Pages

Wednesday, January 18, 2017

కర్షకుడు – కర్ణుడు




కాడి బరువాయె కాడేద్దులు పోయే 
కూలైన  లేకా కూడు కరువాయే 
పాడి పంటలు పోయే పచ్చని పందిళ్ళు పోయే 
ధరవరలు కరువాయే

వానలు రాక  ఒక  పక్క  
వరదలు వచ్చి మరోపక్క 
వడ  గండ్లు వచ్చి ఇంకోపక్క 
పచ్చని చేను బీడాయే ఈ పక్కా

నేలతల్లి  కడగండ్లు పాల్జేసే 
పుడమి తల్లి  కొడుకుని కూలీల జేసే 
అప్పుల సుడిలోన ముంచి వేసే 
అర్దంతరంగా  ఆయుష్ష్  తీసే   

దాన  కర్ణుని రీతి  రైతు జీవన  గతి 
ధాన్యమంతా అప్పుల్లోళ్ళకి కొలిచి దరిద్రుడాయె
గురువు శాపంలా  వరుణుడు ఒక  పక్క  -ధరణి  శాపంలా  గర్నమెంటు మరో పక్క  
బ్రాహ్మణా  శాపంలా  వ్యాపారులు ఇంకొక  పక్క   -గో శాపంలా  వడ్డీ  జలగలు  చెరో పక్క 


ఇంత  మంది  చేజిక్కి  యేటుల పోగలవు 
రాబందుల చేజిక్కిన  జింక  పిల్లవు  నీవు 
దారిద్ర్యాన్ని నీలా  ప్రేమించిన  రాఘవేంద్రుడు 
 సన్యాసి అయ్యే -నీ లా ధరణి  ఒదిలి పోలేదేవ్వరు 

ఏనాటికైనా  రాజువు నీవే  -అందరికి అన్నము పెట్టె  జీవుడవు 
అర్దాంతరంగా  దేవుడై పోకు –ఆకలితో ప్రపంచాన్ని చంపకు

పోలిగాడి  కేకలతో పొలమంత  పండాలి 
వరిమడులు  జనవాడలు ధాన్యరాసి తో నిండాలి 
రైతు లేనిది  రాజ్యమేది ? నీవు పోతే మాకెవరు దిక్కు 
నీ మీద ఎందుకయ్యా ఈ పాలకుల జిమ్మిక్కు  
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment