Pages

Thursday, February 23, 2017

వరకట్నం తీసుకోవడం తప్పా?


                 ఈ విషయం పరిశీలించే ముందు కొన్ని ప్రత్యేక అంశాలు కూడా పరిశీలించ వలసిన అవసరం వున్నది.
పుత్రులలో కన్న’పుత్రుడు, దత్త’ పుత్రుడు మాదిరిగా కొన్నకున్న పుత్రుడిని "క్రౌతుడు" అంటారు. వరునితరపు వారు అడుగకుండానే వధువు తండ్రి (కన్యాదాత) ప్రీతిపూర్వకంగా యిచ్చునది ‘వరకట్నం’ అంటారు. వరుని తరపువారు కన్యాదాతను అడిగి తీసుకొనుదానిని వర’విక్రయం’ అంటారు. అలాంటి వాటిలో వరకట్నం విశేషమయినది. మరి " వరవిక్రయం" జరిగినప్పుడు ఆ వరుని కొనుకున్న కన్యాదాతకు- ఆ వరుడు ‘క్రౌత’ పుత్రుని మాదిరిగానో లేక ‘దాసు’ని మాదిరో అవుతాడు కానీ అల్లుడు’ అవ్వడు.
                 దాసుడు కానీ, క్రౌత పుత్రుడు కానీ అయినవాడు చేసే పుణ్యకార్యాములలో, కర్మలలో భాగము యజమానికి చెందును. అటువంటి సమయంలో ఈ వర’విక్రయం’లో పొందిన వరుడు (అడిగి కట్నం తీసికొని పెళ్లి చేసుకున్న వరుడు ) తన తల్లి తండ్రులకు చేయు శ్రాద్ధాది పితృకర్మలలో పుణ్యాభాగము కన్యాదాతకు(భార్య తండ్రికి ) చెందును. తన తల్లి తండ్రులకు  చెందవు అందువలన వరవిక్రయం మంచిది కాదు.

                మన సాంప్రదాయంలో అష్టవిధ వివాహములు వున్నవి. అవి  ‘బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పిశాచ’  అనే ఎనిమిది విధములు.
               మొదటి నాలుగు వివాహములలోని వారికి కలుగు సంతానము సత్సంతానము అనబడుతుంది.  వీటిల్లో కన్యదాత వద్ద  కట్నం తీసికొనే విధానం లేదు  కనుక అది  వివాహమే కాదు వరవిక్రయం జరిగిన ఎడల ఆ వరుడు "పతి" గా అనర్హుడే అవుతాడు.ఇంకా ఖచ్హితంగా చెప్పాలంటే మగ వ్యభిచారి అవుతాడు కానీ పతి  అనటానికి వీల్లేదు
ఆమె వారస వినియోగదారు లేదా వారస యజమానురాలు అవుతుంది కానీ భార్య కానే కాదు
               వేద ప్రతిపాదిత కర్మనుష్ఠనంలో యజ్ఞ యాగాది క్రతువులు చేయడం కోసం సహాయకారిగా హ ధర్మ చారిణి అవసరం. భార్యగా వున్న స్త్రీ కేవలం అన్నం వండి పెట్టాడానికో లేక దైహిక అవసరాలు తీర్చడానికో మాత్రమే కాదు, ఆమె మగవాడు చేయ ప్రతి పూజ, జప, కర్మ కాండ, యజ్ఞయాగాధుల నిర్వహణలో భూమిక వహిస్తుంది. భార్య లేకుండా చేయు ఏ కర్మకాండ కూడా, సిద్ధించదు. అందుకే శ్రేష్ఠమయిన కన్యను శ్రేష్ఠమయిన రీతిలో వివాహం చేసుకోవాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment