?
తప్పటడుగుల దారుల్లో ముప్పులు తెలిపే నీ గతమేది?

సాయంసంధ్యల వెలుగుల్లో ఇక నిన్నాదరించే తోడేదీ ?
అందమైన కుటుంబం అని చాటే బంధానికిక విలువేది?


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment